#WorldLiverDay 🎗️ #Liver
కాలేయం మానవుని శరీరంలో చర్మం తర్వాతి రెండవ అతి పెద్ద అవయవం(గ్రంథి) కాలేయమే! దాదాపు 1,500 గ్రాముల బరువుండే కాలేయం పని తీరు కూడా భారీగానే ఉంటుంది. ఇది ఉదరంలో ఉదరవితానానికి (డయాఫ్రమ) క్రిందగా కుడివైపున మధ్యలో ఉంటుంది. కాలేయము పైత్యరసాన్ని తయారుచేస్తుంది.
అది పిత్తాశయంలో నిలువచేయబడి జీర్ణక్రియలో చాలా తోడ్పడుతుంది. పైత్యరసవాహిక ద్వారా పైత్యరసము, ఆంత్రమూలానికి చేరుతుంది.
కాలేయము, ఆంత్రమూలానికి కుడి పక్కన ఉదరవితానానికి దిగువగా ఉంటుంది. ఇది బూడిద రంగులో ఉంటుంది.కాలేయానికి నాలుగు తమ్మెలుంటాయి. దీనిలోని కణాలను కాలేయకణాలంటారు.
కాలేయం వ్యాధికారక ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. విషాలను హరిస్తుంది, రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతుంది.శరీరం మొత్తంలో పెరిగే గుణం కలిగిన ఒకే ఒక అవయవం ‘కాలేయం’. విషాలను హరించటం మొదలుకుని దాదాపు 500 రకాల జీవక్రియలను నిర్వర్తించే శక్తి కాలేయానికి ఉంది.
పునరుత్పత్తి స్వభావం ఉన్న కాలేయాన్ని దానం చేయడం ఎంతో సులువు . అవయవంలో ఉండే ఎనిమిదింటిలో మూడు వరకు అరలు ఉన్నా అది సాధారణంగా పనిచేస్తుంది. దీంతో ఇతరులకు కాలేయం అవసరమైనపుడు దాతలకు చెందిన కాలేయంలో కొంత భాగాన్ని బాధితులకు అమర్చవచ్చు.
రెండు నెలల్లో దాత కాలేయం పెరిగి సాధారణ స్థాయికి చేరుతుంది.కాలేయ మార్పిడికి హైదరాబాదులో రూ.18-20 లక్షల వరకు ఖర్చవగా... ఇతర దేశాల్లో ఆ మొత్తం రూ.1.50 కోట్ల వరకు ఉంటుంది.కాలేయం శరీరంలో ఏకంగా 500 రకాల చర్యలను నిర్వహించే రసాయన కర్మాగారం.
హెపటైటిస్ ఎ, ఇలు కలుషిత మంచినీరు, ఆహారం తీసుకోవడం వల్ల సంక్రమిస్తాయి.హెపటైటిస్ బి, సి వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. లైంగిక సంబంధాలు, రక్త మార్పిడి, ఒకే నీడిల్స్‌ను ఇద్దరు, అంతకంటే ఎక్కువ మందికి వాడటం ద్వారా ఇవి సంక్రమిస్తాయి.స్థూలకాయం వల్ల కొవ్వు పెరిగి,
కాలేయంపై పేరుకుపోతుంది.నూనె వస్తువులు, పిజ్జా, బర్గాలు, ఫాస్ట్‌ఫుడ్స్ మద్యం సేవించడం ద్వారా వ్యాధులు వస్తున్నాయి.
హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ: వైరస్ వల్ల కాలేయ కణాలు వాపునకు గురవటాన్ని హెపటైటిస్ అంటారు. ఇది చెదిపోవడానికి హెపటైటిస్ వైరస్ ప్రధాన కారణం అవుతుంది
లివర్ కేన్సర్లన్నీ ఒకే రకం కాదు. అందువల్ల వాటికి చేసే చికిత్సలు కూడా అన్నీ ఒకే రకంగా ఉండవు. కేన్సర్ రకాన్ని అనుసరించి, చికిత్సలు కూడా వేరువేరుగా ఉంటాయి. ప్రధానంగా లివర్‌లో వచ్చే కేన్సర్ కణుతులు ప్రాథమికస్, సెకండరీస్ అంటూ రెండు రకాలుగా ఉంటాయి.
లివర్‌లోనే పుట్టిన కణుతులను ప్రాథమిక లివర్ ట్యూమర్స్ అనీ, మిగతా భాగాల్లో అంటే, శ్వాసకోశాల్లో గానీ, పెద్ద పేగుల్లో గానీ, క్లోమగ్రం«థిలో గానీ, కిడ్నీలో గానీ, ఎముకల్లోగానీ కణుతులు పుట్టి అవి కాలేయానికి పాకే రకాన్ని సెకండరీ లివర్ ట్యూమర్స్ అనీ అంటాం.
నిజానికి ప్రాథమిక లివర్ ట్యూమర్ల కంటే, ఈ సెకండరీ లివర్ ట్యూమర్లే ఎక్కువగా వస్తాయి.
శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి
మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం.
1. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకే మందులను అతిగా తీసుకున్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మందులను తక్కువగా, వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి.
2. సరైన నూనె వాడకుండా వండిన ఆహారం తిన్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నాణ్యత కలిగిన నూనెను మాత్రమే వంటకాలకు ఉపయోగించాలి.
3. మద్యం సేవించడం కూడా లివర్ నాశనానికి కారణమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మద్యాన్ని పూర్తిగా మానేయడమే మంచిది.
4. ఆహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే లివర్‌పై భారం పెరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి.
5. రాత్రి పూట త్వరగా పడుకొని... ఉదయాన త్వరగా నిద్రలేవాలి. ఇలా చేస్తే లివర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు.
6. ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. లేదంటే లివర్‌లో వ్యర్థాలు పెరిగిపోతాయి. అంతేకాకుండా ఉదయం అల్పాహారం చేయడం అసలు మానేయకూడదు.
లేదంటే లివర్ పైన ఒత్తిడి పెరుగుతుంది.
7. అతిగా ఆహారం తీసుకున్నా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి లివర్‌కు ఎక్కువ సమయం పట్టడమే కాదు... అదనపు భారం కూడా పడుతుంది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#GarlicDay
వెల్లుల్లి (#Garlic) మొక్క శాస్త్రీయ నామం 'ఏలియం సెతీవం' (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. దీనిలో గంధకపు ద్రవ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల దీనినుండి వచ్చే వాసన ఆహ్లాదకరంగా ఉండదు. లిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం;
నీరుల్లి కన్నా ఔషధ గుణాలు ఎక్కువ. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. వెల్లుల్లిని "తెల్లగడ్డ" " ఎల్లిగడ్డ" వెల్లుల్లి కి ఉన్న పలు ఔషధ గుణాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దాన్ని "పాకహర్షం" గా వర్ణించవచ్చు.
భారతదేశంలో అనాది నుండి నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువలని గుర్తించేరు. సంప్రదాయిక చైనా వైద్యంలో వెల్లుల్లికి ప్రాముఖ్యత ఉంది. హోమియోపతీలో ఏలియం సిపా, ఏలియం సెతీవం అనే మందులు ఉన్నాయి.
#BiCycleDay
🚲🚴🚴♀️🚵♀️🚵♂️🚴♂️🚵🚴🚳
సైకిలు (ఆంగ్లం #Cycle) ఒక సాధారణమైన రవాణా సాధనము. ఇది మానవ శక్తితో నడపబడే రెండు చక్రాల వాహనము. దీనిని 19వ శతాబ్దంలో ఐరోపాలో మొదటిసారిగా ఉపయోగించారు. ప్రపంచంలో ప్రస్తుతం చైనాలో సైకిలు ఉపయోగం ఎక్కువగా ఉంది. #Bicycle
విశ్వవ్యాప్తంగా ఇంచుమించు ఒక బిలియను సైకిళ్ళు ఉపయోగంలో ఉన్నట్లు అంచనా ఇవి మనుషులకు బొమ్మలు, వ్యాయామం లో, మిలటరీ, పోలీస్, సమాచార సరఫరా మొదలైన వివిధరకాలుగా ఉపయోగపడుతున్నాయి. సైక్లింగ్ ఒక రకమైన క్రీడ. రిక్షా ఒకరకమైన మూడు చక్రాల సైకిలు
1813 లో ఒకరోజు మాన్ హీమ్ అనే జర్మనీ వీధుల్లో వింత వాహనంపై ఓ యువకుడు వెడుతున్నాడు. ఈ వాహనంలో ఒక కొయ్య చట్రం ఉంది. దీని మధ్యలో కూర్చోవటానికి సీటు ఉంటుంది. ఒకదాని వెనుక మరొకటి ఉండేలా రెండు చక్రాలుంటాయి. యువకుడు సీటు పై కూర్చుని కాళ్ళను నేలపై నెట్టుకుంటూ ముందుకు వెడుతున్నాడు.
కాలమిస్ట్, వ్యాసాలు రాసే పత్రికా రచయిత, పత్రికకు క్రమం తప్పక వ్యాసాలు రాచే రచయిత. #columnist
కాలమిస్టు అంటే ఎవరు? సమాధానాలు ఇలా కొన్నింటిని చెప్పుకోవచ్చు - తలపండిన వాడు, జీవన సారాన్ని పుక్కిటపట్టిన వాడు, శాస్త్రాలను అవపోశన పట్టినవాడు,
గురువుగా భావింపబడేవాడు, బతికినన్నాళ్లు రాసినా తరగని మేధోసంపత్తి గలవాడు, ప్రలోభాలకు లొంగనివాడు, వజ్రసంకల్పుడు. ఇప్పుడు రాస్తున్న వారిలో ఇందులో ఒక్క గుణమున్నా పాఠకులు ఆ ‘కాలమ్’ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. వారికోసం ప్రపంచాన్ని గాలించైనా వెదికి పట్టుకోవాలి.
రానున్న తరంలో మన భాష నిలువాలన్నా, మన సంస్కృతి పరిఢవిల్లాలన్నా, పత్రికలు తమ పాత్రను నిభాయించామని గర్వపడాలనుకున్నా ఇలాంటి శీర్షికలే ప్రాణాధారం.
#LinemanAppreciationDay 🔌💡
ప్రతిరోజూ మన జీవితాలను రక్షించడానికి, మరియు ఆధునిక జీవన సౌకర్యాలన్నింటినీ తీసుకురావడానికి అపాయంలోకి ప్రవేశించే పురుషులు మరియు మహిళలు ఉన్నారు. వారు ప్రమాదకరమైన పట్టీలపై భూమికి వందల అడుగుల ఎత్తులో వేలాడుతూ విద్యుత్ వైర్‌ల మధ్య నృత్యం చేస్తారు,
అవి సరిగ్గా నిర్వహించబడకపోతే, భారీ విద్యుత్ తీగలు వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.
ఆధునిక జీవనంలో విద్యుత్తు ఒక ప్రామాణిక భాగంగా ఉన్నంత కాలం లైన్‌మెన్‌లు ఉంటారు. వారు లేకుంటే మన ఇళ్లకు, వ్యాపారాలకు విద్యుత్తు తీసుకెళ్లే విద్యుత్ లైన్లు ఉండవు.
లైట్లు నిరంతరం వెలగడానికి కర్మాగారాల్లో (విద్యుత్)కొలిమి వెలిగడానికి మన అహ్లాదానికి దోహదం చేస్తున్న టివీలు అంతరాయం లేకుండా పని చేయడానికి లైన్‌మెన్‌లను తరచుగా తమ పనులను అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో, అసాధారణ వాతావరణ సవాళ్ళను ఎదుర్కొంటూ శ్రమిస్తారు.
#WorldHeritageDay
🌉🌆🗼🌍
ఆదిమానవుడి కాలం నాటి కొండ గుహలు, అరుదైన రేఖా చిత్రాల నుంచి నేటి కట్టడాల వరకు ప్రతిఅంశమూ మానవ జీవిత పరిణామక్రమంలో వారసత్వ సంపదే. వేల సంవత్సరాల మానవ పరిణామక్రమంలో మానవ మేధస్సుతో, సాంకేతిక ఉషస్సుతో నిర్మించిన వన్నె తగ్గని నిర్మాణాలు, #HeritageDay
కట్టడాలు విలువ కట్టలేని వారసత్వ సంపద. మానవనిర్మిత కట్టడాలు, రాజ ప్రాసాదాలు, ప్రకతిసిద్ధంగా ఏర్పడిన అపురూపమైన సుందర ప్రదేశాలు, శిల్పాలు, చిత్రలేఖనాలు, తాళపత్ర గ్రంథాలు, శిలా శాసనాలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారికి వారసత్వంగా సంక్రమించాయి.
వీటిని నిర్లక్ష్యం చేయడమంటే, జాతి తన చరిత్రను చెరుపుకోవడమే! అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక నిర్మాణాలు, పురావస్తు సంపద గుర్తింపునకు నోచక మరుగున పడివున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చారిత్రక స్పహ కలిగిన మేధావుల సూచనల మేరకు ఐక్యరాజ్యసమితిలోని యునెస్కో,
ఎక్కడైనా దెబ్బ తగిలితే వెంటనే రక్తం కారుతుంది. కారుతున్న రక్తం కొద్దిసేపటికి గడ్డ కట్టి ఆగిపోతుంది.ఈ తరహా చాలా మందిలో కనిపిస్తోంది.కానీ కొందరిలో రక్తం నిరంతరం కారుతునేఉంటుంది.కొందరిలో రక్తనా ళాలు చిట్లి కూడా రక్త స్రావం అవుతునే ఉంటుంది. #WorldHemophiliaDay #WorldHaemophiliaDay
ఎక్కడైనా రక్తం గడ్డ కట్టకపోతే ఆ గాయం మానదు. ఇది ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టినా ! లేక గాయం వల్ల బయటకు వచ్చినప్పుడు దారాళంగా కారుతుంటే అది మనిషి మనుగడకే ముప్పు. ఇలాంటి వారిని హిమోఫీలియో వ్యాధిగ్రస్తులు గా వైద్యులు పరిగణిస్తారు.
తల్లిదండ్రులకు ఉంటే జబ్బు తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులుపేర్కొంటున్నారు.తండ్రికుంటే కచ్చితంగా కొడుకుకు, రక్తసంబంధీకులను పెళ్లి చేసుకుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.రక్త నాళాలు చిట్లితే...