#Math20Day#Mathematics#maths
మానవుల నిజజీవితంలో సున్నా కనుగొన్నప్పటి నుండి గణిత గమనం చక్రం కన్నా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. నిత్యావసర మానవుని మేథో ఆయుధంగా గణితం మారింది. #Math20Day#Math
ఈజిష్టియన్లు, సుమేరియన్లు, రోమన్లు ఎందరో ఈ శాస్త్ర అభివృద్ధికి అహర్నిశలు అంకుఠిత దీక్షతో పయనించారు. ఒక శాస్త్రం జీవితంలో ఎలా మమేకమై పోతుందో దానిపై ఆధారపడి మనిషి ప్రయాణం ఎలా ఉంటుందో గణితం ఒక చక్కని ఉదాహరణ.
మానవ విజ్ఞానంలో అత్యంత ఉపయోగకరమైన మరియు ఆసక్తికరమైన శాస్త్రాలలో గణితశాస్త్రం ఒకటి. మానవుడు మాట్లాడటo మొదలు పెట్టిన రోజే గణితం గురించి తెలుసుకోవడo ప్రారంబించాడు మరియు ప్రతి ఒక్కరూ వారి దైనందిన కార్యక్రమాలలో లో గణితం ఉపయోగిస్తారు
నిత్యజీవితలో గణితం ఎంత ముఖ్యమైనదో మీరెవరైనా గుర్తించారా ? ఏ వృత్తిని నిర్వహించాలన్నా లేదా ఏ పనిని చేయాలన్నా గణితశాస్త్ర పరిజ్ఞానం ఎంతో అవసరమౌతుంది. గణితశాస్త్ర పరిజ్ఞానం లేనిదే ఏ వృత్తి కాని ఏ విభాగం కానీ సంపూర్ణం కాలేవు .
దీని గురించి తెలుసుకోవడానికి కొంత సమయం పాటు ఈ ప్రపంచంలో గణితం లేదని ఊహించుకొని చూద్దాం ?
గడియారం లేదా కాలెండర్ లేని మీ జీవితాన్ని ఊహించుకోండి. ఈ రెండూ గణితానికి ప్రాథమికమైన, ముఖ్యమైన సంఖ్యల పై ఆధారపడ్డాయి. రోజులో ఎంత సమయమైందని నీవు ఎలా తెలుసుకొంటావు? కాలెండర్ సహాయం లేకుండా నీ పుట్టిన రోజుని నీవు జరుపుగోగలవా ?
నీవు కొన్ని వస్తువులను కొనడానికి ఒక దుకాణానికి వెళ్ళావు , ఇప్పుడు గణితం లేదనేది గుర్తుంచుకో, కావున డబ్బంటే ఏమిటో తెలియదు , కొలత అంటే ఏమిటో తెలియదు. అపుడేమి చేస్తావు ?
నాడిని పరీక్షించే వైద్యుడైనా , భూమి పై ఎన్ని రకాలు, జీవజాతులున్నాయని అంచనా వేసే జంతుశాస్త్రవేత్త కైనా లెక్కించడం అంటే ఏమిటో తెలియాలి . గణితశాస్త్ర పరిజ్ఞానం లేకుండా ఇంజనీర్ ( యంత్ర నిర్మాత) కూడా వంతెనలని నిర్మించలేడు. ఎంత పరిమాణంలో వివిధ రకాల రసాయనాలను కలపాలో
తెలుసుకోలేకపోతే ఒక రసాయనవేత్త కూడా ఒక మందుని తయారు చేయలేడు.
ఈ గణితం లేకుండా ఈ ప్రపంచంలో వ్యాపారం లేదా మార్కెట్ లేవు ఎందుకంటే ఇవన్నీ డబ్బు పై ఆధారపడినవి. అలాగే ఏ దేశ అభివృద్ది అయినా ఎక్కువగా ఆ దేశఆర్ధిక ప్రగతి పై మాత్రమే ఆధారపడ్డాయి, కావున ఇది కూడా ఒక సమస్య అవుతుంది.
గణితం లేకుండా సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి ఉండదు , ఎందుకంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో గణితంపై ఆధారపడి ఉంది.
మనం ఈ సాంకేతిక పరిజ్ఞానంపై ఎంతగానో ఆధారపడ్డాం అంటే ,దీని ఆధారంగా నిర్మించిన కంప్యుటర్, సెల్ ఫోన్ లేదా టెలివిసన్, లేని జీవితాన్ని ఊహించలేము. అలాగే విద్యుత్ లేకుండా మన జీవనాన్ని కొనసాగించలేము. విద్యత్ కేంద్రాలలో జనింపచేసే విద్యుత్ కూడా గణితంతో సంబంధించినదే.
గణితమంటే ఎంతో భయమున్నా నిత్యజీవితంలోని దీని విస్త్రుత ఉపయోగం వలన దీనిని ఉపయోగించవలసినదే. నిజానికి గణితమే లేకుంటే మన జీవితాలు చాలా సంక్లిష్టంగా ఉండేవేమో !
గణితశాస్త్ర ప్రాముఖ్యత తెలిసి కూడా చాలా మంది దీనిని గురించి తెలుసుకొనేందుకు , అవగాహన చేసుకునేందుకు అయిష్టత చూపిస్తారు. గణితంలో ప్రాథమిక భావనలపై పట్టు ఉంటే గణితమన్నది అసలు కష్టమే కాదు. నిజానికి గణితం అందరూ ఊహిస్తున్నట్లు సంక్లిష్టమైనది కాదు , వారి దృక్పథమే ఈ విధంగా చేస్తూన్నది.
మీకు ప్రాథమిక పాఠశాలలో కూడికలను, తీసివేతలను, గుణకారాలను, భాగాహారాలను బోధించారు. అప్పటి నుండి నీవు ఇతర భావనలను అభ్యసించ డానికి వీటిని ఉపయోగిస్తున్నావు. ఈ ప్రాథమిక భావనలను ఉపయోగించకుండా సరళ వడ్డీ , శాతాలు వైశాల్యం, పరిమాణం, బీజగణితం మరియు త్రికోణమితి లేదా ఇంకేవైనా సమస్యలను
పరిష్కరించ గలవా ? గణితం లోని మిగిలిన ఇతర భావనలన్నీ ఈ ప్రాథమిక భావనలపై ఆధారంగా ఏర్పడినవే . ఈ ప్రాథమిక భావనలను సరిగా అవగాహన చేసుకోలేకపోతే మనం కొత్తగా బోధించే భావనలకు ఈ భావనలను అనువర్తించడంలో విఫలమౌతాము.
గణితం వాస్తవికత అని చెప్పుకోవచ్చు.
ఉదాహరణకు, జీవశాస్త్రం గురించి ఆలోచించండి, ఇది కెమిస్ట్రీపై ఆధారపడి ఉంది. అలాగే, దీన్ని భౌతిక శాస్త్ర నియమాలతో నిర్వచించాలి.
లేదా నీలిరంగు ఆకాశం గురించి ఆలోచించండి, కాంతి వక్రీభవనం వల్ల ఆకాశం నీలిరంగులో ఉంటుందని వివరణ ఉంది.
అదే సంఖ్యల విషయానికి వస్తే...
మీరు బాగా లోతుగా ఆలోచిస్తే, భౌతిక వాస్తవికత కూడా గణితశాస్త్రమే అని అనిపిస్తుంది.
అయితే, ప్రేమ, ఆకలి, నైతికత వంటి జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి గణితశాస్త్రం మనకు చెప్పదనే విషయాన్ని గ్రహించాలి.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#KalidasDivas#KalidasJayanti
కాళిదాసు ఒక సంస్కృత కవి, నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు సాక్ష్యం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు, నాటకములు చాలావరకు హిందూ పురాణ, తత్త్వ సంబంధముగా రచించారు. #Kalidas
రఘువంశము, కుమార సంభవము, మేఘసందేశం అనే మూడు మహాకావ్యాలు, అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్ని మిత్రము అనే మూడు నాటకాలు ఆయన రచనల్లో పేరు గాంచినవి. కాళిదాసు అను పేరుకు అర్థం కాళి యొక్క దాసుడు.
కాళికా దేవి దాసుడిని అని చెప్పుకొనే కాళిదాస మహా కవి గొప్ప సంస్కృత నాటక కర్త ,కావ్య సృజన శీలి ,వ్యాస ,వాల్మీకుల తర్వాతి స్థానాన్ని ఆక్రమించుకొన్న మహా కవి. ఈ మహాను భావుడి కాలాన్ని కూడా సరిగ్గా ఇప్పటికీ తేల్చలేక పోయారు. ఐదవ శతాబ్ది వారని అనుకుంటారు.
#DontStepOnABeeDay #BeeFriendly 🐝🍯
భూగోళం మీద ఉన్న జీవ జాతుల్లో అత్యంత
ముఖ్యమైన, విలువైన జీవి 'తేనెటీగ' అని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు నిర్దారించారు.ప్రపంచవ్యాప్తంగా వాటి ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడిపోయిందని ప్రకటించారు.
ఇటీవలి అధ్యయనాలు దాదాపుగా 90% తేనెటీగలు అంతరించిపోయినట్టు వెల్లడించాయని తెలిపారు. అడవుల నరికివేత, గూళ్లు కట్టడానికి అనువైన స్థితి లేకపోవడం, పురుగు మందుల వాడకం, నేలల్లో వస్తున్న మార్పుల కారణంగా తేనెటీగల ఉనికి ప్రశ్నార్థకంగా మారినట్టు వెల్లడించారు.
వ్యవసాయ ఆవిష్కరణల ఫౌండేషన్ సహకారంతో అపికల్పర్ ఎంట్రపెన్యూర్షిప్ సెంటర్ ఆఫ్ యూనివర్సదద్,అపికల్చర్ కార్పోరేషన్ ఆఫ్ చిలే సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం తేనెటీగల గురించి ఒక ఆసక్తికర విషయాన్ని నిర్దారించింది. ఈ భూగోళంపై ఉన్న జీవ జాతుల్లో కేవలం తేనెటీగలు మాత్రమే..
#GlobalEnergyIndependenceDay
స్థిరమైన మరియు పరిశుభ్రమైన శక్తి ఉత్పాదనకోసం సౌరశక్తి, గాలి, మొక్కలు, నీరు వంటి తరగని ప్రాకృతిక వనరులను పునర్వినియోగ ఇంధనంగా వినియోగిస్తారు. దీనిలో ఇమిడి ఉన్న పర్యావరణ మరియు ఆర్థిక ప్రయోజనాలు: #GlobalEnergy
♻️🌀🌊☢️🌞
♻️గ్రీన్ హౌస్ వాయు రహితంగా మరియు వాయు కాలుష్యం తగ్గిస్తూ ఇంధన ఉత్పాదన.
♻️ ఇంధన దిగుమతులపై ఆధారపడడాన్ని ఇంధన వైవిధ్యం తగ్గిస్తుంది.
♻️ఆర్థిక అభివృద్ధి మరియు మ్యాన్‌ఫ్యాక్చరింగ్, ఇనస్టలేషన్ ఇతరత్రా ఉద్యోగాలు.
పునర్వినియోగ ఇంధన వనరులు
🌞సౌరశక్తి అనేది సూర్య కాంతిని వినియోగించుకుని చేసే విద్యుచ్ఛక్తి. దీనిని వేడి పుట్టించడానికి, నీళ్లను మరిగించడానికి, చల్లబరచడానికి వాడవచ్చు. ఇంకా పలు విధాలైన వాణిజ్య, పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవచ్చు.
నికోలా టెస్లా (ఆంగ్లం : #NikolaTesla#Tesla) (1856 జూలై 10 - 1943 జనవరి 7) ఒక ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీర్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్. నికోలా, ప్రస్తుతము క్రొయేషియాలో ఉన్న స్మిల్యాన్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు పుట్టుకతో సెర్బియన్, తర్వాత కాలంలో అమెరికా పౌరుడు అయ్యాడు.
ఇతడు తరచూ 'ధరణిపై కాంతిని విరజిమ్మిన' ఆధునిక యుగానికి చెందిన గొప్ప శాస్త్రవేత్తగా మరియు ఆవిష్కర్తగా కీర్తించబడ్డాడు.19వ శతాబ్దాంతంలో మరియు 20వ శతాబ్దపు ఆరంభంలో విద్యుత్ మరియు అయస్కాంతత్వాలకు సంబంధించిన పరిశోధనలలో విప్లవాత్మకమైన విషయాలను అందించిన శాస్త్రవేత్త.
నికోలా టెస్లా పేటెంట్లు మరియు పరిశోధనా విషయాలు ఆధునిక విద్యుచ్ఛక్తి, ఎలక్ట్రిక్ మోటార్లు వంటి విషయాల అభివృద్ధికి దోహదపడడం ద్వారా రెండవ పారిశ్రామిక విప్లవానికి నాంది పలికాయి.
1894లో వైర్లెస్ కమ్మ్యూనికేషన్ (రేడియో) ప్రదర్శన వల్ల అమెరికాలోని ఎలక్ట్రికల్ ఇంజనీర్లలో
#KebabDay#kebab#kabab
కబాబ్ అంటే గతంలో మటన్‌తో చేసేది అని అర్థం. ఇప్పుడు చికెన్ కబాబ్... ప్రాన్స్ కబాబ్ అని రకరకాల కబాబులు రెడీ అయిపోతున్నాయి. పూర్తి స్థాయి వంట చేసుకోవడానికి వీల్లేని రోజుల్లో సైనికులు మాంసాన్ని ఎండబెట్టి దాచుకొని అప్పటికప్పుడు నిప్పుల్లో కాల్చుకొని తినేవారు.
ఈ ఎండు మాంసమే కబాబ్ మారింది. ఇప్పుడు ఇన్స్టాంట్ కబాబులు వడ్డిస్తున్నారు. నాన్‌వెజ్‌లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువా కాకపోయినా కబాబ్‌లకు రాచరికపు హోదా దక్కింది. కబాబ్‌లు వడ్డించారంటే అదో పెద్ద హోదా కిందే ఇప్పటికీ. కబాబ్ ను ఏ సందర్భంలోనైనా తయారు చేసుకోవచ్చు.
ముఖ్యంగా వర్షాకాలంలో వేజిటేరియన్ స్నాక్స్ తో పాటు, కబాబ్ లు కూడా చాలా ప్రసిద్ధి. వర్షాకాలంలో నోటికి రుచికరంగా వేడి వేడిగా కబాబ్ తింటే ఎలా ఉంటుంది. చాలా మందికి మాంసాహార ప్రియులు కబాబ్ లను ఇష్టపడుతారు.
అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఈ కబాబ్ ను ఒక్కో రకంగా వండుతారు.
సంజీవ్ కుమార్ (జన్మ నామం: హరిహర్ జెఠాలాల్ జరీవాలా 9 జూలై 1938 – 6 నవంబర్ 1985) ఒక పేరుపొందిన భారతీయ చలనచిత్ర నటుడు. వీరు అనేక అవార్డులను గెలుచుకున్నాడు. వాటిలోఉత్తమ నటుడిగా రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉన్నాయి. వీరు సినిమాలలో విభిన్నమైన పాత్రలను ధరించి
ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు.
సంజీవ్ కుమార్ అసలు పేరు హరిహర్ జెఠాలాల్ జరీవాలా (హరిభాయ్ అని కూడా వ్యవహరించబడేవాడు) #Sholay#SanjeevKumar
వీరు గుజరాత్ లోని సూరత్ లో ఒక గుజరాతీ పటేల్ కుటుంబంలో జన్మించారు. వీరి బాల్యం సూరత్‌లో గడచింది.తరువాత ఇతని కుటుంబం ముంబాయికి తరలి వెళ్ళింది.
అక్కడ ఒక ఫిలిం స్కూలులో సంజీవ్ కుమార్ శిక్షణ పొందారు. తద్వారా బాలీవుడ్లో నటుడిగా స్థిరపడ్డారు. ఇతని ఇరువులు సోదరులు ఒక సోదరి ఉన్నారు.షోలే చిత్రంలో ఠాకూర్ పాత్ర ఇతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. నయాదిన్ నయీరాత్ సినిమాలో తొమ్మిది పాత్రలను ధరించారు.