#onionday 🧅🌰 #NationalOnionDay
ఉల్లిపాయ (#Onion) కరోలస్ లిన్నేయస్ ద్వినామీకరణ ప్రకారం ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతికి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. సాధారణం వంటకాలలో వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. వెల్లుల్లి కూడా ఇదే ప్రజాతికి చెందినది.
ఉల్లిపాయను సంస్కృతంలో పలాండు అని, హిందీలో ప్యాజ్ అని, ఇంగ్లీషులో ఆనియన్ అని అంటారు. తెలుగులో దీనిని ఉల్లిపాయ లేదా ఉల్లిగడ్డ అంటాము. నిజానికి దీనిని నీరుల్లిపాయ అనడం సరైనది. నీటి వసతి ఉన్న ప్రదేశాలన్నింటిలోనూ, వర్ష రుతువులోనూ దీనిని సాగు చేస్తారు.
దీనికి విత్తనాలుగా దుంపలను, గింజలను కూడా వాడవచ్చు. దీని ఆకులు సన్నగా, పొడవుగా ఉంటాయి. ఆకుల మధ్యలో ఒక కాండం ఉండి, దాని చివర పూలగుత్తి ఏర్పడుతుంది. అందులోనే గింజలు ఏర్పడుతాయి. ప్రతి మొక్కకు భూమిలో ఒకటినుంచి మూడు వరకూ దుంపలు ఏర్పడుతాయి.
ఉల్లి పాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి . ఇది ఆసియాలో పుట్టిందని కొందరంటే ... పాకిస్తాన్ లో పుట్టిందని కొందరంటారు. ఇప్పుడు అన్ని దేశాల్లో ఉల్లి పండుతుంది. పచ్చి ఉల్లి మంచి ఊఫ్రొడయజిక్ గా పనిచేయును. ఎన్నో హార్మోన్ల గుణాలు ఉల్లి రసంలో ఉన్నాయి.
ఆహర పదార్ధాల తయారీలలో మనం ముఖ్యంగా ఉల్లి పాయలను వినియోగిస్తాము. ఉల్లిపాయలనే కాకుండా ఉల్లి కాడలను ఆహర సంభందిత పదార్ధాలలో కలుపుతాము. ఉల్లిపాయ లేని కొన్ని కూరలు అసలు రుచింపరు. ఇది ముఖ్యంగా అనారోగ్యాలను ఔషధంగా మాత్రమే కాక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఉల్లిలో ముఖ్యముగా యాంటీ క్యాన్సర్, యాంటీ కొలెస్ట్రాల్, యాంటీ బ్యాక్టీరియల్ ఉంటాయి. ఉల్లిలో ఉండే “క్యుయర్ సెటిన్” అనే యాంటీ ఆక్సిడెంట్ కణాలకు ఉపయోగపడుతుంది. డ్రై & ట్రై సల్ఫేట్, లార్చీ మేకరీ ఫ్యాక్టర్, సేసానే, సల్ఫర్, క్రోమియం, కార్భోహైడ్రేట్స్, నీరు లభిస్తాయి.
పచ్చి ఉల్లి మంచి ఊఫ్రొడయజిక్ (Aphrodisiac) గా పనిచేయును . ఎన్నో హార్మోన్ల గుణాలు ఉల్లి రసంలో ఉన్నాయి. టేస్తోస్తేరాన్ (testosteron), ఇన్సులిన్ (insulin), గ్రౌత్ హార్మోన్ (GrowthHormone, ఆక్షితోసిక్ (Oxytocic) వంటి లక్షణాలు ఉన్నాయి., పచ్చి ఉల్లి ఎక్కువగా తింటే గుండె మంట (Acidity)
వస్తుంది . దీనిలో గంధకం పాలు ఎక్కువగా ఉంటుంది కావున కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తాయి . ఉల్లిలో కేలరీలు శక్తి ఎక్కువ .. వేయిస్తే ఈ శక్తి విలువ ఇంకా పెరుగుతుంది . ఉల్లిని అన్ని కూరలలోలో వాడుతారు . విందు భోజనాల్లో ఉల్లి పెరుగు చట్ని తప్పని సరిగా ఉంటుంది
“ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు” అని ఊరికే అనలేదు పెద్దలు.
అలాంటి ఉల్లి శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది.
-> కణజాలాలు దెబ్బతినకుండా రక్షణగా పనిచేస్తుంది.
-> వడ దెబ్బ తగలకుండా కాపాడుతుంది.
-> శరీరంలోని అన్ని అవయవాలను ఉత్తేజపరుస్తుంది.
-> ఉల్లిపాయను మెత్తగా దంచి పళ్ళకు రాస్తే పళ్ళ నుంచి రక్తం, చీము కారడం ఆగుతుంది.
-> తిమ్మిరి పట్టిన బాగంలో ఉల్లిపాయ రసంతో మర్ధన చేస్తే తిమ్మిరి తగ్గిపోతుంది.
-> జలుబును నివారిస్తుంది.
-> శరీరంలో అమితమైన వేడి ఉంటే ఉల్లిపాయల రసాన్ని చెక్కరతో కలిపిన మిశ్రమంతో తాగితే అమితమైన వేడి తగ్గి, చలువ చేస్తుంది.
-> అమితమైన దప్పికను అరికడుతుంది.
-> విషకీటకాలు కుట్టిన చోట దీనియొక్క గుజ్జును కానీ, రసాన్ని కానీ రాసియ యొడల విషాన్ని హరించి, మంటను తగ్గిస్తుంది.
-> గుండె ఆరోగ్యానికి రక్షణగా ఉంటుంది.
-> నీళ్ళ విరేచనాలు, జిగట విరేచనాలకు కొద్దిగా మెంతులు, ఉల్లిపాయ ముక్కలను వెన్నతో కలిపి తినాలి వీటికి ఔషధంగా పనిచేస్తుంది.
-> తల నొప్పికి, ఉపశమనాన్ని కలిగిస్తుంది.
-> ఉల్లిపాయను నూరి ఆ గుజ్జులో ఆవనూనెను కలిపి రాసియ కీళ్ళనొప్పులు తగ్గును.
-> వెంట్రుకలు రాలి పోకుండా నిరోధిస్తుంది.
-> పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించినప్పుడు, ఉల్లిపాయ వాసన చూస్తే, ఆ వాసన యొక్క ప్రభావం తగ్గుతుంది.
-> మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది.
-> ఈ రసంలో మిరియాల పొడిని కలుపుకుని త్రాగితే జ్వర తీవ్రతను నెమ్మదిస్తుంది.
-> కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
-> క్యాన్సర్ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది.
-> ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
-> కండరాల నొప్పులను తగ్గిస్తుంది.
-> ఎముకల్లో ఖనిజాల సాంద్రతను వృధ్ధిచేసి, ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
-> దగ్గును పోగొడుతుంది.
-> మూత్రవిసర్జనా సమయంలో ఏర్పడిన మంటను పోగొడుతుంది
రకాలు
తెల్లనివి
ఎర్రనివి
చిన్నవి
పెద్దవి
ఎక్కువ వాసన కలవి
తక్కువ వాసన కలవి
తియ్యటివి
ఉల్లికాడల ఖరీదు తక్కువే. ఉల్లిపాయల్ని ఉల్లికాడల ఖరీదు తక్కువే. ఉల్లిపాయల్ని వాడలేని వాళ్లకి తక్కువ ఘాటుతో, మంచి రుచితో ఉండే ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం. పోషకాల పరంగా చూసినా ఇవెంతో ఉపయోగపడతాయి.ఉల్లి కాడల్లో ఉండే కెమోఫెరాల్ అనే ఫ్లవనాయిడ్ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా,
రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్టు చూస్తుంది. ఉల్లికాడలను ఎక్కువగా వాడితే రక్తపోటూ, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. వీటిల్లో ఉండే ఫోలేట్లు గుండె జబ్బులని అదుపులో ఉంచుతాయి.
కెలోరీలూ కొవ్వూ తక్కువగా... పీచు ఎక్కువగా ఉండే ఉల్లికాడల్ని తరచూ తినే వారిలో అధిక బరువు సమస్య తలెత్తదు. డైటరీ ఫైబర్ అంటే ఆహార సంబంధిత పీచు వీటి నుంచి సమృద్ధిగా అందుతుంది. అది ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఉల్లికాడల్లోని గ్జియాంతిన్ అనే పదార్థం కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
హానికారక కిరణాల బారి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. గర్భిణిగా ఉండగా తొలి మూడునెలల్లో వీటిని తరచూ తినడం వల్ల, కడుపులో బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది. గర్భస్థ శిశువుకి వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి. ఆటిజం వంటి ప్రవర్తనాపరమైన సమస్యలూ రాకుండా ఉంటాయి.
కాలేయం చుట్టూ పేరుకొనే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. వాటిల్లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ 'సి', బీటా కెరొటిన్ కూడా ఎక్కువ మొత్తంలోనే లభిస్తాయి. అనుకునే వాళ్లకి తక్కువ ఘాటుతో, మంచి రుచితో ఉండే ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం. పోషకాల పరంగా చూసినా ఇవెంతో ఉపయోగపడతాయి.
ఇంటి వైద్యం
తెల్ల ఉల్లిపాయ రసాన్ని నాలుగు నుండి ఆరు టీస్పూన్ల మోతాదులో రోజుకు రెండు లేదా మూడుసార్లు వాడితే శరీరం లోపల జరిగే అంతర్గత రక్తస్రావాలు తగ్గుతాయి. తెల్ల ఉల్లిపాయ ముక్కలను మజ్జిగలో కలుపుకొని తాగుతూ ఉన్నా చక్కని గుణం కనిపిస్తుంది.
నాలుగు టీస్పూన్ల ఉల్లిపాయ రసానికి ఒక చిటికెడు పొంగించిన ఇంగువ పొడిని, ఒక చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజుకు అవసరాన్నిబట్టి రెండూ లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే పొట్ట ఉబ్బరింపు, పొట్ట నొప్పి, గ్యాస్ తగ్గుతాయి.
ఉల్లి రసానికి తగినంత తేనె కలిపి కంట్లో చుక్కల మందుగా వేసుకుంటూ ఉంటే కంటి చూపు పెరుగుతుంది.ఒకటి నుండి రెండు టీస్పూన్ల ఉల్లిపాయ రసానికి రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని, చిటికెడు ఉప్పును కలిపి అవసరాన్ని బట్టి రెండు లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే కడుపునొప్పి తగ్గుతుంది.
ఒకటి నుండి రెండు ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌కు కలిపి తింటే ఆమాశయం, జీర్ణ అవయవాలు శక్తివంతం అవుతాయి.
రెండు నుండి నాలుగు టీస్పూన్ల ఉల్లిపాయ రసాన్ని రోజుకు మూడు లేదా నాలుగుసార్లు మూడు నెలలపాటు తాగితే మూత్రపిండాల నొప్పి,
పొత్తికడుపులో నొప్పి, పేగులలో పురుగులు, మూత్ర వ్యవస్థలో రాళ్లు తయారవటం వంటి అన్ని సమస్యలు తగ్గుతాయి.
ఒకటి లేదా రెండు తెల్ల ఉల్లిపాయలను చిన్నగా తరిగి నీళ్లలోవేసి మరిగించి తాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది.
ఉల్లిపాయ రసాన్ని, సున్నం నీళ్లను సమభాగాలుగా కలిపి పూటకు రెండు టీస్పూన్ల వంతున మూడు పూటలా తాగితే కలరాలో నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.
25 గ్రాముల ఉల్లిపాయ ముక్కలను, 6 మిరియం గింజలను మెత్తగా దంచి గుడ్డలో వేసి రసం పిండండి. దీనిని ఎంత వీలైతే అంత తాగండి. అవసరం అనుకుంటే దీనికి పటికబెల్లం పొడిని కలపవచ్చు. దీంతో ప్రాణ ప్రమాదాన్ని కలిగించే కలరా లక్షణాలు తగ్గుతాయి.
అసాధ్యమైన కలరా వ్యాధిలో రోగి మగతగా పడుకొని నీళ్లు కూడా తాగలేని స్థితిలో ఉన్నప్పుడు 250 మిల్లీగ్రాముల కర్పూరం పొడిని నోట్లో వేసి వెంటనే 2 టీస్పూన్ల ఉల్లిపాయ రసాన్ని పోయండి. దీంతో ఎంతటి తీవ్రమైన కలరా వ్యాధిలోనైనా ఫలితం కనిపిస్తుంది.
ప్రతి 10 లేదా 15 నిమిషాలకు ఒకసారి ఉల్లిపాయ రసాన్ని తాగగలిగినంత రోగి చేత తాగిస్తూ ఉంటే కలరా వ్యాధి ఉపశమిస్తుంది.
ఒక టీస్పూన్ ఉల్లిపాయ రసం, ఒక టీస్పూన్ ఆవునెయ్యి, అర టీస్పూన్ తేనెలను కలిపి ఉదయం, సాయంకాలం చప్పరిస్తూ రాత్రిపూట పాలు తాగుతూ ఉంటే సిఫిలిస్ వ్యాధి, మూత్రాధిక్యత అతి మైధునంతో ఏర్పడిన నపుంసకత తదితర సమస్యలు అన్నీ తగ్గుతాయి.
ఉల్లిరసాన్ని, నెయ్యిని సమభాగాలుగా కలిపి దీనిని ఒక టీస్పూన్ మోతాదుగా మూడుపూటలా తీసుకోండి. దీనితో శారీరక బలహీనత దూరమవుతుంది.
ఉల్లిపాయను మెత్తని గుజ్జుగా నూరి మొలల మీద, జారిన మలాశయం మీద లేపనంగా పూసుకుంటే మొలల్లోని వాపు, దురద, నొప్పి తగ్గుతాయి.
125 మి.లీ. ఉల్లిరసానికి నాలుగు టీస్పూన్ల పటికబెల్లం పొడిని కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండండి. ఇది రక్తస్రావంతో కూడిన మూలవ్యాధిలో అమోఘంగా పనిచేస్తుంది. దీంతో రక్తస్రావం త్వరితగతిన ఆగుతుంది.
పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#SocialMediaDay2021 #SocialMediaDay#SocialMedia
సోషల్ మీడియా లేదా సామాజిక మాధ్యమం అనగా విర్ట్యువల్ కమ్యునిటీస్ మరియు నెట్వర్క్ లలో కెరీర్ ఆసక్తులను, ఆలోచనలను, మరియు చిత్రాలను, వీడియోలను సృష్టించడానికి, పంచుకోవడానికి, లేదా సమాచారాన్ని మార్పిడి చేయడానికి ప్రజలను లేదా
కంపెనీలను అనుమతించే కంప్యూటర్-మాధ్యమ ఉపకరణాలు.సామాజిక మాధ్యమం ప్రజల చేతిలో ఆయుధం.మంచి-చెడు, ఆనందం-విషాదం, ఉద్యమం-ఉద్వేగం, కసి-కన్నీళ్లు ఇలా అన్ని రకాల భావోద్వేగాలకు వేదికవుతోంది సోషల్ మీడియా. ప్రపంచ గమనంలో కీలక పాత్ర పోషిస్తోంది.
అందుకే సామాజిక మాధ్యమం ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఐదవ స్తంభంగా మారుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. పౌరులు వారి అభిప్రాయాలకు సామాజిక మాద్యమం వేదికగా మారాయి. సామాజిక మాద్యమాలు ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు వ్యవస్థలో చోటుచేసుకుంటున్నాయి.
పారిశ్రామిక రూపకల్పన దినోత్సవం జూన్ 29న ప్రపంచ రూపకల్పన సంస్థ స్థాపనకు గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం.సంస్థ యొక్క 50 వ వార్షికోత్సవం సందర్భంగా 2007 లో ప్రారంభించారు. #IndustrialDesignDay #industrialdesign
పారిశ్రామిక రూపకల్పన ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను భారీ వస్తువుల ఉత్పత్తికి తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఉత్పత్తి కన్నా ముందే రూపకల్పన ప్రక్రియ మొదలవుతుంది, వస్తువు రూపం, లక్షణాలు, ముందుగా నిర్వచించి దానికి కంప్యూటరీకరణ చెయ్యాలి.
అన్ని ఉత్పత్తి చేసిన వస్తువులు కూడా రూపకల్పన పర్యావసానమే. ఇది వ్యక్తిగతంగానూ, సమూహములోను చెయ్యవచ్చు. సమూహములో చెయ్యడం వలన వివిధ రంగాలలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల జ్ఞానము, విజ్ఞానము ఉపయోగించవచ్చు ఉదాహరణ గా పారిశ్రామిక రంగంలో రూపకర్తలు, ఇంజనీర్లు , వ్యాపార రంగంలో నైపుణ్యంకు
#WorldCameraDay
📷📸🤳📹🎥🎦📹
కెమెరా (ఆంగ్లం: #Camera) అనగా స్థిర చిత్రాలను లేదా అలాంటి స్థిర చిత్రాల క్రమాన్ని చలన చిత్రంగా గాని, వీడియోలుగా గాని తీయడానికి ఉపయోగపడే ఒక వైద్యుత (ఎలక్ట్రానిక్) పరికరం. #SmilePlease 🙂
ఈ పదం లాటిన్ భాషలోని కెమెరా అబ్స్క్యురా (camera obscura) అనే పదం నుండి ఆవిర్భవించింది. కెమెరా అబ్స్క్యురా అనగా చీకటి గది అని అర్థం. ప్రారంభ దశలో మొత్తం గదిని చిత్రాలను తీయడానికి వాడేవారు.ఈనాడు మనం చూస్తున్న అత్యాధునిక కెమెరాలకి కెమెరా అబ్స్క్యూరా నే మూలం. #cameraday
కెమెరాలు మామూలు కాంతి (సాధారణ కంటికి కనిపించే వర్ణాలు) లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణము (Electromagnet radiation) ను ఉపయోగించి పనిచేస్తాయి. కెమెరాలో సాధారణంగా ఒక మూసి ఉన్న ఖాళీ ప్రదేశం ఉంటుంది. దానికి ఒక వైపున ఒక సూక్ష్మరంధ్రం ద్వారా కాంతి ఆ ఖాళీలోకి
Indian Railways: రైళ్ల కోచ్‌లకు పసుపు, తెలుపు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా?
Indian Railways: మనందరం ట్రైన్స్ ఎక్కుతాం, దిగుతాం... కానీ... వాటిపై ఉండే పసుపు, తెలుపు గీతలను పట్టించుకోం.
Indian Railways: 1859 ఏప్రిల్ 16న ఇండియాలో ఇండియన్ రైల్వేస్ సేవలు ప్రారంభమయ్యాయి.
మొదటి రైలు... ముంబై నుంచి థానే 33 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గంలో పరుగులు పెట్టింది. అయితే అప్పటి నుంచి రైళ్లకు పై భాగంలో పసుపు, తెలుపు, గ్రీన్ గీతలు గీస్తున్నారు. మనందరం రైళ్లు ఎక్కుతున్నాం, దిగుతున్నాం కానీ... ఆ గీతలు ఎందుకో, వాటిని ఎందుకు గీస్తారో తెలియదు.
ఇందుకు ప్రత్యేక కారణం ఉంది.
మన దేశంలో ప్రయాణికులకు తక్కువ ఖర్చులో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని భారతీయ రైల్వే అందిస్తోంది. 1951లో భారతీయ రైల్వే వ్యవస్థను జాతీయం చేశారు. ఇండియన్ రైల్వేస్... ఆసియాలో అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్, ప్రపంచంలో రెండో అతి పెద్దది.
InternationalMudDay
నేలలోని మొక్కల పెరుగుదలకు ఉపయోగపడగల మెత్తటి పొడిని మట్టి అంటారు.రైతు జీవితమంతా మట్టితో పెనవేసుకునే వుంటుంది. మట్టిని నమ్ముకున్న రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం. 'మట్టితో, పంటలతో అనుబంధమున్న రైతు నడుస్తుంటే, బాటకిరువైపులా పంట చేలు మన తోటే కదులుతూ
సంగీత సవ్వడులు చేస్తున్నాయి' అంటాడో కవి.మట్టితో కుండలను, మట్టి ఇటుకలను, మట్టి బొమ్మలను తయారుచేస్తారు. కొన్ని చోట్ల మట్టితో కోటలను నిర్మించారు.బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను మృణ్మయ పాత్రలు అంటారు. వీటిని చేయడాన్ని కుమ్మరం అంటారు.
గ్రామాలలో ఉపయోగించు వివిధ మట్టి పాత్రలు
కూజ .ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని, పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే ఉంది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి.
#NationalStatisticsDay
📊📈➖➖➖➖➖➖➖➖
*భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు 'పి.సి.మహలనోబిస్' జయంతి నేడు..*✍
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
✳️ 🇮🇳జాతీయ గణాంక దినోత్సవం 📊✳️
★భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడిగా పి.సి.మహలనోబిస్ ప్రసిద్దిచెందారు.
*■ గణాంక శాస్త్ర రంగంలో అతని సేవలకు గుర్తింపుగా లండన్లోని రాయల్ సొసైటీ పెల్లోగా ఎన్నికయ్యాడు. 1946 లో ఐక్యరాజ్యసమితి గణాంక శాస్త్ర కమీషన్ సభ్యుడిగా, 1949 లో కేంద్ర మంత్రి వర్గపు గణాంక శాస్త్ర గౌరవ సలహా దారుడిగా నియమించబడ్డాడు.*
*■1950 లో నేషనల్ శాంపిల్ సర్వే స్థాపన లో మహలనోబిస్ కీలకపాత్ర వహించాడు.*
*■ 1955 నుండి 1967 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగా తన సేవలందించాడు. రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో అతని కృషి అనిర్వచనీయం. భారీ పరిశ్రమ లకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆ ప్రణాళిక నమూనా 'మహల నోబిస్ నమూనా 'గా