#PineappleDay 🍍 🍍🍍🍍
అనాస లేదా పైనాపిల్ (ఆంగ్లం: #Pineapple) ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది మామూలు చెట్ల మాదిరిగా కాక భూమి నుండి పెద్దగా విడివడిన పచ్చని కలువ మాదిగా ఉండును. దీని ఆకులు పొడవుగా ముళ్ళతో సున్నితంగా ఉండును. ఇది దక్షిణ అమెరికాలో పుట్టింది. అయితే ఇప్పుడు
ప్రపంచ వ్యాప్తం అన్ని దేశాలలో పెరుగుతుంది. దీని ఉత్పత్తిలో హవాయి రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రపం వ్యాప్తంగా పైనాపిల్ ఉత్పత్తిలో 60% వాటా హవాయిదే. అమెరికన్ ఆదివాసులు ఈ పండు అంటే బాగా ఇష్ట పడతారు. వారు దీన్ని దేవతాఫలంగా భావిస్తారు.
భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో పైనాపిల్ను పండిస్తారు. బ్==ప్రస్తావన== ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి. అందులో అనాస పండు ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది.
తాజా పండ్ల రూపంలోనే కాకుండా స్క్వాష్‌లు, జామ్‌లు, సిరప్‌లు, కార్డియల్స్ రూపంలో దీనిని మార్కెట్ చేస్తున్నారు. భారతదేశంలోకి ఇది 1548 సంవత్సరంలో ప్రవేశించింది. అప్పటి నుంచి దీని సాగు దేశీయంగా మొదలయ్యింది. మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలలో పైనాపిల్ను పండిస్తారు. బహువార్షిక గుల్మము.
దీని శాస్త్రీయ నామం ఎకోమోసస్. వృక్షశాస్త్రం ప్రకారం అనాస్ ఎకోమోసస్ అని..పిలుస్తారు. ఇది బ్రొమేలియా జాతికి చెందింది.
ఇది 1 మీటరు నుండి 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది కొంచెం పరిపక్వతకు వచ్చిన తరువాత పువ్వు వస్తుంది ఈ పువ్వు సుమారుగా 15 సెం.మీ ఉంటుంది. ఈ పువ్వు 12 నుండి 20 నెలల తరువాత పూర్తి పరిపక్వానికి వచ్చి, దీనిపై కనీసం 100 కనుపులు వరకూ ఏర్పడతాయి.
అనాసని 1398వ సంవత్సరంలో మెట్టమొదటగా కనుగొన్నారు. 1664 సంవత్సరంలో యూరోపియన్లు దీనిని పైన్ కోన్‌గా పిలిచారు. బ్రెజిల్‌లో టూపీ అని పిలుస్తారు. అద్భుతమైన పండు అని దీని అర్ధం. దీనిని ఒక్కొక్క భాషలో ఒక్కో రకంగా పిలుస్తారు. స్పానిష్‌లో పైన్ కోన్, అమెరికాలో అనాస్, మన దేశంలో అయితే
ఒరియాలో సాపూరీ పనాసా, తమిళంలో అనాచీ పాజ్ హామ్, బెంగాళీ, మలయాళంలో అనారోష్ అని పిలు స్తారు. బ్రెజిల్‌లో పెద్ద అనాస పండును అబాకాక్సీ అని పిలుస్తారు.
అయితే ఇంగ్లీష్‌లో పైన్‌యాపిల్, తెలుగులో అనాస అనే పేర్లతోనే అన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వాడబడు తున్నాయి.ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో గిరిజనులు ఈ పంటను విస్తారంగా పండించి రాష్ట్రం నలుమూలలకు పంపిణీ చేస్తున్నారు
వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి. పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్‌లో 'సి' విటమిన్ పుష్కలంగా ఉంటుంది.
ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలెయిన్ ఎంజైమ్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి.
ఉపయోగాలు:-
పుల్లపుల్లగా, తీయతీయగా ఉన్న అనాస పండు రసాన్ని తాగితే వాంతులు తగ్గుతాయి. పచ్చ కామెర్లతో బాధపడుతున్న వారికి ఈ రసం ఎంతో మేలు చేస్తుంది. తల్లిపాలు తగినంతగా లేని చంటి పిల్లలకు బాగా పండిన అనాసపండు రసం ఇస్తే చాలా మంచిది.
అనాస పండు ముక్కల్ని తేనెలో ఇరవై నాలుగు గంటలు వుంచి తింటే అజీర్తి పోతుంది. పేగులో చలనం కలిగి విరోచనం సాఫీగా అవుతుంది.అనాస పండును కోసుకొని తింటారు. దీనినుండి తీసిన రసం పానీయంగా త్రాగుతారు.
పైనాపిల్ జీర్ణక్రియ ప్రచారంలో సహాయపడుతుంది
పైనాపిల్ వికారం ఉపశమనంలో సహాయపడుతుంది
రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది.
ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.
పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.
పూర్తిగా పండని అనాస రసం తీసు కుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాస రసం ఇవ్వడం ఎంతో మంచిది. అనాస పండును ఆహారంగా తీసుకోవడం అందరికీ తెలిసిందే! కానీ అందచందాలను ఇనుమడింపజేసే శక్తి కూడా ఎక్కువగా ఉంది.
అనాసపండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది.
అనాసలోని ఎంజైమ్స్ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధుల ను, టైఫాయిడ్‌ని ఉపశమనం చేస్తుంది.
ఇది అర గడానికి రెండు గంటలు పడుతుంది. పండని అనాసకాయ తింటే అరగడం చాలా కష్టమవుతుంది. దీనితో విరేచనాలు అవుతాయి.
బాగా పండిన అనాస రసం శరీర తాపాన్ని తగ్గిస్తుంది. అదనపు శక్తిని కూడా కలిగిస్తుంది. ఈ పండులో ఉన్న కొన్ని ఎంజైమ్స్ కారణంగా జీర్ణశక్తి పెరిగి జీర్ణాశయానికి చక్కగా పనిచేస్తుంది.
ఈ పండులో అధికమైన పీచుపదార్థం మలబద్దకానికి మంచి మందుగా పనిచేస్తుంది.
అనాసలో సమృద్ధిగా పొటాషియం ఉండడం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధులలో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాలను ఇస్తుంది.
పచ్చి అనాసకాయ రసం తెగిన గాయాలపై వేస్తే రక్త స్రావం అరికడుతుంది.
గ్లాసు అనాస పండు రసంలో పంచదార కలిపి సేవిస్తే వేసవిలో అతి దాహం అంతరించి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
పొగ తాగడం వల్ల శరీరానికి సంభవించే అనర్ధాలు తగ్గిపోతాయి.
తాజా అనాస పండు రసాన్ని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్ నివారణ అవుతాయి.
గజ్జి, దురద ఉన్నవారు అనాస రసం పైపూత మందుగా వాడితే మంచి గుణం కనిపిస్తుంది.
పచ్చ కామెర్ల కాలేయ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, కొన్ని రకాల గుండెజబ్బులు ఉన్నవారు ప్రతిరోజు అనాసరసాన్ని తాగుతే మంచి ఫలితాలని స్థాయి.
పచ్చి అనాస రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది.
అనాస రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది.
అనాసలో ఉన్న ఫైబర్ మలబద్ధకం తగ్గించడానికి సహాయపడుతుంది.
అనాస వితమిన్ బి6 ఉంటుంది. గర్భవతులు ఈ పందు తినడమువలన వికారము నుండి ఉపశమనం పొందుతారు.
గర్భవతులు అనాస పండు తినడం శ్రేయస్కరం కాదు, గర్భవిచ్ఛిత్తి కావచ్చును. పచ్చికాయల రసంలో ఉప్పు వేసుకొని తాగితే ఋతుస్రావమౌతుంది. గర్భవిచ్ఛిత్తి కలుగుతుంది. కనుక గర్భవతులు తినకూడదు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#SocialMediaDay2021 #SocialMediaDay#SocialMedia
సోషల్ మీడియా లేదా సామాజిక మాధ్యమం అనగా విర్ట్యువల్ కమ్యునిటీస్ మరియు నెట్వర్క్ లలో కెరీర్ ఆసక్తులను, ఆలోచనలను, మరియు చిత్రాలను, వీడియోలను సృష్టించడానికి, పంచుకోవడానికి, లేదా సమాచారాన్ని మార్పిడి చేయడానికి ప్రజలను లేదా
కంపెనీలను అనుమతించే కంప్యూటర్-మాధ్యమ ఉపకరణాలు.సామాజిక మాధ్యమం ప్రజల చేతిలో ఆయుధం.మంచి-చెడు, ఆనందం-విషాదం, ఉద్యమం-ఉద్వేగం, కసి-కన్నీళ్లు ఇలా అన్ని రకాల భావోద్వేగాలకు వేదికవుతోంది సోషల్ మీడియా. ప్రపంచ గమనంలో కీలక పాత్ర పోషిస్తోంది.
అందుకే సామాజిక మాధ్యమం ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఐదవ స్తంభంగా మారుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. పౌరులు వారి అభిప్రాయాలకు సామాజిక మాద్యమం వేదికగా మారాయి. సామాజిక మాద్యమాలు ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు వ్యవస్థలో చోటుచేసుకుంటున్నాయి.
పారిశ్రామిక రూపకల్పన దినోత్సవం జూన్ 29న ప్రపంచ రూపకల్పన సంస్థ స్థాపనకు గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం.సంస్థ యొక్క 50 వ వార్షికోత్సవం సందర్భంగా 2007 లో ప్రారంభించారు. #IndustrialDesignDay #industrialdesign
పారిశ్రామిక రూపకల్పన ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను భారీ వస్తువుల ఉత్పత్తికి తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఉత్పత్తి కన్నా ముందే రూపకల్పన ప్రక్రియ మొదలవుతుంది, వస్తువు రూపం, లక్షణాలు, ముందుగా నిర్వచించి దానికి కంప్యూటరీకరణ చెయ్యాలి.
అన్ని ఉత్పత్తి చేసిన వస్తువులు కూడా రూపకల్పన పర్యావసానమే. ఇది వ్యక్తిగతంగానూ, సమూహములోను చెయ్యవచ్చు. సమూహములో చెయ్యడం వలన వివిధ రంగాలలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల జ్ఞానము, విజ్ఞానము ఉపయోగించవచ్చు ఉదాహరణ గా పారిశ్రామిక రంగంలో రూపకర్తలు, ఇంజనీర్లు , వ్యాపార రంగంలో నైపుణ్యంకు
#WorldCameraDay
📷📸🤳📹🎥🎦📹
కెమెరా (ఆంగ్లం: #Camera) అనగా స్థిర చిత్రాలను లేదా అలాంటి స్థిర చిత్రాల క్రమాన్ని చలన చిత్రంగా గాని, వీడియోలుగా గాని తీయడానికి ఉపయోగపడే ఒక వైద్యుత (ఎలక్ట్రానిక్) పరికరం. #SmilePlease 🙂
ఈ పదం లాటిన్ భాషలోని కెమెరా అబ్స్క్యురా (camera obscura) అనే పదం నుండి ఆవిర్భవించింది. కెమెరా అబ్స్క్యురా అనగా చీకటి గది అని అర్థం. ప్రారంభ దశలో మొత్తం గదిని చిత్రాలను తీయడానికి వాడేవారు.ఈనాడు మనం చూస్తున్న అత్యాధునిక కెమెరాలకి కెమెరా అబ్స్క్యూరా నే మూలం. #cameraday
కెమెరాలు మామూలు కాంతి (సాధారణ కంటికి కనిపించే వర్ణాలు) లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణము (Electromagnet radiation) ను ఉపయోగించి పనిచేస్తాయి. కెమెరాలో సాధారణంగా ఒక మూసి ఉన్న ఖాళీ ప్రదేశం ఉంటుంది. దానికి ఒక వైపున ఒక సూక్ష్మరంధ్రం ద్వారా కాంతి ఆ ఖాళీలోకి
Indian Railways: రైళ్ల కోచ్‌లకు పసుపు, తెలుపు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా?
Indian Railways: మనందరం ట్రైన్స్ ఎక్కుతాం, దిగుతాం... కానీ... వాటిపై ఉండే పసుపు, తెలుపు గీతలను పట్టించుకోం.
Indian Railways: 1859 ఏప్రిల్ 16న ఇండియాలో ఇండియన్ రైల్వేస్ సేవలు ప్రారంభమయ్యాయి.
మొదటి రైలు... ముంబై నుంచి థానే 33 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గంలో పరుగులు పెట్టింది. అయితే అప్పటి నుంచి రైళ్లకు పై భాగంలో పసుపు, తెలుపు, గ్రీన్ గీతలు గీస్తున్నారు. మనందరం రైళ్లు ఎక్కుతున్నాం, దిగుతున్నాం కానీ... ఆ గీతలు ఎందుకో, వాటిని ఎందుకు గీస్తారో తెలియదు.
ఇందుకు ప్రత్యేక కారణం ఉంది.
మన దేశంలో ప్రయాణికులకు తక్కువ ఖర్చులో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని భారతీయ రైల్వే అందిస్తోంది. 1951లో భారతీయ రైల్వే వ్యవస్థను జాతీయం చేశారు. ఇండియన్ రైల్వేస్... ఆసియాలో అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్, ప్రపంచంలో రెండో అతి పెద్దది.
InternationalMudDay
నేలలోని మొక్కల పెరుగుదలకు ఉపయోగపడగల మెత్తటి పొడిని మట్టి అంటారు.రైతు జీవితమంతా మట్టితో పెనవేసుకునే వుంటుంది. మట్టిని నమ్ముకున్న రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం. 'మట్టితో, పంటలతో అనుబంధమున్న రైతు నడుస్తుంటే, బాటకిరువైపులా పంట చేలు మన తోటే కదులుతూ
సంగీత సవ్వడులు చేస్తున్నాయి' అంటాడో కవి.మట్టితో కుండలను, మట్టి ఇటుకలను, మట్టి బొమ్మలను తయారుచేస్తారు. కొన్ని చోట్ల మట్టితో కోటలను నిర్మించారు.బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను మృణ్మయ పాత్రలు అంటారు. వీటిని చేయడాన్ని కుమ్మరం అంటారు.
గ్రామాలలో ఉపయోగించు వివిధ మట్టి పాత్రలు
కూజ .ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని, పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే ఉంది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి.
#NationalStatisticsDay
📊📈➖➖➖➖➖➖➖➖
*భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు 'పి.సి.మహలనోబిస్' జయంతి నేడు..*✍
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
✳️ 🇮🇳జాతీయ గణాంక దినోత్సవం 📊✳️
★భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడిగా పి.సి.మహలనోబిస్ ప్రసిద్దిచెందారు.
*■ గణాంక శాస్త్ర రంగంలో అతని సేవలకు గుర్తింపుగా లండన్లోని రాయల్ సొసైటీ పెల్లోగా ఎన్నికయ్యాడు. 1946 లో ఐక్యరాజ్యసమితి గణాంక శాస్త్ర కమీషన్ సభ్యుడిగా, 1949 లో కేంద్ర మంత్రి వర్గపు గణాంక శాస్త్ర గౌరవ సలహా దారుడిగా నియమించబడ్డాడు.*
*■1950 లో నేషనల్ శాంపిల్ సర్వే స్థాపన లో మహలనోబిస్ కీలకపాత్ర వహించాడు.*
*■ 1955 నుండి 1967 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగా తన సేవలందించాడు. రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో అతని కృషి అనిర్వచనీయం. భారీ పరిశ్రమ లకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆ ప్రణాళిక నమూనా 'మహల నోబిస్ నమూనా 'గా