#SchoolPrincipalsDay #HeadMasterDay
ఈ మధ్య కాలం లో ఒక వ్యక్తికి రెండు చేతులూ జోడించి నమస్కరించాలని ఉంది.....ఎవరో కాదు....ప్రధానోపాధ్యాయుడు గా ఉంటూ... మానందరిలో ఉన్నా...కుటుంబసభ్యులతో ఉన్నా...ఏవో ఆలోచిస్తూ...ఎంతో కొంత ఆందోళనతో...కాస్తా అసహనంతో.... @telugumaster
బైటికి చెప్పుకోలేని ఒత్తిడి లో ఉంటున్న ప్రధానోపాధ్యాయుడా నీకు వేల దండాలు.....🙏🙏🙏🙏 నీ ఒత్తిడి ఎవరు అర్థం చేసుకోగలరు.... *చిక్కుముడుల అమ్మ ఒడి...తరగని సముద్రంలా...నాడు..నేడు...తరుముకొస్తున్న...డ్రై రేషన్...నిను వీడని నీడను నేనే అనేట్టు...
దీక్షా ట్రైనింగ్...MDM, STMS, పోర్ట్ ఫోలియో ల అప్డేట్స్....* ఏమని చెప్పను...ఎన్నెన్ని చెప్పాను...HM ల తిప్పలు....ఒకప్పుడు సమర్థుడైన HM పాఠశాలని... ని స్టూడెంట్స్ ని నిరంతరం పరిశీలిస్తూ...పాఠశాలను ఒక క్రమపద్ధతిలో ఉంచేవారు.
అసలు నాకు తెలిసి...HM లకి కావాల్సింది దీక్షా ట్రైనింగ్ లు కాదు....కంప్యూటర్ ని ఎలా వాడాలి...ఇన్ఫర్మేషన్ ఎలా అప్డేట్ చెయ్యాలి....సింపుల్ గా చెప్పాలంటే....ఓ సాఫ్త్వేర్ ఇంజినీర్ గా తయారు చెయ్యాలి..... పాఠాలు చెప్పడంలో ఎంతో దిట్ట అయిన ఓ టీచర్...
ఈ కంప్యూటర్ పనులవల్ల నెట్ సెంటర్స్ చుట్టూ ఈ వయసులో చాలా అగచాట్లు పడుతున్నారు.... *కాలంతో పరిగెట్టాలి మాస్టారు* అని మీరు అంటే నేనేం చెప్పలేను గాని.....భావితరాలను తీర్చి దిద్దే ఓ మంచి ఉపాధ్యయుడు మాత్రం కనుమరుగైపోవడం ఖాయం....100 మందిలో ఒక్క విద్యార్థి కి
అమ్మ ఒడి గాని....ఒక బ్యాగ్ గాని....ఒక గుడ్డు గాని రాకపోతే...ఇక ఆ HM ఆ పేరెంట్స్ చేతిలో ఖతం.....
*ఏదో మార్పు జరిగిపోతుంది....యాంత్రికంగా....HM హుషారుగా తరగతి గదికి వెళ్లి నేను పిల్లలతో ప్రశాంతంగా భవిషత్ పాఠాలు చెప్పే రోజులు రావాలి...ఈ పనులన్నీ చెయ్యడానికి...
కొత్తగా వచ్చిన సచివాలయంలో ఒక పోస్ట్ ఉంది అనుకుంటాను....వారికి ఈ పనులు అప్పజెప్పితే....ఒకప్పుడు మన పాఠశాల పూర్వ వైభవం వస్తుందని నా ఆశ*
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#WorldLaughterDay 😆
1995లో మార్చి 13 న భారతీయ వైద్యుడు ... డా. మదన్ కటారియా ప్రపంచ నవ్వుల దినాన్ని స్టృస్టించారు . నవ్వుల క్లుబ్ గా ప్ర్రరంభమయిన ఈ పండుగ రానురాను 65 దేశాలలో ఆరువేల కు పైగా నవ్వుల క్లబ్ లుగా విలసిల్లినాయి.
ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని మొదట్లో జనవరి రెండో ఆదివారం
నాడు జరుపుకునేవారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో జనవరిలో చలి వాతావరణముంటుంది కాబట్టి ఈ తేదీని మార్చాలని హాస్య ప్రియులు కోరారు.దాంతో లాఫ్టర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్లు ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే మొదటి ఆదివారం నాడు జరపాలని నిర్ణయించారు.
మొట్టమొదటి నవ్వుల దినోత్సవాన్ని 1998 జనవరి 11వ తేదీన ముంబయిలో నిర్వహించారు. దీనికి 1200 మంది హాజరయ్యారు. భారతదేశం వెలుపల మొదటిసారిగా కోపెన్‌హాగెన్‌లో నిర్వహించారు. జనవరి 9వ తేదీన జరిగిన ఈ దినోత్సవానికి పదివేలమంది హాజరయ్యారు.
#BabyDay 🍼👼🚼
అప్పుడే జన్మించిన లేదా నెలల వయస్సు గల పిల్లలను శిశువు గా వ్యవహరిస్తారు.వీరు ఆహారముకోసము ముఖ్యముగా తల్లిపాలపై ఆధారపడి ఉంటారు.తల్లిపాలలో శిశువుకి కావాల్సిన శక్తి, అన్ని పోషకాలు ఉంటాయి అందుకే ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు,
క్యాన్సర్ ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చేఅవకాశం తక్కువగా ఉంటుంది. ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు ఇతర ఆహార పదార్థాలతో పాటు తల్లీపాలు కూడా ఇవ్వాలి.
👶చంటిపిల్లలకు తల్లిపాలు ఆరు నెలల వరకు సరిపోతాయి. తల్లిపాలతో పాటు అదనపు ఆహారం 6 నెలల నుండి ప్రారంభించాలి, మొదటిగా పండ్లరసం వంటి ద్రవాలు తరువాత ఆకుకూరలు, కూరగయలు ,పప్పులు ,ధాన్యాలు కలగలిపినటువంటి గుజ్జు పదార్థాలు, క్రమేపి ఇడ్లి , అన్నం వంటి ఘనపదార్థాలు ఇవ్వాలి .
భూగోళంపై అడవుల క్షీణత మానవాళి మనుగడను ప్రమాదంలోకి నెట్టేస్తోంది. వృక్ష సంపద తరిగేకొద్దీ కరవు కాటకాలు, తుపాన్లు, వరదలు, ఇతర వాతావరణ మార్పులు మానవాళికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. భవిష్యత్తు తరాలు ఎదుర్కొనబోయే ఘోర పరిస్థితులు కళ్లముందే సాక్షాత్కరిస్తున్నాయి.
కొన్నేళ్లుగా భారత్‌లోనే కాకుండా, ప్రపంచ దేశాల్లో కార్చిచ్చు పెద్దయెత్తున అడవులను భస్మీపటలం చేస్తున్న తీరు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వచ్చినా కార్చిచ్చును నియంత్రించడం అభివృద్ది చెందిన దేశాలకు సైతం కష్టతరంగా మారుతోంది.
#MaharastraDay
1947లో స్వాతంత్ర్యం తరువాత బొంబాయి ప్రెసిడెన్సీలో మహారాష్ట్ర ప్రాంతం, విదర్భ, నాగపూర్, వాటితో మరికొన్ని రాజ సంస్థానాలు విలీనం చేసి 1950లో బొంబాయి రాష్ట్రం ఏర్పాటు చేశారు. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర, (మరాఠీ: #महाराष्ट्र ) భారతదేశంలో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం (ఉత్తరప్రదేశ్ తరువాతి స్థానం). మహారాష్ట్రకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్నాటక, గోవా రాష్ట్రాలతోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా-నగరుహవేలి తోనూ
సరిహద్దులున్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. ముంబయి నగరం మహారాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం.
మహారాష్ట్ర ప్రాంతము ఋగ్వేదంలో రాష్ట్రఅనీ, అశోకుని శాసనాలలో రాష్ట్రీకము అనీ, అతరువాత హువాన్‌త్సాంగ్ వంటి యాత్రికుల రచనలలో మహారాష్ట్ర అనీ ప్రస్తావింపబడింది.
మే దినోత్సవం లేదా మే డే (#MayDay)
ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. చాలా దేశాలలో మే దినం, #అంతర్జాతీయ_కార్మిక_దినోత్సవం లేదా కార్మిక దినోత్సవం తో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. #InternationalLabourDay
భారతదేశంలో 1947లో మనకు స్వాతంత్ర్యం లబించేంత వరకు భూస్వామ్య వ్యవస్థవుండేది. ఈ వ్యవస్థలో రాజులు తమకు సైనికులను, ఉంపుడుక తెలను సరఫరా చేసినందుకుగాను, విలువైన కానుకలను సమర్పించుకున్నందుకు గాను కొంతమంది వ్యక్తులకు భూములను బహుమానంగా ఇచ్చేవారు. ఈ భూముల్లో వారు శిస్తులు వసూలు చేసి
కొంతభాగం రాజుకి చెల్లించగా మిగిలినది తమ సాంతానికి వాడుకొనేవారు. ఈ భూములను రైతులకు యిచ్చి వ్యవసాయం చేయించి ఫలసాయం తాము తీసుకొనేవారు. అన్ని వృత్తులవాళ్ళు ఎండనక, వాననక భూస్వాములకు పనులు చేసిపెట్టే వాళ్ళు. ఇందుకు వారికి ఎటువంటి ప్రతిఫలం లభించేదికాదు. దీనిని వెట్టి చాకిరీ అనేవాళ్ళు.
#FatherOfIndianCinema#DadaSahebPhalke
ఒక అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలన చిత్ర రంగం ఆవిష్కారమైనది.వెండి తెరపై భారతీయ దేవుళ్ళను చూడాలనే స్వప్నం కళ్లకెదురుగా కదలాడింది. ఆనాడు బైస్కోపులు అమెరికా, ఇతర నాగరిక పాశ్చాత్య దేశాల నుండి
దిగుమతి అయ్యేవి. చెక్కబొమ్మలు చెక్కేవారు. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, మాజిక్, మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరినవాడై స్వాప్నికుడిగా మారిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగారు. దాదా సాహెబ్ ఫాల్కేగా గణుతికెక్కారు.
ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే (ఆంగ్లం : Dhundiraj Govind Phalke), జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే (మరాఠీ భాష : दादासाहेब फाळके) (ఏప్రిల్ 30, 1870 - ఫిబ్రవరి 16, 1944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి.