#ColumnistsDay
✍️📰 కాలమిస్ట్ దినోత్సవం

కాలమిస్ట్, వ్యాసాలు రాసే పత్రికా రచయిత, పత్రికకు క్రమం తప్పక వ్యాసాలు రాచే రచయిత.
#columnist
కాలమిస్టు అంటే ఎవరు? సమాధానాలు ఇలా కొన్నింటిని చెప్పుకోవచ్చు - తలపండిన వాడు, జీవన సారాన్ని పుక్కిటపట్టిన వాడు, శాస్త్రాలను అవపోశన పట్టినవాడు,
గురువుగా భావింపబడేవాడు, బతికినన్నాళ్లు రాసినా తరగని మేధోసంపత్తి గలవాడు, ప్రలోభాలకు లొంగనివాడు, వజ్రసంకల్పుడు. ఇప్పుడు రాస్తున్న వారిలో ఇందులో ఒక్క గుణమున్నా పాఠకులు ఆ ‘కాలమ్’ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. వారికోసం ప్రపంచాన్ని గాలించైనా వెదికి పట్టుకోవాలి.
రానున్న తరంలో మన భాష నిలువాలన్నా, మన సంస్కృతి పరిఢవిల్లాలన్నా, పత్రికలు తమ పాత్రను నిభాయించామని గర్వపడాలనుకున్నా ఇలాంటి శీర్షికలే ప్రాణాధారం.
పత్రికల్లో శీర్షికలు - ఒక్క మాటలో చెప్పాలంటే బొట్టూ కాటుకలు. ఇవి ఇంగ్లీషులో కాలమ్స్‌గా మొదలై తెలుగు పత్రికా రంగంలోనూ ప్రకాశించాయి. విశేష సందర్భాలు వీటి అవసరాన్ని పాదుకొల్పితే, ఒక్కోసారి లబ్దప్రతిష్టులను కాలమిస్టులుగా పరిచయం చేసే క్రమంలో మొదలవుతాయి.
పత్రికా పంథాను స్పష్టం చేయడానికి జన ప్రయోజన అంశాల చర్చకు ఇవే ప్రధాన స్రవంతులు. విశ్లేషణలకు, వాదోపవాదాలకు ఇవే వేదికలు. వార్తా కథనాలు వంటకాలైతే పత్రికకు మసాలా రుచులిచ్చేవి శీర్షికలే. కాలమిస్టుల సత్తాను బట్టి కాలానికి నిలబడ్తాయి.
కబుర్లు, ఇల్లాలి ముచ్చట్లు, మాణిక్య వీణ, ఫాలాక్షుడి డైరీ, చేరాతలు, స్వగ‘తంబు’, ధర్మపథం, యాది ఇవన్నీ పత్రికల్లో పలువురు సాహితీమూర్తులు, మానవతావాదులు నిర్వహించిన శీర్షికల పేర్లు. ఇంకా ఇలాంటి శీర్షికలెన్నో ఏళ్ల తరబడి కొనసాగి పత్రికలకు పాఠకులకు మధ్య కలకాలం నిలిచిపోయే
సంబంధ బాంధవ్యాలు ఏర్పరిచేవి. వార్తా పత్రికలంటే క్రితం రోజు జరిగిన సంఘటనలను, విశేషాలను తెలియజేయడం, పతాక శీర్షికలైతే దాదాపు ఒకటే ఉండడం, లోపలి పేజీల్లో ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ వార్తలు షరా మామూలే. వీటికి తోడు రాజకీయాలు, పౌరపాలన, పాలక, ప్రతిపక్ష పార్టీల పరస్పర విసుర్లు.
ఇంతటితో పత్రికల బాధ్యత తీరిపోయిందంటే అది అర్ధ సత్యమే.

ఈ సందర్భంగా-రెండు, మూడు దశాబ్దాల క్రితం ఇవే పత్రికలు పోషించిన పాత్ర, ఎత్తుకున్న బాధ్యతలను ఓసారి గుర్తు చేసుకోవాల్సిందే. అప్పట్లో రాజకీయాలను పలకరిస్తూనే సమాజం దాని పోకడలు, ప్రజలు-వారి ఆలోచనా రీతులు,
కళలు-వాటి మార్గదర్శక నియమాలు, ప్రాపంచిక విజ్ఞానం, భావి పౌరులను తీర్చిదిద్దే క్రమం అన్నీ తమ ప్రాథమిక అంశాలుగానే భావించేవి. వీటిని తీర్చడానికి పలు శీర్షికలను నిర్వహించేవి. పత్రికల స్థాపన కూడా ఈ కోణంలోంచే జరిగేది. అందుకోసమే తొలి తెలుగు దినపత్రికలకు అనుబంధంగా వారపత్రికలు కూడా నడిచేవి
దినపత్రికలు వార్తలకు, రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించగా, సాహితీ, సాంస్కృతిక, కళారంగాలకు వారపత్రికలు వేదికగా నిలిచేవి. వీటికి తోడు పత్రికలు వైవిధ్యం కోసం పోటీ పడేవి.అవి తమ స్థానాన్ని ఉన్నత పరుచుకోవడం కోసం ప్రపంచ జ్ఞానులను, మహా మేధావులను ఏరికోరి, సగౌరవంగా సంపాదక పీఠాన్ని అప్పగించేవి
ఆ రోజుల్లో సంపాదకుడి ముందు పత్రిక యజమాని కూడా బలాదూరే. రాజకీయాలకు అతీతంగా పాఠకులను తీర్చిదిద్దే క్రమంలో సంపాదకులు తమ ఆలోచనా విధానాలకు, సమాజ ఉపయుక్త అంశాలను వివిధ శీర్షికల ద్వారా పత్రికల్లో ప్రాచుర్యం కల్పించేవారు.
ఇలాంటి శీర్షికలను నిర్వహించేవారిని ఎన్నుకోవడంలో నిష్పక్షపాతంగా, యోగ్యత, అర్హతలను బట్టి నిర్ణయం తీసుకునేవారు. వివిధ రంగాలలోని నిష్ణాతులను, పాత్రికేయ రచనలో ఆరితేరిన వారిని, సాహిత్యాభిలాషులను కాలమిస్టులుగా ఎంచుకోవడం వల్ల పత్రిక పరమార్ధానికి అద్దం పట్టడమే కాక దాని విలువ ప్రజాదరణ
మెట్టుమెట్టుగా పెరిగేది. ఈ శీర్షికల పట్ల పాఠకులు విపరీతంగా ఆకర్షితులవడానికి కారణం వీరిద్దరి నైపుణ్యతే అని చెప్పుకోవాలి.ప్రధానంగా పత్రికలకున్న తటస్థ వైఖరి, ప్రజాపక్ష నిబద్ధత కాలమిస్టులకు స్వేచ్ఛని, ధైర్యాన్ని ఇచ్చేవి. కాలమిస్టులే కాదు కార్టూనిస్టులు కూడా తెగించి బొమ్మలు వేసేవారు.
కార్టూన్లు సైతం చర్చనీయాంశాలు అయ్యేవి.
నాటి శీర్షికలవైపు దృష్టి సారిస్తే-ఇవి పలు రకాలు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలను స్పృశించేవిగా పేర్కొనవచ్చు. సాహిత్యంపై శీర్షికలతోపాటు ప్రత్యేక వ్యాస పరంపర కొనసాగేది. చలసాని ప్రసాదరావు ‘కబుర్లు’ రాజకీయ ప్రధానంగా కొనసాగితే
చేకూరి రామారావు ‘చేరాతలు’ సాహితీ విశే్లషణను చేపట్టాయి. పురాణం సీత ‘ఇల్లాలి ముచ్చట్లు‘, విద్వాన్ విశ్వం ‘మాణిక్యవీణ’ సమాజ నడతకు దర్పణాలు. సంపాదకులే వీటిని నిర్వహించి తమ సామాజిక బాధ్యతను చాటుకునేవారు. వీరేకాక తుర్లపాటి కుటుంబరావు, తిరుమల రామచంద్ర, పతంజలి, అబ్బూరి చాయాదేవి,
గొల్లపూడి మారుతీరావు, ఆదివిష్ణు ఇలా కొందరు రచయితలు కాలమిస్టులుగా ప్రసిద్ధులు.

పాత తరం పత్రికల్లో ప్రశ్నలు-జవాబులు సైతం పాఠకుల్ని అలరించే శీర్షికలే. మాలతీ చందూర్ జవాబులు ప్రపంచ జ్ఞానానికి నిలువుటద్దాలు.
ఈ రోజుల్లో గూగుల్ సెర్చ్ చేసినట్టు, ప్రపంచవ్యాప్తంగా ఏ రంగానికి చెందిన ప్రశ్న వేసినా మాలతీ చందూర్ సంతృప్తికరమైన వివరణాత్మక సమాధానం ఇచ్చేవారు. కె.రామలక్ష్మి ‘ప్రమదావనం’లోని జవాబులు మహిళల సమస్యలకు పరిష్కారాలు చూపుతూ గుండెనిండా ధైర్యాన్ని నింపేవి.
ఈ శీర్షిక ద్వారా ఆ రచయిత్రి ఎన్నో జీవితాలను సరిదిద్దిన, నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. రామలక్ష్మి ఏ ప్రశ్నకు ఎలాంటి దీటైన సమాధానం ఇచ్చారోనని పురుషులు సైతం వీటిని చదివేవారు.
‘పాత కెరటాలు’ పేరిట మాలతీ చందూర్ వందలాది ఇంగ్లీషు నవలల పరిచయం కూడా విలువైన సమాచారంతో కూడిన ఉత్తమ శీర్షిక.
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ‘నటరత్నాలు’ పేరిట ఎందరో రంగస్థల నటులను పరిచయం చేసారు. శ్రీశ్రీ ఆత్మకథ ‘అనంతం’, దాశరథి రంగాచార్య ‘జీవనయానం’, సామల సదాశివ ‘యాది’ వారి వ్యక్తిగత జీవితాలతోపాటు ఆనాటి సామాజిక పరిస్థితులను వ్యక్తపరిచి పాఠకులను ఆకట్టుకున్నాయి.
సమాజోపయోగ పత్రికా శీర్షికలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రస్తావించనంత మాత్రాన వాటిని విస్మరించినట్టుగా, చిన్న చూపు చూసినట్టుగా భావించరాదు. నేడు రాజకీయ పార్టీల పరంగా కొన్ని దినపత్రికలు చీలిపోయి లేదా ఆరంభమయి తమ వద్ద పనిచేస్తున్న వారితోగానీ, తమ పద్ధతులకు వత్తాసు పలుకుతున్న వారితోగానీ
రాయించిన వ్యాసాలతో సంపాదకుని పేజీ నింపేసి తమ సామాజిక బాధ్యతనుండి తప్పుకుంటున్నాయి. దీని పర్యవసానంగా ఎందరో సామాజిక శాస్తవ్రేత్తలు, సాహితీ దురంధరులు మనకు ఉండి కూడా లేనట్టే అయింది.ఇప్పుడు భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళలు పొత్తుల సంసారమే.
తెలుగువారు ఎవరు ఏ క్షేత్రంలో నిష్ణాతులైనా ఆ జ్ఞానాన్ని నిజాయితీగా అందరూ పంచుకోవాలి. పత్రికలు ఈ చొరవ తీసుకోవాలి. పుణెకు చెందిన దిలీప్‌బామ్ మోటార్ వాహనాల సమస్యలపై సమాధానం చెబితే విన్నప్పుడు, ఆంధ్రకు చెందిన సాహితీవేత్త తెలంగాణకు,
తెలంగాణకు చెందిన జానపద కళాకారుడు ఆంధ్రకు పనికిరాకుండా పోడు. కొనే్నళ్ల క్రితం ఒకరి భుజం ఒకరు తట్టినవాళ్లే కదా!

సేకరణ:- ఆంధ్రభూమి

Happy Columnists Day 🙏✍️📰📝
కాలమిస్ట్ దినోత్సవ శుభాకాంక్షలు 💐
@satyakumar_y

మీ
H. పరమేశ్వర రావు, ప్రొద్దుటూరు, కడప జిల్లా...
#Proddatur #Kadapa

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

19 Apr
#GarlicDay
వెల్లుల్లి (#Garlic) మొక్క శాస్త్రీయ నామం 'ఏలియం సెతీవం' (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. దీనిలో గంధకపు ద్రవ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల దీనినుండి వచ్చే వాసన ఆహ్లాదకరంగా ఉండదు. లిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం; Image
నీరుల్లి కన్నా ఔషధ గుణాలు ఎక్కువ. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. వెల్లుల్లిని "తెల్లగడ్డ" " ఎల్లిగడ్డ" వెల్లుల్లి కి ఉన్న పలు ఔషధ గుణాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దాన్ని "పాకహర్షం" గా వర్ణించవచ్చు.
భారతదేశంలో అనాది నుండి నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువలని గుర్తించేరు. సంప్రదాయిక చైనా వైద్యంలో వెల్లుల్లికి ప్రాముఖ్యత ఉంది. హోమియోపతీలో ఏలియం సిపా, ఏలియం సెతీవం అనే మందులు ఉన్నాయి.
Read 16 tweets
19 Apr
#BiCycleDay
🚲🚴🚴‍♀️🚵‍♀️🚵‍♂️🚴‍♂️🚵🚴🚳
సైకిలు (ఆంగ్లం #Cycle) ఒక సాధారణమైన రవాణా సాధనము. ఇది మానవ శక్తితో నడపబడే రెండు చక్రాల వాహనము. దీనిని 19వ శతాబ్దంలో ఐరోపాలో మొదటిసారిగా ఉపయోగించారు. ప్రపంచంలో ప్రస్తుతం చైనాలో సైకిలు ఉపయోగం ఎక్కువగా ఉంది. #Bicycle Image
విశ్వవ్యాప్తంగా ఇంచుమించు ఒక బిలియను సైకిళ్ళు ఉపయోగంలో ఉన్నట్లు అంచనా ఇవి మనుషులకు బొమ్మలు, వ్యాయామం లో, మిలటరీ, పోలీస్, సమాచార సరఫరా మొదలైన వివిధరకాలుగా ఉపయోగపడుతున్నాయి. సైక్లింగ్ ఒక రకమైన క్రీడ. రిక్షా ఒకరకమైన మూడు చక్రాల సైకిలు
1813 లో ఒకరోజు మాన్ హీమ్ అనే జర్మనీ వీధుల్లో వింత వాహనంపై ఓ యువకుడు వెడుతున్నాడు. ఈ వాహనంలో ఒక కొయ్య చట్రం ఉంది. దీని మధ్యలో కూర్చోవటానికి సీటు ఉంటుంది. ఒకదాని వెనుక మరొకటి ఉండేలా రెండు చక్రాలుంటాయి. యువకుడు సీటు పై కూర్చుని కాళ్ళను నేలపై నెట్టుకుంటూ ముందుకు వెడుతున్నాడు.
Read 19 tweets
19 Apr
#WorldLiverDay 🎗️ #Liver
కాలేయం మానవుని శరీరంలో చర్మం తర్వాతి రెండవ అతి పెద్ద అవయవం(గ్రంథి) కాలేయమే! దాదాపు 1,500 గ్రాముల బరువుండే కాలేయం పని తీరు కూడా భారీగానే ఉంటుంది. ఇది ఉదరంలో ఉదరవితానానికి (డయాఫ్రమ) క్రిందగా కుడివైపున మధ్యలో ఉంటుంది. కాలేయము పైత్యరసాన్ని తయారుచేస్తుంది. Image
అది పిత్తాశయంలో నిలువచేయబడి జీర్ణక్రియలో చాలా తోడ్పడుతుంది. పైత్యరసవాహిక ద్వారా పైత్యరసము, ఆంత్రమూలానికి చేరుతుంది.

కాలేయము, ఆంత్రమూలానికి కుడి పక్కన ఉదరవితానానికి దిగువగా ఉంటుంది. ఇది బూడిద రంగులో ఉంటుంది.కాలేయానికి నాలుగు తమ్మెలుంటాయి. దీనిలోని కణాలను కాలేయకణాలంటారు.
కాలేయం వ్యాధికారక ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. విషాలను హరిస్తుంది, రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతుంది.శరీరం మొత్తంలో పెరిగే గుణం కలిగిన ఒకే ఒక అవయవం ‘కాలేయం’. విషాలను హరించటం మొదలుకుని దాదాపు 500 రకాల జీవక్రియలను నిర్వర్తించే శక్తి కాలేయానికి ఉంది.
Read 15 tweets
18 Apr
#LinemanAppreciationDay 🔌💡
ప్రతిరోజూ మన జీవితాలను రక్షించడానికి, మరియు ఆధునిక జీవన సౌకర్యాలన్నింటినీ తీసుకురావడానికి అపాయంలోకి ప్రవేశించే పురుషులు మరియు మహిళలు ఉన్నారు. వారు ప్రమాదకరమైన పట్టీలపై భూమికి వందల అడుగుల ఎత్తులో వేలాడుతూ విద్యుత్ వైర్‌ల మధ్య నృత్యం చేస్తారు,
అవి సరిగ్గా నిర్వహించబడకపోతే, భారీ విద్యుత్ తీగలు వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.

ఆధునిక జీవనంలో విద్యుత్తు ఒక ప్రామాణిక భాగంగా ఉన్నంత కాలం లైన్‌మెన్‌లు ఉంటారు. వారు లేకుంటే మన ఇళ్లకు, వ్యాపారాలకు విద్యుత్తు తీసుకెళ్లే విద్యుత్ లైన్లు ఉండవు.
లైట్లు నిరంతరం వెలగడానికి కర్మాగారాల్లో (విద్యుత్)కొలిమి వెలిగడానికి మన అహ్లాదానికి దోహదం చేస్తున్న టివీలు అంతరాయం లేకుండా పని చేయడానికి లైన్‌మెన్‌లను తరచుగా తమ పనులను అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో, అసాధారణ వాతావరణ సవాళ్ళను ఎదుర్కొంటూ శ్రమిస్తారు.
Read 5 tweets
18 Apr
#WorldHeritageDay
🌉🌆🗼🌍
ఆదిమానవుడి కాలం నాటి కొండ గుహలు, అరుదైన రేఖా చిత్రాల నుంచి నేటి కట్టడాల వరకు ప్రతిఅంశమూ మానవ జీవిత పరిణామక్రమంలో వారసత్వ సంపదే. వేల సంవత్సరాల మానవ పరిణామక్రమంలో మానవ మేధస్సుతో, సాంకేతిక ఉషస్సుతో నిర్మించిన వన్నె తగ్గని నిర్మాణాలు, #HeritageDay
కట్టడాలు విలువ కట్టలేని వారసత్వ సంపద. మానవనిర్మిత కట్టడాలు, రాజ ప్రాసాదాలు, ప్రకతిసిద్ధంగా ఏర్పడిన అపురూపమైన సుందర ప్రదేశాలు, శిల్పాలు, చిత్రలేఖనాలు, తాళపత్ర గ్రంథాలు, శిలా శాసనాలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారికి వారసత్వంగా సంక్రమించాయి.
వీటిని నిర్లక్ష్యం చేయడమంటే, జాతి తన చరిత్రను చెరుపుకోవడమే! అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక నిర్మాణాలు, పురావస్తు సంపద గుర్తింపునకు నోచక మరుగున పడివున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చారిత్రక స్పహ కలిగిన మేధావుల సూచనల మేరకు ఐక్యరాజ్యసమితిలోని యునెస్కో,
Read 14 tweets
17 Apr
ఎక్కడైనా దెబ్బ తగిలితే వెంటనే రక్తం కారుతుంది. కారుతున్న రక్తం కొద్దిసేపటికి గడ్డ కట్టి ఆగిపోతుంది.ఈ తరహా చాలా మందిలో కనిపిస్తోంది.కానీ కొందరిలో రక్తం నిరంతరం కారుతునేఉంటుంది.కొందరిలో రక్తనా ళాలు చిట్లి కూడా రక్త స్రావం అవుతునే ఉంటుంది.
#WorldHemophiliaDay
#WorldHaemophiliaDay Image
ఎక్కడైనా రక్తం గడ్డ కట్టకపోతే ఆ గాయం మానదు. ఇది ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టినా ! లేక గాయం వల్ల బయటకు వచ్చినప్పుడు దారాళంగా కారుతుంటే అది మనిషి మనుగడకే ముప్పు. ఇలాంటి వారిని హిమోఫీలియో వ్యాధిగ్రస్తులు గా వైద్యులు పరిగణిస్తారు.
తల్లిదండ్రులకు ఉంటే జబ్బు తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులుపేర్కొంటున్నారు.తండ్రికుంటే కచ్చితంగా కొడుకుకు, రక్తసంబంధీకులను పెళ్లి చేసుకుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.రక్త నాళాలు చిట్లితే...
Read 7 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!