#WorldLaughterDay 😆
1995లో మార్చి 13 న భారతీయ వైద్యుడు ... డా. మదన్‌ కటారియా ప్రపంచ నవ్వుల దినాన్ని స్టృస్టించారు . నవ్వుల క్లుబ్ గా ప్ర్రరంభమయిన ఈ పండుగ రానురాను 65 దేశాలలో ఆరువేల కు పైగా నవ్వుల క్లబ్ లుగా విలసిల్లినాయి.

ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని మొదట్లో జనవరి రెండో ఆదివారం
నాడు జరుపుకునేవారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో జనవరిలో చలి వాతావరణముంటుంది కాబట్టి ఈ తేదీని మార్చాలని హాస్య ప్రియులు కోరారు.దాంతో లాఫ్టర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ వాళ్లు ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే మొదటి ఆదివారం నాడు జరపాలని నిర్ణయించారు.
మొట్టమొదటి నవ్వుల దినోత్సవాన్ని 1998 జనవరి 11వ తేదీన ముంబయిలో నిర్వహించారు. దీనికి 1200 మంది హాజరయ్యారు. భారతదేశం వెలుపల మొదటిసారిగా కోపెన్‌హాగెన్‌లో నిర్వహించారు. జనవరి 9వ తేదీన జరిగిన ఈ దినోత్సవానికి పదివేలమంది హాజరయ్యారు.
ఈ ఉత్సవ విశేషాలు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కూడా నమోదయ్యాయి. 2004 మే 2వ తేదీన స్విట్జర్లాండ్‌ రాజధాని నగరంలో ఈ ఉత్సవం జరిగింది. ఆ దేశపు పార్లమెంటు చుట్టూ నవ్వుతూ ప్రదక్షిణ చేయడం ఈ ఉత్సవంలో విశేషం.
నవ్వడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రపపంచశాంతి ఈ దినోత్సవ నిర్వహణ పరమార్థమని నిర్వాహకుల అభిప్రాయం వచ్చిన సందర్భం కూడా ఇదే. ఆ రకంగా ఈ 'డే' మనకు కొత్త స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం!
ప్రతి మనిషికీ - ఎక్కడ పుట్టినా, మరెక్కడ పెరిగినా... అర్థం అయ్యే భాష నవ్వు. బహుశా ప్రతి ఒక్కరి నవ్వులోనూ అర్థం కూడా ఒకటే. నవ్వడం మనం నేర్చుకోనక్కరలేని భాష. పుట్టుక నుండే మనకు నవ్వు వస్తుంది. మరో విశేషం ఏంటంటే, నవ్వు మనకు తెలీకుండానే వస్తుంది.
వచ్చిన నవ్వును బలవంతంగా మనం ఆపగలమే కానీ, బలవంతంగా నవ్వలేం (ఇప్పుడు చాలా మంది తంటాలుపడి పడీ పడీ నవ్వుతుంటారనుకోండి, రాకపోయినా). ఆడాళ్ల నోళ్లలో నువ్వులు నానతాయో లేవో గానీ, అందరి నోళ్లల్లోనూ నవ్వులు నానలేవు. అందరి ముందూ నవ్వడానికి మొహమాటపడే మహామహులు కూడా పక్కకి వెళ్లి
నవ్వును కక్కేయవలసిందే.

పుట్టుకతో వచ్చిందే...

సకల జీవరాశిలో మానవుడికో - మానవుడికి మాత్రమేనో- నవ్వుకునే, నవ్వే గుణమూ, లక్షణమూ .. అబ్బాయనుకోవడం మన అజ్ఞానం. చాలా గుణాలలాగే, నవ్వు కూడా మనకు మన పూర్వీకులైన మహా వానరాల నుండి వారసత్వంగా వచ్చిందని ఆలస్యంగా తెలుసుకున్నాం, నవ్వుకున్నాం.
చింపాంజీలను, గొరిల్లాలను చక్కిలిగిలి పెడితే (పెట్టగలిగితే), అవీ ఎంచక్కా నవ్వుతాయి. కానీ మనలా 'హ హ హ' అనే టైపులో మాత్రం కాదు. వాటి నవ్వు శబ్దాలు వాటివి. ఆ శబ్దాలే మానవ నవ్వు మూలాలు, అయితే నవ్వు నేర్చుకున్న విద్య కాదు. జన్మత: లభించిన లక్షణం.
పుట్టు అంధులు, బధిర శిశువులు కూడా ఎంచక్కా నవ్వుతారు.

ఒక మనిషి ఎంత సంతోషంగా వున్నాడో తెల్సుకోడానికి అతను రోజుకు ఎన్నిసార్లు మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడో లెక్కవేస్తే సరిపోతుంది. ఒంటరిగా వున్నప్పటికంటే జనంలో వున్నప్పుడు మనం 30 రెట్లు ఎక్కువగా నవ్వుతాం.
తోడెవరూ లేకుండా సినిమాల్లో కామెడీ సన్నివేశాలు చూసినా, మంచి జోక్‌ చదివినా మనసుకు ఆహ్లాదకరంగా వుంటుందే తప్ప నవ్వు ముంచుకురాదు. నిజజీవితంలో మనకు నవ్వు తెప్పించే సందర్భాలు సినిమాల్లో కామెడీ సన్నివేశాలంత పదునుగా వుండవు.
ఎదుటివారి ముఖకవళికలు, కామెంట్లు, చేష్టలు చాలు మనం పగలబడినవ్వేందుకు. మరో ముఖ్యమైన విషయం ఒకటుంది. ఆడవాళ్లు మగవాళ్లకంటే ఎక్కువసార్లు నవ్వుతారట. మనసు దోచుకున్న మగువను నవ్వించడానికి మగవాళ్లు నానా తంటాలూ పడితే తమకు నచ్చిన వాడి సన్నిధిలో అతివలు అధికంగా నవ్వులు కురిపిస్తారట.
కలిసి వున్న సమయంలో 62 శాతాన్ని హాస్యరసంలో ముంచెత్తే మగవాళ్లను అమ్మాయిలు ఇష్టపడితే,తమ హాస్యంలో కనీసం 65 శాతానికి స్పందించే అమ్మాయిలను అబ్బాయిలు కోరుకుంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అడల్ట్‌ జోకులు పురుషులకు చక్కిలిగింతలు పెడితే,మహిళలు మాత్రం మంచి హాస్యరసం పలికే జోకులకే ఓటేస్తారట.
తమ మీద తామే జోకులు వేసుకుని నవ్వుకోగలిగేవాళ్లకు ఆత్మవిశ్వాసం అత్యధిక స్థాయిలో వుంటుంది.తమ మీద ఇతరులు పేల్చే జోకుల్ని తట్టుకోలేని వాళ్లు ఆత్మన్యూనతతో బాధపడుతున్నట్టే లెక్క. సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువగా వున్న ఉద్యోగులే ఎక్కువ సామర్థ్యంతో పని చేయగలుగుతారని మరో అధ్యయనం
తేల్చి చెప్తోంది.

అసలు మన దేశంలో హాస్యానికి మొదటి నుంచి ప్రముఖ స్థానం వుంది. రాజుల ఆస్థానాలలో విదూషకులు అందుకే వుండేవారు. బీర్బల్‌, తెనాలి రామకృష్ణ వంటి వారి కథలు గిలిగింతలు పెడతాయి. జానపద గీతాల్లోనూ, హాస్యరసం పుష్కలం. అప్పటిదాకా ఎందుకు! నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిదని
నేటి డాక్టర్లు సైతం చెబుతున్నారు. హాస్యం హాయిగా వున్నామనే భావన కలిగిస్తుంది. క్రమంగా ప్రపంచమంతటా హాస్యాన్ని, నవ్వును చికిత్స సాధనంగా గుర్తిస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌ ఇతర పాశ్చాత్య దేశాలలో ఆస్పత్రులకు అనుబంధంగా నవ్వుల ఆస్పత్రులు ఏర్పడ్డాయి.
వీటిలో హాస్య చిత్రాలు, వీడియోలు చూపిస్తారు. పెద్ద కారణం లేకుండా నవ్వడం పిచ్చి అనుకుంటే మీరు పొరబడినట్టే. కడుపుబ్బ నవ్వేవారు ఒత్తిడి తగ్గించుకుని ప్రపంచంలో హాయిగా సర్దుకోగలరన్నమాట. తమ సమస్యలను, సంకోచాలను పక్కనబెట్టి హాయిగా నవ్వడం ద్వారా మెరుగైన జీవనానికి సాగిపోతారన్నమాట.
హాస్య ప్రియత్వం తగ్గుతోందా!

నవరసాల్లో ఒకటి హాస్యం. కానీ ఒక రకంగా అది మన జీవితాల్లో తగ్గిపోతోందనిపిస్తోంది. కోపం..ముభావం...ఆవేశం...అసంతృప్తి...ఎప్పుడూ మన వెన్నంటి వుండేవే. సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తున్నా వీటినుంచి మనిషి బయటపడలేకపోతున్నాడు
దానికి ఒకటి రెండూ కాదు. ఎన్నో కారణాలు. జీవితంలో పెరిగే వేగం, ఒత్తిడి, పోటీ, సమస్యలు ... ఇంకా ఎన్నెన్నో. ఇవే మనషిని నవ్వుకు దూరం చేస్తున్నాయి. అసలు నవ్వడమే మర్చిపోయేలా చేస్తున్నాయి. చార్లీచాప్లిన్‌ నుంచి బ్రహ్మానందం వరకు హాస్యనటులు నవ్వులు పండిస్తున్నా జీవితంలో
నవ్వులు కరువవుతున్నాయి. ఆరోగ్యకమైన హాస్యం ఇవాళ్టి జీవితంలో లోపిస్తోంది. అవసరాలు తీర్చుకునేందుకు, డబ్బు సంపాదించేందుకు చేసే పరుగుపందెంలో ఏళ్లు గడిచిపోతున్నాయి.
కాసేపు నింపాదిగా, హాయిగా గడిపే తీరిక వుండడంలేదు. ఇలా గడిపితేనే కదా, మనుషుల మధ్యన మాటా ముచ్చట వుండేది, సంభాషణ కొనసాగేది. అప్పుడే హాస్యం పుడుతుంది. సంభాషణలో చతురోక్తులకీ, ఛలోక్తులకీ చోటు వుంటుంది. కానీ అలాంటి అవకాశం, తీరిక ఇప్పుడు లేదు మరి.
ఇంతేకాక ఎప్పుడూ ఏవో చికాకులతో, చింతలతో, అర్థం లేని లక్ష్యాల సాధనకోసం పరుగులాటలో ఒత్తిడిలో కాలం గడిపేస్తుంటారు. ఇలా నిరంతరం ఒత్తిడికీ, దిగుళ్లకీ లోనై మనుషుల్లో హాస్య ప్రియత్వం తగ్గిపోతోంది. హాయిగా స్వేచ్ఛగా, నవ్వే అమ్మాయిలు అరుదుగా కనిపిస్తారు. మగవాళ్లలోనూ నవ్వు ఎక్కడ వుంది?
ఏదో సీరియస్‌గా ముఖమంతా గంటు పెట్టుకొని కూచుంటారు. నవ్వుతూ, నవ్విస్తూ చలాకీగా వుండే తత్వం కూడా అరుదే. అందుకే నవ్వు భాగ్యమైపోయింది. అందుకే ఇప్పుడు నవ్వడం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరమొచ్చింది. ఇప్పుడు నగరాల్లో, పట్టణాల్లో లాఫింగ్‌ క్లబ్బులు ఏర్పడ్డాయి.
నవ్వులను మరిచిపోయిన వాళ్లకు నవ్వడం నేర్పిస్తున్నాయి. నవ్వడాన్ని ప్రాక్టీస్‌ చేయిస్తున్నాయి. నవ్వును చంపేసిన మనమే నవ్వడం నేర్చుకుంటున్నాం. ఏది ఏమైనా ఎరుపెక్కిన ముఖం, వంకరతిరిగిన మూతి, బరువెక్కిన హృదయం... అన్నిటికీ విరుగుడు నవ్వే. హాస్య చిత్రాలు, నాటకాలు, రచనలు, కార్టూన్లు వగైరాల
వల్ల గుండె బరువెక్కే ప్రమాదమే వుండదు.

నవ్వుతో జబ్బులకు చెక్‌

జబ్బులలో 70 శాతం ఏదో ఒక విధమైన ఒత్తిడికి సంబంధం వున్నవే. అధిక రక్తపోటు, గుండెజబ్బులు, డిప్రెషన్‌, ఇన్సోమియా, మైగ్రిన్‌, ఆతృత, అలర్జీ, పెప్టిక్‌ అల్సర్‌... వగైరాలు ఆ కోవకు చెందినవే.
నవ్వుల మందు తీసుకుంటే ఆవి తగ్గుముఖం పట్టే అవకాశం వుంది. అయితే దీర్ఘకాలిక వ్యాధులు కేవలం నవ్వు మందుతోనే తగ్గుతాయని చెప్పలేం. పైగా ఒత్తిడికి గురవడం వల్ల అడ్రినాలిన్‌ ఎక్కువగా విడుదలౌతుంది. నవ్వితే అది బాగా తగ్గుతుంది. తమలో తాము ముడుచుకుపోయే వారితో పోలిస్తే తరచూ నవ్వేవారికి
గుండెజబ్బు వచ్చే ప్రమాదం తక్కువ.

టెన్షన్‌ తగ్గించే సేఫ్టీ వాల్వులాంటి నవ్వు వల్ల ఒత్తిడికి కారణమైన హార్మోన్ల ఉత్పత్తి తగ్గి ఉపశమనం కలుగుతుంది. 10 నిమిషాలు నవ్వగలిగితే 10-20 మి.మీ రక్తపోటు తగ్గుతుంది. రోజువారీ నవ్వులు రోగనిరోధక వ్యవస్థను వృద్ధి చేస్తాయి.
అందుకు అవసరమైన లింపాసైట్స్‌ ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే ముక్కు, శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన పొరలలో నవ్వుల వల్ల మెరుగుదల వుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో సహజరోగ నిరోధకాలైన హార్మోన్ల ఉత్పత్తి పెరిగి, ఆర్తరైటిస్‌(Arthritis), స్పాండులైటిస్‌, మైగ్రిన్‌ వంటి వ్యాధుల్లో
ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం పెరుగుతాయి. కనుక ఆస్తమా రోగులకూ మేలు కలుగుతుంది.

జీవితంలో ఆశ, విశ్వాసం అవసరం. హాస్యం ఆ రెంటినీ ఇస్తుంది. సజీవమైన నవ్వులు తొణికిసలాడేవారే అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులు. పసిపిల్లల బోసి నవ్వులు గుర్తు చేసుకుంటే
మీ విచారం క్షణంలో మాయమౌతుంది. అందుకనే ఎవరైనా హాయిగా నవ్వుతుంటే చూసి విసుక్కోకుండా, ఎగతాళిగా నవ్వుకోకుండా... మీరూ ఆ నవ్వులలో పాలు పంచుకోండి మరి.మీ నవ్వే మీకు టానిక్‌.
Today is WorldLaughterDay:

This day takes place on the 1st Sunday of May of every year.

1st celebration was on May 10, 1998, in Mumbai & was arranged by Dr. #MadanKataria, founder of worldwide Laughter Yoga movement

A day without laughter is a day wasted. #HappyLaughterDay
ప్రపంచ నవ్వుల దినోత్సవం😀 😂🤣

నిశ్శబ్దం లో నీ నవ్వులు

గలగల వినిపిస్తాయి

ముసుగేసిన ఆకాశం

ముసురు పట్టిన సాయంత్రం

కిటికీ రేకులపై

కురిసే చినుకుల్లా

కరెంటులేని

నిద్రపట్టని రాత్రి

చమురుదీపం వెలుగు
సాగిన చువ్వల నీడలను

మాయం చేసే మెరుపుల్లా

నిశ్శబ్దం లో నీ నవ్వులు

గలగలా వినిపిస్తాయి

రచయిత:- తమ్మినేని యదుకులభూషణ్

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

2 May
#BabyDay 🍼👼🚼
అప్పుడే జన్మించిన లేదా నెలల వయస్సు గల పిల్లలను శిశువు గా వ్యవహరిస్తారు.వీరు ఆహారముకోసము ముఖ్యముగా తల్లిపాలపై ఆధారపడి ఉంటారు.తల్లిపాలలో శిశువుకి కావాల్సిన శక్తి, అన్ని పోషకాలు ఉంటాయి అందుకే ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు,
క్యాన్సర్ ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చేఅవకాశం తక్కువగా ఉంటుంది. ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు ఇతర ఆహార పదార్థాలతో పాటు తల్లీపాలు కూడా ఇవ్వాలి.
👶చంటిపిల్లలకు తల్లిపాలు ఆరు నెలల వరకు సరిపోతాయి. తల్లిపాలతో పాటు అదనపు ఆహారం 6 నెలల నుండి ప్రారంభించాలి, మొదటిగా పండ్లరసం వంటి ద్రవాలు తరువాత ఆకుకూరలు, కూరగయలు ,పప్పులు ,ధాన్యాలు కలగలిపినటువంటి గుజ్జు పదార్థాలు, క్రమేపి ఇడ్లి , అన్నం వంటి ఘనపదార్థాలు ఇవ్వాలి .
Read 13 tweets
1 May
#SchoolPrincipalsDay
#HeadMasterDay
ఈ మధ్య కాలం లో ఒక వ్యక్తికి రెండు చేతులూ జోడించి నమస్కరించాలని ఉంది.....ఎవరో కాదు....ప్రధానోపాధ్యాయుడు గా ఉంటూ... మానందరిలో ఉన్నా...కుటుంబసభ్యులతో ఉన్నా...ఏవో ఆలోచిస్తూ...ఎంతో కొంత ఆందోళనతో...కాస్తా అసహనంతో....
@telugumaster
బైటికి చెప్పుకోలేని ఒత్తిడి లో ఉంటున్న ప్రధానోపాధ్యాయుడా నీకు వేల దండాలు.....🙏🙏🙏🙏 నీ ఒత్తిడి ఎవరు అర్థం చేసుకోగలరు.... *చిక్కుముడుల అమ్మ ఒడి...తరగని సముద్రంలా...నాడు..నేడు...తరుముకొస్తున్న...డ్రై రేషన్...నిను వీడని నీడను నేనే అనేట్టు...
దీక్షా ట్రైనింగ్...MDM, STMS, పోర్ట్ ఫోలియో ల అప్డేట్స్....* ఏమని చెప్పను...ఎన్నెన్ని చెప్పాను...HM ల తిప్పలు....ఒకప్పుడు సమర్థుడైన HM పాఠశాలని... ని స్టూడెంట్స్ ని నిరంతరం పరిశీలిస్తూ...పాఠశాలను ఒక క్రమపద్ధతిలో ఉంచేవారు.
Read 7 tweets
1 May
#WildfireCommunityPreparednessDay వేసవి వచ్చిదంటే చాలు.. అడవులను కార్చిచ్చు కాటేస్తుంటుంది. విలువైన అటవీ సంపదను దహిస్తుంది. ఫలితంగా ప్రభుత్వానికి ఆస్తి నష్టం, వన్యప్రాణులకు ప్రాణ నష్టం, మనుషులకు అటవీ సంపద నష్టం వాటిల్లుతుంటుంది.
#Wildfire #Seshachalam #Nalamalla @RayaIaseema
భూగోళంపై అడవుల క్షీణత మానవాళి మనుగడను ప్రమాదంలోకి నెట్టేస్తోంది. వృక్ష సంపద తరిగేకొద్దీ కరవు కాటకాలు, తుపాన్లు, వరదలు, ఇతర వాతావరణ మార్పులు మానవాళికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. భవిష్యత్తు తరాలు ఎదుర్కొనబోయే ఘోర పరిస్థితులు కళ్లముందే సాక్షాత్కరిస్తున్నాయి.
కొన్నేళ్లుగా భారత్‌లోనే కాకుండా, ప్రపంచ దేశాల్లో కార్చిచ్చు పెద్దయెత్తున అడవులను భస్మీపటలం చేస్తున్న తీరు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వచ్చినా కార్చిచ్చును నియంత్రించడం అభివృద్ది చెందిన దేశాలకు సైతం కష్టతరంగా మారుతోంది.
Read 17 tweets
1 May
#MaharastraDay
1947లో స్వాతంత్ర్యం తరువాత బొంబాయి ప్రెసిడెన్సీలో మహారాష్ట్ర ప్రాంతం, విదర్భ, నాగపూర్, వాటితో మరికొన్ని రాజ సంస్థానాలు విలీనం చేసి 1950లో బొంబాయి రాష్ట్రం ఏర్పాటు చేశారు. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర, (మరాఠీ: #महाराष्ट्र ) భారతదేశంలో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం (ఉత్తరప్రదేశ్ తరువాతి స్థానం). మహారాష్ట్రకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్నాటక, గోవా రాష్ట్రాలతోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా-నగరుహవేలి తోనూ
సరిహద్దులున్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. ముంబయి నగరం మహారాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం.
మహారాష్ట్ర ప్రాంతము ఋగ్వేదంలో రాష్ట్రఅనీ, అశోకుని శాసనాలలో రాష్ట్రీకము అనీ, అతరువాత హువాన్‌త్సాంగ్ వంటి యాత్రికుల రచనలలో మహారాష్ట్ర అనీ ప్రస్తావింపబడింది.
Read 6 tweets
1 May
మే దినోత్సవం లేదా మే డే (#MayDay)
ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. చాలా దేశాలలో మే దినం, #అంతర్జాతీయ_కార్మిక_దినోత్సవం లేదా కార్మిక దినోత్సవం తో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. #InternationalLabourDay
భారతదేశంలో 1947లో మనకు స్వాతంత్ర్యం లబించేంత వరకు భూస్వామ్య వ్యవస్థవుండేది. ఈ వ్యవస్థలో రాజులు తమకు సైనికులను, ఉంపుడుక తెలను సరఫరా చేసినందుకుగాను, విలువైన కానుకలను సమర్పించుకున్నందుకు గాను కొంతమంది వ్యక్తులకు భూములను బహుమానంగా ఇచ్చేవారు. ఈ భూముల్లో వారు శిస్తులు వసూలు చేసి
కొంతభాగం రాజుకి చెల్లించగా మిగిలినది తమ సాంతానికి వాడుకొనేవారు. ఈ భూములను రైతులకు యిచ్చి వ్యవసాయం చేయించి ఫలసాయం తాము తీసుకొనేవారు. అన్ని వృత్తులవాళ్ళు ఎండనక, వాననక భూస్వాములకు పనులు చేసిపెట్టే వాళ్ళు. ఇందుకు వారికి ఎటువంటి ప్రతిఫలం లభించేదికాదు. దీనిని వెట్టి చాకిరీ అనేవాళ్ళు.
Read 19 tweets
30 Apr
#FatherOfIndianCinema #DadaSahebPhalke
ఒక అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలన చిత్ర రంగం ఆవిష్కారమైనది.వెండి తెరపై భారతీయ దేవుళ్ళను చూడాలనే స్వప్నం కళ్లకెదురుగా కదలాడింది. ఆనాడు బైస్కోపులు అమెరికా, ఇతర నాగరిక పాశ్చాత్య దేశాల నుండి Image
దిగుమతి అయ్యేవి. చెక్కబొమ్మలు చెక్కేవారు. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, మాజిక్, మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరినవాడై స్వాప్నికుడిగా మారిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగారు. దాదా సాహెబ్ ఫాల్కేగా గణుతికెక్కారు. Image
ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే (ఆంగ్లం : Dhundiraj Govind Phalke), జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే (మరాఠీ భాష : दादासाहेब फाळके) (ఏప్రిల్ 30, 1870 - ఫిబ్రవరి 16, 1944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి. Image
Read 5 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!