#Salt ఉప్పు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడుతారు.
ఉప్పు ఉపయోగాలు అనంతం, ముఖ్యమైన కొన్నింటిని పరిశీలిస్తే: గొంతు గరగరకు, ఎడతెరపలేని దగ్గుకు ఉప్పు నీటి వాడకం సార్వత్రికమే. విషాహారం తిన్నవారికి మొదట ఇచ్చేది ఉప్పు నీరే. ఉప్పు మంచి వమన కారి. ఉప్పు కలిపిన పండ్ల పొడి మంచిది.
ఇప్పుడు టూత్ పేస్ట్ లో కూడా ఉప్పు ఉందా అని అడుగుతున్నారు. శరీరం పై కలిగిగ గాయాలకు ముందు ఉప్పు నీటితో కడగ మంటారు. కళ్ళు పుసులు కడితే ఉప్పు నీటితో కడగ మంటారు. ఇది మంచి ప్రాథమిక చికిస్త. ఉప్పు నీటితో ముఖాన్ని మసాజ్ చేస్తే మృత ఖణాలు పోయి ముఖం కాంతి వంతంగా వుంటుంది.
మనుషులకే కాదు చెట్లకు కూడా ఉప్పు ఉపయోగముంది. కొబ్బరి చెట్లకు మువ్వ తెగులుకు ఉప్పు వాడతారు. వంగ మొక్కజొన్న వంటి పంటలకు సోడియం క్లోరైడ్ ను ఎరువుగా వాడతారు. జంతువులకు, వివిధ రకాల వనమూలికలతో చేసిన పొడిని ఉప్పు కలిపి తినిపిస్తారు. దాన్ని ఉప్పు చెక్క అంటారు.
ఇది ఆవులకు,గొర్రెలకు చాల దివ్వ ఔషధం. మామూలు కూరల్లోనే కాదు స్వీట్లు, బ్రెడ్, బిస్కట్,పిజ్జాలు,ఐస్క్రీంలు,జంకు వుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్,ఇలా అన్నింటిలోను రుచి కొరకు, నిల్వ కొరకు ఎంతో కొంత ఉప్పు వాడాల్సిందే.1675 లో బ్రిటిష్ లో ఉప్పు పై అధిక పన్నుకు ప్రతి కూలంగా ప్రజా పొరాటం జరిగింది.
ఇది ఆవులకు,గొర్రెలకు చాల దివ్వ ఔషధం. మామూలు కూరల్లోనే కాదు స్వీట్లు,బ్రెడ్, బిస్కట్,పిజ్జాలు,ఐస్క్రీంలు,జంకు వుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్,ఇలా అన్నింటిలోను రుచి కొరకు,నిల్వ కొరకు ఎంతో కొంత ఉప్పు వాడాల్సిందే. 1675 లో బ్రిటిష్ లో ఉప్పు పై అధిక పన్నుకు ప్రతి కూలంగా ప్రజా పొరాటం జరిగింది.
బ్రిటిష్ పాలకులు ఉప్పు తయారి పై సుంకం విధించి నందున దానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నడిపించిన "ఉప్పు సత్యాగ్రహం" స్వాతంత్ర్యోద్యమంలో ఎంతో ప్రధాన ఘట్టమనే సంగతి తెలియని వారుండరు. కొన్ని ప్రాంతాలలో శవాలను ఖననం చేసేటపుడు తప్పని సరిగా ఉప్పును కూడా వేస్తారు.
మన దేశంలో ఉప్పును అప్పుగా ఇవ్వకూడదనే నియమంకూడ ఉంది. ఉప్పును చేతికి ఇవ్వరు ......... తీసుకోరు, (నూనెలకు కూడా ఈ నియమం ఉన్నది) ఉప్పును దొంగలించరు. ఇలా ఉప్పుకు సంబంధించిన కొన్ని ఆచారాలున్నాయి.
ఉప్పు వల్ల ఉపయోగాలేమంటే ఉప్పు వేసిన వంటలు త్వరగా ఉడుకుతాయి. దానివలన ఇందనం, సమయం ఆదా. ఉప్పు నీరు వంద డిగ్రీల వద్ద మరిగి ఆవిరై పోదు. సున్న డిగ్రీల వద్ద గడ్డ కట్టి పోదు. ఒకరి మీద కృతజ్ఞత చెప్ప డానికి "మీ ఉప్పు తిన్న వాడిని" అంటారు గాని "మీ తిండి తిన్న వాణ్ణి" అనరు. అదే ఉప్పు ఘనత.
ఉప్పు ఘనత కారణంగా కొన్ని నగరాలు వెలిశాయి.బ్రిటన్ లోని లివర్ పూల్నిన్న నగరం. ఉప్పు ఎగుమతితో అనారం చిన్న స్థాయి నుండి ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగింది.ఆస్ట్రియాలోని శాల్జ్ బర్గ్ నగరాన్ని ది సిటి ఆఫ్ సాల్ట్ అని పిలుస్తారు, ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యంలో సైనికులకు ఉప్పును జీతంగా ఇచ్చేవారు.
ఇంకొన్ని ప్రాంతాలలో ఉప్పును మారకద్రవ్యంగా వాడారు. ఆ హార పదార్థాల నిల్వకు అతి సులువైన మార్గం ఉప్పులో ఊర వేయటం. ఊరగాయలు, చేపలు, మాంసం మొదలగునవి ఉప్పులో నిల్వతో ఎగుమతిలో జరిగే జాప్యాన్ని తట్టు కుంటాయి.
ఉప్పుని పారిశ్రామిక ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడతారు. ఎన్నో పార్మాసూటికల్స్ తయారికి ఉప్పే ముఖ్యమైన ముడి సరుకు. కీలక రసాయానాలను తయారు చేయడానికి ఉప్పే ముడి సరుకు. వాటితో ఫార్మాసూటి కల్ మందులు, మైక్రో చిప్ లు, ఆప్టికల్ ఫైబర్లు, కేబుల్సు, ప్లాస్టిక్ పైపులు మొదలగు
వేల రకాల వస్తువుల తయారికి ఉప్పు అత్యవసరం. ధ్రువ ప్రాంతాల దేశాలలో కొన్ని సీజన్లలో మంచు దారాపాతంగ కురుస్తుంది. నేలంతా గడ్డ కట్టిన మంచుతో పేరుక పోతుంది. రోడ్లపై అతుక్కు పోయిన మంచును పెకలించి తొలిగించడం చాల కష్టం.
దాంతో రోడ్ల పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోతాయి. ఆమంచును తొలగించడానికి ఉప్పే శరణ్యం. ఎలాగంటే మామూలు నీటి లాగ ఉప్పు నీరు సాధారణ ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టదు. కనుక రోడ్డుపై ఉప్పు నీరు చల్లితే కురిసిన మంచు గడ్డ కట్టినా రోడ్డుకు అతుక్కొనదు.
మంచుకు, రోడ్డుకు మధ్యన ఉప్పు నీటి పొర వున్నందున మంచు రోడ్డుకు అతుక్కోదు. అంచేత దాన్ని తొలిగించడము చాల సులభం. అటు వంటి దేశాలలో ఉప్పును ఎక్కువగా వాడేది రోడ్లపై నున్న మంచును తొలగించడానికే. అందుకని రహదారుల వెంబడి పెద్ద పెద్ద ఉప్పు నిల్వ ఉన్న గిడ్డంగులుంటాయి.
మంటలను ఆర్పడానికి కూడా ఉప్పును వినియోగిస్తారు. మంటలలోని వేడిని ఉప్పు గ్రహిస్తుంది. అది ఆక్సిజన్ తో సంయోగం చెంది ఆప్రదేశంలో ఆక్సిజన్ తగ్గి మంటలను ఆర్పడానికి దోహద పడుతుంది. అగ్గికి విరొది నీరే కాదు ఉప్పు కూడా.
అందుకే ఉప్పు---నిప్పు అంటారు. " వారిద్దరు ఉప్పు నిప్పు" అనే సామెత అందుకే వచ్చంది.
ఉప్పు వల్ల అన్నీ ఉపయోగాలేనా అంటే అదేంకాదు. ఉప్పు అధికమైతే అరోగ్య పరంగా అనేక దుష్పరిమాణాలు కలుగుతాయి. అధిక రక్త పోటుకు మోతాదు మించిన ఉప్పే కారణమని వైద్యులు అంటున్నారు.
తద్వారా వచ్చే అనేక గుండె జబ్బులకు పరోక్షంగా ఉప్పే కారణం అని వైద్యులు తేల్చి చెప్పుతున్నారు. ఆమధ్యన న్యూయార్కులో నగర పాలకులు హోటళ్లలో ఏ వంటలోను వుప్పు వేయ కూడదని అలా వేస్తే జరిమానా విధిస్తామని ఉత్తర్వులిచ్చారు. తినేవారు తమకు కావలసిన ఉప్పును వారే వేసుకుంటారని .
ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఉప్పు గురించి అన్ని విషయాలు వివరంగా అందించడానికి ప్రముఖ ఉప్పు తయారీ దారులంతా కలిసి "సాల్ట్ ఇన్ స్టిస్ట్యూట్ ను నెలకొల్పారు. ఇది అమెరికాలోని అలెగ్జాండ్రియాలో వున్నది. ఇన్ని ఉపయోగాలున్న ఉప్పు గురించి పాఠశాల విద్యార్తులకు చెప్పితే చిన్నప్పుడే వారికి
ఉప్పు విలువ తెలుస్తుందని ....ఉప్పు ఉపయోగాల గురించి పాఠ్య ప్రణాళిక తయారు చేసి ఉపాద్యాయులకు ఉచితంగా ఇస్తున్నారు. ..
ప్రతీరోజు సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు. ఇది జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు కన్నా చాలా ఎక్కువ. రోజుకు ఆరు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకూడదని
సంస్థ సూచిస్తోంది. ఉప్పు ఎక్కువ తీసుకుంటే గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, కడుపులో క్యాన్సర్, ఆస్టియోపోరొసిస్ కలుగుతాయి. సముద్రం నుంచి లభించే ఉప్పులో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్ ఉంటాయి. మన శరీరంలో ఉప్పుమీద ఆధారపడని అవయవమంటూ ఏమీలేదంటే అతిశయోక్తి కాదు.
మన శరీరానికి ఎంత ఉప్పు అవసరం? జాతీయ పోషకాహారం సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు మాత్రమే ఉప్పు తీసుకోవాలి. కానీ సగటున ఒక వ్యక్తి రోజులో 8 నుంచి 12 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడు. ఉప్పు మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది.
రకాలు
గడ్డ ఉప్పు లేదా సముద్రపు ఉప్పు
అయోడిన్ ఉప్పు
రాతి ఉప్పు (Rock salt)
నల్ల ఉప్పు (Black salt)
ఆరోగ్యం
ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపు పోటు వచ్చే అవకాశం ఎక్కువ.జీర్ణాశయం కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1. ఉప్పు బదులు లెమన్ పౌడర్, ఆమ్‌చూర్ పౌడర్, వాము పొడి, మిరియాల పొడి, ఒరెగనో వంటివి యూజ్ చేయవచ్చు.
2. వంట మొదట్లో ఉప్పు వేసే బదులు చివర్లో వేస్తే ఉప్పు తక్కువ వేయవచ్చు. పైగా, అప్పుడు వంటకం కూడా ఎక్కువ ఉప్పు తీసుకోకుండా ఉంటుంది.
3. ఊరగాయలు, అప్పడాలు, సాస్, నమ్‌కీన్ వంటి వాటిలో ఉప్పు ఉంటుంది. అందుకని, ఇవి తీసుకోవడం తగ్గిస్తే మంచిది.
4. ఆయిల్ ఆయిల్, బటర్ వంటివి ఉప్పు వాడకాన్ని బాగా తగ్గిస్తాయి. వాటిలో ఉండే ఫ్లేవర్ వల్ల ఉప్పు తగ్గిందని కూడా మనకి తెలియదు.
5. పసుపు, జీల కర్ర పొడి, మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర వంటివి ఉప్పు తగ్గిందన్న విషయం తెలియకుండా మ్యానేజ్ చేయగలవు. అందుకని వంటలో ఇవి రెగ్యులర్ గా వాడుతూ ఉండవచ్చు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#EgoAwarenessDay#Ego
తనను తాను గొప్పవాడు అని నిరూపించుకోవడానికి మూర్ఖుడు వేసుకొనే ముసుగే 'అహం'. 'నేను' అనే భావన కూడా అహం అవుతుంది. ఆంగ్లంలో అహాన్ని 'ఈగో' అంటారు. మనో విశ్లేషణ ప్రకారం “అహం” అనేది ఒక మనిషి అపస్మారకం లో దాగిన కోరికలను బాహ్య ప్రపంచపు అవశ్యకాలతో జత చేయడానికి
మధ్యవర్తిత్వం చేసే మేధో భాగం. ఇదీ ఆత్మగౌరవం లాంటిదే.
'అహం’ వేరు… ‘అహంకారం’ వేరు. ‘అహం’ అనే సంస్కృత పదానికి తెలుగులో ‘నేను’ అని అర్థం. మరి ఆ ‘అహం’ వచ్చి ‘ఆకారం’తో చేరితే… అది “అహంకారం” అనబడుతుంది.
బైబిల్ గ్రంధం ప్రకారం 'అహం' అనేది ఏడు మహా పాపాల్లో ఒకటి. గర్వం వలె అహం కూడా మనిషి పతనానికి దారి తీస్తుంది.
ఒక సంస్కృత వృత్తాంతం ప్రకారం సంస్కృత కవుల్లో దండి గొప్పవాడా, లేక కాళిదాసు గొప్పవాడా అనే చర్చ వచ్చింది. వీరిద్దరి లో ఎవరు గొప్పవారో తేల్చిచెప్ప గల్గిన సామర్థ్యమున్న
#GolfDay#Golfing 🏌️♀️🏌️♂️⛳ 🔮
గోల్ఫ్ (#Golf) నిర్ణీత పచ్చిక ప్రదేశములో వివిధ రకాల తెడ్డు వంటి సాధనములతో వేరువేరు ప్రదేశముల నుండి బంతులను నిర్ణీత ప్రదేశములలోని గుంతల లోనికి కొట్టే పశ్చిమ దేశాలవారి ఆట. మన తెలుగు వారి గోళీల ఆట వంటిది.
దీన్ని పెద్ద పెద్ద మైదానాలలో ఆడతారు. గోల్ఫ్ ఆట 14వ శతాబ్దంలో స్కాట్లాండ్‌లో మొదలయింది.తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.ఈ ఆటలో బంతిని వరుసగా కొన్ని రంధ్రాలలో పడేలా కొట్టాలి. ఏ ఆటగాడైతే తక్కువ సార్లు బంతిని కర్రతో కొట్టి గుంటలలో పడేలా చేస్తాడో అతనికి ఎక్కువ మార్కులు వస్తాయి.
గోల్ఫ్‌లో రబ్బరుతో తయారైన గట్టి బంతిని ఉపయోగిస్తారు. అమెరికాలో ఈ బంతి వ్యాసం 1.68 అంగుళాలు. బ్రిటన్‌లో 1.62 అంగుళాలు ఉంటుంది. సాధారణంగా దీని బరువు 46 గ్రాములు ఉంటుంది. ఈ క్రీడలో ఉపయోగించే కర్ర ముందరి భాగం కొంచెం వంపు తిరిగి ఉంటుంది. దీన్ని క్లబ్ అంటారు.
#WorldLupusDay #lupusday 🦋 🎗
లూపస్ ఒక తీవ్రమైన వ్యాధి. దీన్నే ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్) అని కూడా అంటారు. మన వ్యాధి నిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేయడం వల్ల వచ్చే జబ్బులను ‘ఆటో ఇమ్యూన్ జబ్బులు’ అని అంటారు.
లూపస్ కూడా ఓ ఆటో ఇమ్యూన్ జబ్బు శరీరాన్ని చికాకు పెట్టేస్తుంది. ఇది దీర్ఘకాలిక అంటువ్యాధి. అలసట, నీరసం, కీళ్లలో వాపు, తరచూ తలనొప్పి దీని లక్షణాలు. వ్యాధి నిరోధక శక్తిని అందించే కణాలపై అంతర్గత దాడి దీనికి కారణం. 17 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఇది వస్తుంది.
దీనిపై అవగాహన పెంచేందుకు ఏటా మే 10వ తేదీన ప్రపంచ లూపస్ నివారణ దినం జరుపుతున్నారు. చిన్న వయసున్న వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మనిషి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. రోగాల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని అనుక్షణం రక్షిస్తుంటుంది.
#OneDayWithoutShoesDay 🦶👣
మనిషి జీవితంలో పాదరక్షలు చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న రోడ్లపై చెప్పులు లేకుండా నడవడం అంటే సాహసం చేసినట్లే. అందుకే పాద రక్షకాలను అందరూ ధరిస్తారు.ప్రపంచ వ్యాప్తంగా పేదరికంతో పాదరక్షణలు కొనే స్థోమత లేక ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి వారికి మద్దతుగా
ఈ రోజు పాద రక్షణలు లేకుండా ఒక రోజు ఉంటూ వారికి పాదరక్షణలు విరాళంగా ఇస్తారు..
ఈ విధంగా నేడు "పాద రక్షణలు లేకుండా ఒక రోజు" దినోత్సవం జరుపుకుంటారు.
అసలు చెప్పులు ఎలా వచ్చాయో తెలుసా?
పూర్వం ఓ రాజుగారికి, తన రాజ్యం మొత్తం చుట్టిరావాలని, మదిలో కోరిక కలిగిందంట.
రాజు తలచుకుంటే..! అన్న చందాన,వెంటనే మంత్రిని పిలిచి,రాజ్యామంతా ఎర్ర తివాచితో కప్పమన్నాడంట!ఆ మంత్రిగారు నేర్పుగా రాజుకి ఇలా చెప్పాడంట.అయ్యా! మహారాజా! రాజ్యమంతా తివాచి పరచాలంటే,మన సంపద సరిపోదు సరికదా!ఒక వేళ, ఆ పని ఆరంభించినా..
పూర్తి కావడానికి జీవిత కాలం చాలదు.
#MotherOceanDay
🌊⛵🚢🚤🏄♀️🏄♂️🤽♂️🚣♂️🚣♀️
సముద్రం ఓ ప్రపంచం. లక్షలాది జీవరాశులకు కన్న తల్లి.
పద్యం రాస్తున్నాను
సముద్రం చూస్తూ ఉంది
స్ర్తిలింగం పుంలింగం ధరించిన జలధి
ఒకరికి తండ్రి సముద్రుడు
ఒకరికి తల్లి సముద్రం! #MotherOcean #oceans#MothersDay
ఉధృతమై అలలు ముందుకురుకుతుంటే
ప్రమాదాన్ని పసిగట్టి సముద్రుడు
ముక్కుతాడేసి లాగుతుంటాడు
అలల్లో చిక్కిన మానవుడు
అసువులు బాసినపుడు
అలలెంతగా కన్నీరు విరజిమ్ముతాయో
వీక్షకులు ప్రత్యక్ష సాక్షులు
విగత జీవుల్ని వొడ్డుకు చేర్చి
సముద్ర గర్భంలో ఎవరూ దాగిలేరని
శే్వతపత్రం విడుదల చేస్తుంది
నిద్రించే చరాచరాలకు
మేల్కొల్పు చెప్పటానికి
సముద్రం నిత్యం ఘోషిస్తుంది
సూర్యుడు చంద్రుడు తన బిడ్డలని
పగలు రాత్రి తోడుండే అమరులని
మురిపెంగా చెప్పి మురుస్తుంది!
సముద్రుడు అరిస్టాటిల్‌కు
ప్రియాతి ప్రియమిత్రుడు
వొడ్డున నిల్చిన వీక్షకులకు
ఓడను పైనించి కిందికి
అంచెలంచెలుగా చూపి
#IndianOcean
హిందూ మహాసముద్రం ప్రపంచంలోని మహాసముద్ర విభాగాలలో మూడవ అతిపెద్దది, ఇది 70,560,000 కిమీ, భూమి ఉపరితలంపై 19.8% నీటిని కలిగి ఉంది. దీనికి ఉత్తరాన ఆసియా, పశ్చిమాన ఆఫ్రికా, తూర్పున ఆస్ట్రేలియా ఉన్నాయి. #Ocean
ఉపయోగంలో ఉన్న నిర్వచనాన్ని బట్టి దక్షిణాన ఇది దక్షిణ మహాసముద్రం అంటార్కిటికాతో సరిహద్దులుగా ఉంది. హిందూ మహాసముద్రంలో అరేబియా సముద్రం,లాకాడివ్ సముద్రం,సోమాలి సముద్రం,బంగాళాఖాతం,అండమాన్ సముద్రం వంటి కొన్ని పెద్ద ఉపాంత ప్రాంతీయ సముద్రాలు ఉన్నాయి.దీన్నే అర్ధ మహాసముద్రం అని పిలుస్తారు
ఈ సముద్రం ఒడ్డునే ఉన్నాయి. తూర్పు ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఖంఢాలను వేరుచేస్తుంది. ఎండాకాలంలో ఈ సముద్రంలో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. అన్ని సమద్రాలకంటే వెచ్చని సముద్రమని పేరు.