#MaahaRanaPratapJayanti
🗡️🐎🐴🐘
మహారాణా ప్రతాప్ మేవార్ రాజపుత్ర రాజులలో ప్రముఖుడు. గొప్ప యుద్ధవీరుడు. 1576లో హల్దిఘాట్ యుద్ధంలో అక్బర్ చేతిలో ఓడిపోయాడు.నేడు మహా రాణా ప్రతాప్ జయంతి 💐🌹✨ #Maharanapratap
ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. ప్రపంచంలో అత్యంత బలశాలి అయిన అమెరికా తలని వంచింది. కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్ధంలో ఆకరికి అమెరికాని ఓడించింది. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడికి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.
విలేకరి: ఇప్పటికీ అర్ధాంకాని విషయమేమిటంటే, అమెరికాని ఓడించి యుద్ధంలో ఎలా గెలిచారు.ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానం విని మీరు చాలా గర్వంగ ఫీల్ అవుతారు.అన్నీ దేశాలలోకెల్ల శక్తిశాలి అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు, శ్రేష్టమైన దేశభక్తిగల భారతీయ రాజు చరిత్రను చదివాను.
అతని జీవనంనుండి ప్రేరణపొంది యుద్దనీతి, ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్ధంలో గెలిచాము.విలేకరి అడిగాడు: ఎవరా భారతీయ మహారాజు?వియత్నాం అద్యక్షుడు నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు. ”అతడే రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్”మహారణా ప్రతాప్ సింహ్ పేరు చెప్పెటప్పుడు
అతని కళ్ళలో వీరత్వం నిండి వెలుగు ఉంది.అలాగే ఇలా అన్నాడు
“ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం.”కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు అయితే అతని సమాధి మీద ఇలా రాశి ఉంది “ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుడిది” అని రాసి పెట్టారు.
కాలాంతరంలో వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి వచ్చాడు.మహామహుల శ్రద్ధాంజలి గటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు ఆ తరువాత ఎర్రకోట, ఇంకా, ఇంకా ఇలా చూపించారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు
“ మహారణా ప్రతాప్ సమాధి ఎక్కడ?”.ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు. విదేశాంగమంత్రి అక్కడనుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడనుండి పిడికడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు.
ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు..”ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది, ఈ మట్టిని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గా రాజు” అని అన్నాడు
ఇంకా తెలుసుకోవాల్సినవి- శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”. అబ్రాహిం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి వచ్చేది ఉండే అప్పుడు తన తల్లి భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అన్నాడట.
దానికి అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ఎంత విశ్వశాపాత్రుడగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభపెట్టిన తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందాట.
కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయ్యింది. ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” చదువొచ్చు.
మహారణా ప్రతాప సింహ్ యొక్క ఈటె 80 కిలోలు ఉంటుంది.చేతి కవచం, శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి.
ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి.డిల్లీ బాద్షాహ్ అయినటువంటి అక్బర్ మహారణా ప్రతాప్ ని ఒకసారి తల దించి నా కాళ్ళ మీద పడుతే సగం హిందూస్థాన్కి రాజుని చేస్తా అని ప్రలోభపెట్టాడు కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైనదిగా తిరస్కరించాడు.
హల్దిఘాట్ యుద్ధంలో మేవాడ్ సైన్యం 20000 సైనికులతో ఉంటే అక్బర్ సైన్యం 85000 సైనికులతో సమీకరించబడాయి.మహారణా ప్రతాప్ ఇష్టమైన గుర్రంకి తన త్యాగానికి గుర్తుగా ఒక గుడిని కూడా కట్టారు, ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా ఉంది.మహారణా యుద్ధంలో తన అభేద్యమైన దుర్గం లను వదులుకున్నప్పటినుండి
కంసాలి వాళ్ళు వేల సంఖ్యలో వల్ల ఇళ్లను వదిలి రాణా కోసం ఆయుధాలు తయారు చేసేవారు.వల్ల దేశ భక్తికి నా తల వంచి ప్రణమిల్లుతున్నాను.హల్ది ఘాట్ యుద్ధం జరిగి 300 సంవత్సరాల తరువాత కూడా అక్కడి నెలలో కత్తులు లభించాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుధం దొరికింది.మహారణా ప్రతాప్ సింహ్ దగ్గర
యుద్ద శిక్షణ శ్రీ జైమల్ మేడతీయ ఇచ్చేవాడు. 8000 మంది రాజపుత్రుల వీరులతో కలిసి 60000 మంది మొఘలులతో యుద్ధం చేశారు. ఆ ఆ యుధ్దంలో 48000 మంది చనిపోయారు.ఇందులో 8000 మంది రాజపుత్రులు 40000 మంది మొఘలులు మహారణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట.
హల్ది ఘాట్ యుద్ధంలో మేవాడ్ భీల్ అనే ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు .వాళ్ళు మహారణాను వారి పుత్రుడిగా భావించేవారు.మహారణా కూడా వారిపట్ల భేదభావం చూపించేవారు కాదు. ఇప్పటికీ మేవాడ్ రాజచిహ్నంలో ఒకపక్క రాజపూత్ మరొక పక్క భీల్ ఉంటారు.
రాణా గుర్రం అయిన చేతక్ మహారణాను 26 అడుగుల కందకాన్ని దుమికి అది దాటిన తరువాత చనిపోయింది. అంతకంటే ముందే దానికి ముందరి ఒక కాలు విరిగి ఉన్నప్పటికి ఆ కందకాన్ని దుమికింది.అది ఎక్కడైయతే చనిపోయిందో అక్కడే ఒక చింత చెట్టు పెరిగింది.అదే ప్రదేశంలో దాని గౌరవార్దం చేతక్ మందిరం కట్టారు.
చేతక్ ఎంత బలమైనదంటే ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి అంతా ఎత్తులో గాలిలో ఎగిరేది అది కూడా మహారణాతో పాటుగా మహారణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెల్చుకున్నాడు.శ్రీ మహారణా ప్రతాప్ యొక్క బరువు 110 కిలోలు మరియు అతని పొడవు 7’5’’.
ఇరువైపుల దారు ఉన్నటువంటి కత్తి, 80 కిలోల ఈటె తన ఉంచుకునే వాడు. మిత్రులారా మహారణా ప్రతాప్, అతని గుర్రం గురించి విన్నారు, అతనికి ఒక ఏనుగు కూడా ఉండేది.దాని పేరు రాంప్రసాద్.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#EgoAwarenessDay#Ego
తనను తాను గొప్పవాడు అని నిరూపించుకోవడానికి మూర్ఖుడు వేసుకొనే ముసుగే 'అహం'. 'నేను' అనే భావన కూడా అహం అవుతుంది. ఆంగ్లంలో అహాన్ని 'ఈగో' అంటారు. మనో విశ్లేషణ ప్రకారం “అహం” అనేది ఒక మనిషి అపస్మారకం లో దాగిన కోరికలను బాహ్య ప్రపంచపు అవశ్యకాలతో జత చేయడానికి
మధ్యవర్తిత్వం చేసే మేధో భాగం. ఇదీ ఆత్మగౌరవం లాంటిదే.
'అహం’ వేరు… ‘అహంకారం’ వేరు. ‘అహం’ అనే సంస్కృత పదానికి తెలుగులో ‘నేను’ అని అర్థం. మరి ఆ ‘అహం’ వచ్చి ‘ఆకారం’తో చేరితే… అది “అహంకారం” అనబడుతుంది.
బైబిల్ గ్రంధం ప్రకారం 'అహం' అనేది ఏడు మహా పాపాల్లో ఒకటి. గర్వం వలె అహం కూడా మనిషి పతనానికి దారి తీస్తుంది.
ఒక సంస్కృత వృత్తాంతం ప్రకారం సంస్కృత కవుల్లో దండి గొప్పవాడా, లేక కాళిదాసు గొప్పవాడా అనే చర్చ వచ్చింది. వీరిద్దరి లో ఎవరు గొప్పవారో తేల్చిచెప్ప గల్గిన సామర్థ్యమున్న
#Salt ఉప్పు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడుతారు.
ఉప్పు ఉపయోగాలు అనంతం, ముఖ్యమైన కొన్నింటిని పరిశీలిస్తే: గొంతు గరగరకు, ఎడతెరపలేని దగ్గుకు ఉప్పు నీటి వాడకం సార్వత్రికమే. విషాహారం తిన్నవారికి మొదట ఇచ్చేది ఉప్పు నీరే. ఉప్పు మంచి వమన కారి. ఉప్పు కలిపిన పండ్ల పొడి మంచిది.
ఇప్పుడు టూత్ పేస్ట్ లో కూడా ఉప్పు ఉందా అని అడుగుతున్నారు. శరీరం పై కలిగిగ గాయాలకు ముందు ఉప్పు నీటితో కడగ మంటారు. కళ్ళు పుసులు కడితే ఉప్పు నీటితో కడగ మంటారు. ఇది మంచి ప్రాథమిక చికిస్త. ఉప్పు నీటితో ముఖాన్ని మసాజ్ చేస్తే మృత ఖణాలు పోయి ముఖం కాంతి వంతంగా వుంటుంది.
#GolfDay#Golfing 🏌️♀️🏌️♂️⛳ 🔮
గోల్ఫ్ (#Golf) నిర్ణీత పచ్చిక ప్రదేశములో వివిధ రకాల తెడ్డు వంటి సాధనములతో వేరువేరు ప్రదేశముల నుండి బంతులను నిర్ణీత ప్రదేశములలోని గుంతల లోనికి కొట్టే పశ్చిమ దేశాలవారి ఆట. మన తెలుగు వారి గోళీల ఆట వంటిది.
దీన్ని పెద్ద పెద్ద మైదానాలలో ఆడతారు. గోల్ఫ్ ఆట 14వ శతాబ్దంలో స్కాట్లాండ్‌లో మొదలయింది.తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.ఈ ఆటలో బంతిని వరుసగా కొన్ని రంధ్రాలలో పడేలా కొట్టాలి. ఏ ఆటగాడైతే తక్కువ సార్లు బంతిని కర్రతో కొట్టి గుంటలలో పడేలా చేస్తాడో అతనికి ఎక్కువ మార్కులు వస్తాయి.
గోల్ఫ్‌లో రబ్బరుతో తయారైన గట్టి బంతిని ఉపయోగిస్తారు. అమెరికాలో ఈ బంతి వ్యాసం 1.68 అంగుళాలు. బ్రిటన్‌లో 1.62 అంగుళాలు ఉంటుంది. సాధారణంగా దీని బరువు 46 గ్రాములు ఉంటుంది. ఈ క్రీడలో ఉపయోగించే కర్ర ముందరి భాగం కొంచెం వంపు తిరిగి ఉంటుంది. దీన్ని క్లబ్ అంటారు.
#WorldLupusDay #lupusday 🦋 🎗
లూపస్ ఒక తీవ్రమైన వ్యాధి. దీన్నే ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్) అని కూడా అంటారు. మన వ్యాధి నిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేయడం వల్ల వచ్చే జబ్బులను ‘ఆటో ఇమ్యూన్ జబ్బులు’ అని అంటారు.
లూపస్ కూడా ఓ ఆటో ఇమ్యూన్ జబ్బు శరీరాన్ని చికాకు పెట్టేస్తుంది. ఇది దీర్ఘకాలిక అంటువ్యాధి. అలసట, నీరసం, కీళ్లలో వాపు, తరచూ తలనొప్పి దీని లక్షణాలు. వ్యాధి నిరోధక శక్తిని అందించే కణాలపై అంతర్గత దాడి దీనికి కారణం. 17 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఇది వస్తుంది.
దీనిపై అవగాహన పెంచేందుకు ఏటా మే 10వ తేదీన ప్రపంచ లూపస్ నివారణ దినం జరుపుతున్నారు. చిన్న వయసున్న వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మనిషి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. రోగాల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని అనుక్షణం రక్షిస్తుంటుంది.
#OneDayWithoutShoesDay 🦶👣
మనిషి జీవితంలో పాదరక్షలు చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న రోడ్లపై చెప్పులు లేకుండా నడవడం అంటే సాహసం చేసినట్లే. అందుకే పాద రక్షకాలను అందరూ ధరిస్తారు.ప్రపంచ వ్యాప్తంగా పేదరికంతో పాదరక్షణలు కొనే స్థోమత లేక ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి వారికి మద్దతుగా
ఈ రోజు పాద రక్షణలు లేకుండా ఒక రోజు ఉంటూ వారికి పాదరక్షణలు విరాళంగా ఇస్తారు..
ఈ విధంగా నేడు "పాద రక్షణలు లేకుండా ఒక రోజు" దినోత్సవం జరుపుకుంటారు.
అసలు చెప్పులు ఎలా వచ్చాయో తెలుసా?
పూర్వం ఓ రాజుగారికి, తన రాజ్యం మొత్తం చుట్టిరావాలని, మదిలో కోరిక కలిగిందంట.
రాజు తలచుకుంటే..! అన్న చందాన,వెంటనే మంత్రిని పిలిచి,రాజ్యామంతా ఎర్ర తివాచితో కప్పమన్నాడంట!ఆ మంత్రిగారు నేర్పుగా రాజుకి ఇలా చెప్పాడంట.అయ్యా! మహారాజా! రాజ్యమంతా తివాచి పరచాలంటే,మన సంపద సరిపోదు సరికదా!ఒక వేళ, ఆ పని ఆరంభించినా..
పూర్తి కావడానికి జీవిత కాలం చాలదు.
#MotherOceanDay
🌊⛵🚢🚤🏄♀️🏄♂️🤽♂️🚣♂️🚣♀️
సముద్రం ఓ ప్రపంచం. లక్షలాది జీవరాశులకు కన్న తల్లి.
పద్యం రాస్తున్నాను
సముద్రం చూస్తూ ఉంది
స్ర్తిలింగం పుంలింగం ధరించిన జలధి
ఒకరికి తండ్రి సముద్రుడు
ఒకరికి తల్లి సముద్రం! #MotherOcean #oceans#MothersDay
ఉధృతమై అలలు ముందుకురుకుతుంటే
ప్రమాదాన్ని పసిగట్టి సముద్రుడు
ముక్కుతాడేసి లాగుతుంటాడు
అలల్లో చిక్కిన మానవుడు
అసువులు బాసినపుడు
అలలెంతగా కన్నీరు విరజిమ్ముతాయో
వీక్షకులు ప్రత్యక్ష సాక్షులు
విగత జీవుల్ని వొడ్డుకు చేర్చి
సముద్ర గర్భంలో ఎవరూ దాగిలేరని
శే్వతపత్రం విడుదల చేస్తుంది
నిద్రించే చరాచరాలకు
మేల్కొల్పు చెప్పటానికి
సముద్రం నిత్యం ఘోషిస్తుంది
సూర్యుడు చంద్రుడు తన బిడ్డలని
పగలు రాత్రి తోడుండే అమరులని
మురిపెంగా చెప్పి మురుస్తుంది!
సముద్రుడు అరిస్టాటిల్‌కు
ప్రియాతి ప్రియమిత్రుడు
వొడ్డున నిల్చిన వీక్షకులకు
ఓడను పైనించి కిందికి
అంచెలంచెలుగా చూపి