#EgoAwarenessDay#Ego
తనను తాను గొప్పవాడు అని నిరూపించుకోవడానికి మూర్ఖుడు వేసుకొనే ముసుగే 'అహం'. 'నేను' అనే భావన కూడా అహం అవుతుంది. ఆంగ్లంలో అహాన్ని 'ఈగో' అంటారు. మనో విశ్లేషణ ప్రకారం “అహం” అనేది ఒక మనిషి అపస్మారకం లో దాగిన కోరికలను బాహ్య ప్రపంచపు అవశ్యకాలతో జత చేయడానికి
మధ్యవర్తిత్వం చేసే మేధో భాగం. ఇదీ ఆత్మగౌరవం లాంటిదే.
'అహం’ వేరు… ‘అహంకారం’ వేరు. ‘అహం’ అనే సంస్కృత పదానికి తెలుగులో ‘నేను’ అని అర్థం. మరి ఆ ‘అహం’ వచ్చి ‘ఆకారం’తో చేరితే… అది “అహంకారం” అనబడుతుంది.
బైబిల్ గ్రంధం ప్రకారం 'అహం' అనేది ఏడు మహా పాపాల్లో ఒకటి. గర్వం వలె అహం కూడా మనిషి పతనానికి దారి తీస్తుంది.
ఒక సంస్కృత వృత్తాంతం ప్రకారం సంస్కృత కవుల్లో దండి గొప్పవాడా, లేక కాళిదాసు గొప్పవాడా అనే చర్చ వచ్చింది. వీరిద్దరి లో ఎవరు గొప్పవారో తేల్చిచెప్ప గల్గిన సామర్థ్యమున్న
పండితుడెవడూ కనిపించక, ఇద్దరూ సరస్వతి దేవి దగ్గరికి వెళ్తారు. ఇద్దరిలో యెవరు గొప్ప అని అడిగిన ప్రశ్నకు దండి గొప్పవాడని జవాబిస్తుంది సరస్వతి. దానికి ఖిన్నుడైన కాళీదాసు “నేనేమీ కానా తల్లీ?” అని అడిగిన ప్రశ్నకు జవాబుగా “త్వమేవాహం”, (నువ్వే నేను) అని జవాబిస్తుంది సరస్వతి.
“నేను”, “నా”, అని సూచించేంతవరకు “అహం” అనేది ఒక పదం మాత్రమే. అయితే “నేనే”, “నాదే” అనే అర్థాలు జోడించుకోవడం తో అదొక భావంగా వాడుకలోకి వచ్చేసింది. సరిగ్గా చెప్పాలంటే అహంకారం అలాగే వుంచి దురహంకారం (చెడ్డ అహంకారం) పదాన్ని వాడటం మంచిది
ఆత్మ గౌరవానికి, అహంకారాకి చాలా పోలిక ఉంది. వాటిని విభజించేది చాలా సన్నటి రేఖ. “ఈ సామర్థ్యం నాకుంది” అనడం ఆత్మ గౌరవం. “ఈ సామర్థ్యం నాకొక్కడికే వుంది” అనడం అహంకారం.
ఇంట్లో చిన్న చిన్న గొడవల దగ్గరినుండి, బాహ్య ప్రపంచం లో మహా యుధ్ధాల వరకూ అహంకారాల వల్లే జరుగుతాయి.ఒకరి అహంకారం ఆ మనిషి పొందే నష్టానికే పరిమితమైతే పోనీ అనుకోవచ్చు. ఒక్కరి అహంకారం వల్ల, ఒక కుటుంబం, జాతి, దేశం ఇంకా మాట్లాడితే ప్రపంచమే నాశనమైన సందర్భాలున్నాయి కదా?
అహంకారానికి సంబంధించిన మరో కథ. ఒక వూరిలో రామశాస్త్రి, శంకర శాస్త్రి అని ఇద్దరు సంగీత విద్వాంసులుండేవారు. రామశాస్త్రి సాత్విక స్వభావం కల్గిన వాడు. శంకర శాస్త్రి కి అహంకారమెక్కువ. తనలాగా ఎవ్వరూ పాడలేరు అనుకొనేవాడుఆ వూరిలోనే కాకుండా చుట్టుపక్కల వూర్లలో కూడా వాళ్ళిద్దరూ
శుభకార్యాలకు సంగీత కచేరీలు చేసి జీవనం సాగించేవారు. ఇద్దరికీ వారి వారి అభిమానులుండేవారు. అయితే ఏనాడూ వాళ్లిద్దరు కలిసి ఒకే శుభకార్యం లో సంగీతకచేరి చేయలేదు. వారిద్దరి గురించి తెలిసిన వారు ఎవర్నో ఒకర్నే ఆహ్వానించే వారు. ఒక రోజు ఆ వూరి పెద్ద తన కుతురి పెళ్ళిలో సంగీతకచేరి చేయమని
ఇద్దర్నీ ఒకేసారి అహ్వానిస్తాడు. రామశాస్త్రి తో కలిసి సంగీత కచేరీ చేయడం ఇష్టం లేకపోయినా, వూరి పెద్ద మాటకాదనలేక శంకరశాస్త్రి ఒప్పుకుంటాడు.
అతను వూరిపెద్దను విడిగా కలిసి “నాకూ రామశాస్త్రికీ పోలిక లేదన్న విషయం మీకు తెలిసిందే. నేనతడిని నా సమవుజ్జీగా ఏనాడు భావించలేదు.
అందుకే మా తేడా తెలియ జేసేందుకు రామశాస్త్రి కిచ్చె పారితోషికాని కంటే నాకు ఎక్కువ ఇవ్వాలి.అది ఒక్క రూపాయైనా ఫరవాలేదు” అంటాడు.
దానికి ఆ వూరిపెద్ద ఒప్పుకుంటాడు. పెళ్లి లో సంగీతకచేరీలు నిర్వహింపబడతాయి.పెళ్లి అయిపోయిన తరువాత పారితోషికాలు ఇస్తూ వూరి పెద్ద సభికులనుద్దేశించి ఇలా అంటాడు
“సంగీత విద్వాంసులకిద్దరికీ ఇచ్చే పారితోషికాల్లో శంకర శాస్త్రి కోరిక ప్రకారం, ఆయన పారితోషికం రామశాస్త్రి పారితోషికం కంటే కనీసం ఒక్క రూపాయైనా ఎక్కువ వుండాలని అన్నారు. ఈ శుభకార్యం లో రామశాస్త్రి పారితోషికం పుచ్చుకోకుండా ఉచితంగా సంగీతకచేరి చేశారు.
అందుకే శంకర శాస్త్రి గారికి పారితోషికం కింద ఒక్క రూపాయి సమర్పించుకుంటున్నా” నంటు ఒక రూపాయి శంకర శాస్త్రి చేతిలో వుంచుతాడు. ఇదీ అహంకారం కధ
అహంకారాల వల్ల ఒకే కుటుంబం లోని పెద్దలు ఒకరితో ఒకరు మట్లాడుకోకుండా విడిపోయి ఏళ్లతరబడి అలా వుండిపోతారు. రాకపోకలుండవు. ఈ పెద్దల అహంకారం వల్ల పిల్లలు నష్ట పొతారు. కలిసిమెలిసి వుండటం లోని ఆనందాన్ని పోగొట్టుకుంటారు.
ఈ వూహాజనిత అపార్థాలూ, స్పర్థలూ మనం వున్నా లేక పోయినా ఒక రోజు అంతమవుతాయి. అంత ఆలస్యం చేయడం కంటే ఒక చిన్న సర్దుబాటుతో జీవితం లోకి ఆనందాన్ని ఆహ్వానించడం ఉత్తమమైన పని.
తాను కర్తననుచు తలచిన క్షణమున
తరిగి పోవు పుణ్య ధనము కాస్త
అహము పెరిగి మనిషి అవనిని వర్తించు
దైవ యునికి మరచు ధర్మఘాతి
కర్మ చేయువరకె కర్త కవశ్యమై
యుండతరము కాని యొండు కాదు
భ్రమలు పెరిగి తానె భగవంతుడనుకొన్న
పిచ్చి వాడటంచు మెచ్చరెవరు
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#Salt ఉప్పు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడుతారు.
ఉప్పు ఉపయోగాలు అనంతం, ముఖ్యమైన కొన్నింటిని పరిశీలిస్తే: గొంతు గరగరకు, ఎడతెరపలేని దగ్గుకు ఉప్పు నీటి వాడకం సార్వత్రికమే. విషాహారం తిన్నవారికి మొదట ఇచ్చేది ఉప్పు నీరే. ఉప్పు మంచి వమన కారి. ఉప్పు కలిపిన పండ్ల పొడి మంచిది.
ఇప్పుడు టూత్ పేస్ట్ లో కూడా ఉప్పు ఉందా అని అడుగుతున్నారు. శరీరం పై కలిగిగ గాయాలకు ముందు ఉప్పు నీటితో కడగ మంటారు. కళ్ళు పుసులు కడితే ఉప్పు నీటితో కడగ మంటారు. ఇది మంచి ప్రాథమిక చికిస్త. ఉప్పు నీటితో ముఖాన్ని మసాజ్ చేస్తే మృత ఖణాలు పోయి ముఖం కాంతి వంతంగా వుంటుంది.
#GolfDay#Golfing 🏌️♀️🏌️♂️⛳ 🔮
గోల్ఫ్ (#Golf) నిర్ణీత పచ్చిక ప్రదేశములో వివిధ రకాల తెడ్డు వంటి సాధనములతో వేరువేరు ప్రదేశముల నుండి బంతులను నిర్ణీత ప్రదేశములలోని గుంతల లోనికి కొట్టే పశ్చిమ దేశాలవారి ఆట. మన తెలుగు వారి గోళీల ఆట వంటిది.
దీన్ని పెద్ద పెద్ద మైదానాలలో ఆడతారు. గోల్ఫ్ ఆట 14వ శతాబ్దంలో స్కాట్లాండ్‌లో మొదలయింది.తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.ఈ ఆటలో బంతిని వరుసగా కొన్ని రంధ్రాలలో పడేలా కొట్టాలి. ఏ ఆటగాడైతే తక్కువ సార్లు బంతిని కర్రతో కొట్టి గుంటలలో పడేలా చేస్తాడో అతనికి ఎక్కువ మార్కులు వస్తాయి.
గోల్ఫ్‌లో రబ్బరుతో తయారైన గట్టి బంతిని ఉపయోగిస్తారు. అమెరికాలో ఈ బంతి వ్యాసం 1.68 అంగుళాలు. బ్రిటన్‌లో 1.62 అంగుళాలు ఉంటుంది. సాధారణంగా దీని బరువు 46 గ్రాములు ఉంటుంది. ఈ క్రీడలో ఉపయోగించే కర్ర ముందరి భాగం కొంచెం వంపు తిరిగి ఉంటుంది. దీన్ని క్లబ్ అంటారు.
#WorldLupusDay #lupusday 🦋 🎗
లూపస్ ఒక తీవ్రమైన వ్యాధి. దీన్నే ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్) అని కూడా అంటారు. మన వ్యాధి నిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేయడం వల్ల వచ్చే జబ్బులను ‘ఆటో ఇమ్యూన్ జబ్బులు’ అని అంటారు.
లూపస్ కూడా ఓ ఆటో ఇమ్యూన్ జబ్బు శరీరాన్ని చికాకు పెట్టేస్తుంది. ఇది దీర్ఘకాలిక అంటువ్యాధి. అలసట, నీరసం, కీళ్లలో వాపు, తరచూ తలనొప్పి దీని లక్షణాలు. వ్యాధి నిరోధక శక్తిని అందించే కణాలపై అంతర్గత దాడి దీనికి కారణం. 17 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఇది వస్తుంది.
దీనిపై అవగాహన పెంచేందుకు ఏటా మే 10వ తేదీన ప్రపంచ లూపస్ నివారణ దినం జరుపుతున్నారు. చిన్న వయసున్న వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మనిషి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. రోగాల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని అనుక్షణం రక్షిస్తుంటుంది.
#OneDayWithoutShoesDay 🦶👣
మనిషి జీవితంలో పాదరక్షలు చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న రోడ్లపై చెప్పులు లేకుండా నడవడం అంటే సాహసం చేసినట్లే. అందుకే పాద రక్షకాలను అందరూ ధరిస్తారు.ప్రపంచ వ్యాప్తంగా పేదరికంతో పాదరక్షణలు కొనే స్థోమత లేక ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి వారికి మద్దతుగా
ఈ రోజు పాద రక్షణలు లేకుండా ఒక రోజు ఉంటూ వారికి పాదరక్షణలు విరాళంగా ఇస్తారు..
ఈ విధంగా నేడు "పాద రక్షణలు లేకుండా ఒక రోజు" దినోత్సవం జరుపుకుంటారు.
అసలు చెప్పులు ఎలా వచ్చాయో తెలుసా?
పూర్వం ఓ రాజుగారికి, తన రాజ్యం మొత్తం చుట్టిరావాలని, మదిలో కోరిక కలిగిందంట.
రాజు తలచుకుంటే..! అన్న చందాన,వెంటనే మంత్రిని పిలిచి,రాజ్యామంతా ఎర్ర తివాచితో కప్పమన్నాడంట!ఆ మంత్రిగారు నేర్పుగా రాజుకి ఇలా చెప్పాడంట.అయ్యా! మహారాజా! రాజ్యమంతా తివాచి పరచాలంటే,మన సంపద సరిపోదు సరికదా!ఒక వేళ, ఆ పని ఆరంభించినా..
పూర్తి కావడానికి జీవిత కాలం చాలదు.
#MotherOceanDay
🌊⛵🚢🚤🏄♀️🏄♂️🤽♂️🚣♂️🚣♀️
సముద్రం ఓ ప్రపంచం. లక్షలాది జీవరాశులకు కన్న తల్లి.
పద్యం రాస్తున్నాను
సముద్రం చూస్తూ ఉంది
స్ర్తిలింగం పుంలింగం ధరించిన జలధి
ఒకరికి తండ్రి సముద్రుడు
ఒకరికి తల్లి సముద్రం! #MotherOcean #oceans#MothersDay
ఉధృతమై అలలు ముందుకురుకుతుంటే
ప్రమాదాన్ని పసిగట్టి సముద్రుడు
ముక్కుతాడేసి లాగుతుంటాడు
అలల్లో చిక్కిన మానవుడు
అసువులు బాసినపుడు
అలలెంతగా కన్నీరు విరజిమ్ముతాయో
వీక్షకులు ప్రత్యక్ష సాక్షులు
విగత జీవుల్ని వొడ్డుకు చేర్చి
సముద్ర గర్భంలో ఎవరూ దాగిలేరని
శే్వతపత్రం విడుదల చేస్తుంది
నిద్రించే చరాచరాలకు
మేల్కొల్పు చెప్పటానికి
సముద్రం నిత్యం ఘోషిస్తుంది
సూర్యుడు చంద్రుడు తన బిడ్డలని
పగలు రాత్రి తోడుండే అమరులని
మురిపెంగా చెప్పి మురుస్తుంది!
సముద్రుడు అరిస్టాటిల్‌కు
ప్రియాతి ప్రియమిత్రుడు
వొడ్డున నిల్చిన వీక్షకులకు
ఓడను పైనించి కిందికి
అంచెలంచెలుగా చూపి
#IndianOcean
హిందూ మహాసముద్రం ప్రపంచంలోని మహాసముద్ర విభాగాలలో మూడవ అతిపెద్దది, ఇది 70,560,000 కిమీ, భూమి ఉపరితలంపై 19.8% నీటిని కలిగి ఉంది. దీనికి ఉత్తరాన ఆసియా, పశ్చిమాన ఆఫ్రికా, తూర్పున ఆస్ట్రేలియా ఉన్నాయి. #Ocean
ఉపయోగంలో ఉన్న నిర్వచనాన్ని బట్టి దక్షిణాన ఇది దక్షిణ మహాసముద్రం అంటార్కిటికాతో సరిహద్దులుగా ఉంది. హిందూ మహాసముద్రంలో అరేబియా సముద్రం,లాకాడివ్ సముద్రం,సోమాలి సముద్రం,బంగాళాఖాతం,అండమాన్ సముద్రం వంటి కొన్ని పెద్ద ఉపాంత ప్రాంతీయ సముద్రాలు ఉన్నాయి.దీన్నే అర్ధ మహాసముద్రం అని పిలుస్తారు
ఈ సముద్రం ఒడ్డునే ఉన్నాయి. తూర్పు ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఖంఢాలను వేరుచేస్తుంది. ఎండాకాలంలో ఈ సముద్రంలో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. అన్ని సమద్రాలకంటే వెచ్చని సముద్రమని పేరు.