#WorldHeritageDay
🌉🌆🗼🌍
ఆదిమానవుడి కాలం నాటి కొండ గుహలు, అరుదైన రేఖా చిత్రాల నుంచి నేటి కట్టడాల వరకు ప్రతిఅంశమూ మానవ జీవిత పరిణామక్రమంలో వారసత్వ సంపదే. వేల సంవత్సరాల మానవ పరిణామక్రమంలో మానవ మేధస్సుతో, సాంకేతిక ఉషస్సుతో నిర్మించిన వన్నె తగ్గని నిర్మాణాలు, #HeritageDay
కట్టడాలు విలువ కట్టలేని వారసత్వ సంపద. మానవనిర్మిత కట్టడాలు, రాజ ప్రాసాదాలు, ప్రకతిసిద్ధంగా ఏర్పడిన అపురూపమైన సుందర ప్రదేశాలు, శిల్పాలు, చిత్రలేఖనాలు, తాళపత్ర గ్రంథాలు, శిలా శాసనాలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారికి వారసత్వంగా సంక్రమించాయి.
వీటిని నిర్లక్ష్యం చేయడమంటే, జాతి తన చరిత్రను చెరుపుకోవడమే! అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక నిర్మాణాలు, పురావస్తు సంపద గుర్తింపునకు నోచక మరుగున పడివున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చారిత్రక స్పహ కలిగిన మేధావుల సూచనల మేరకు ఐక్యరాజ్యసమితిలోని యునెస్కో,
దాని అనుబంధ సంస్థ 'అంతర్జాతీయ పురాతన కట్టడాల, స్థలాల పరిరక్షణ సంఘం' ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ప్రతి ఏటా ఏప్రిల్ 18ని 'ప్రపంచ వారసత్వ దినోత్సవం'(వరల్డ్ హెరిటేజ్ డే), ఇంటర్నేషనల్ డే ఫర్ మానుమెంట్స్ అండ్ సైట్స్ దినోత్సవం గా పాటిస్తోంది.
మనదేశంలో 1956లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో మన సువిశాల, సుసంపన్న వారసత్వ విశిష్టతను పరిరక్షించుకోవాలని ప్రాధమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో పేర్కొనడం గమనార్హం.
ఈ రోజున అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి వారసత్వ సంపద ప్రాధాన్యతను తెలియజేసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు
ఐక్యరాజ్య సమితి 1972 తీర్మానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పాటిస్తారు.
పురాతన కట్టడాలు, స్థలాలు గురించి అధ్యయనం చేయడం వాటి పరిరక్షణ విషయంలో సభ్యదేశాలు పరస్పరం సహకరించుకోవడం మొదలైన అంశాలు ఈ తీర్మానంలో ముఖ్యాంశాలు.
మొదటి ప్రపంచ వారసత్వ దినోత్సవం 18 ఏప్రిల్ 1982న ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ICOMOS) ట్యునీషియాలో నిర్వహించగా దానిని యునెస్కో 1983 లో ఆమోదించింది.
World Heritage Day is being observed today across the world #WHD2021 This year the theme of this special day is 'Complex Pasts: Diverse Future'.This theme is calling people of all the religion to come together keeping aside their differences and give out the message of solidarity
#DidYouKnow: India has 37 #WorldHeritageSites that includes 29 Cultural, 7 Natural & 1 Mixed properties. are 37 World Heritage Sites located in India. #Gandikota 🏯
మీ
H. పరమేశ్వర రావు, ప్రొద్దుటూరు, కడప జిల్లా....
To mark World Heritage Day on 18th April, 2021, the Films Division is presenting an online film festival for highlighting the well-known heritage sites and monuments of India. The documentaries will be streamed on filmsdivision.org/Documentary of the Week and youtube.com/user/FilmsDivi…
గతానికి - వర్తమానానికి మధ్య తిరుగులేని వారథులు... వారసత్వ సంపదలు. మానవ సమాజ ఆవిర్భావం, సంస్కృతీ నాగరికతలు ఏవిధంగా పరిణామక్రమం చెందుతూ వచ్చాయి? సామాజిక, ఆర్థిక, మత, రాజకీయ వ్యవస్థలు ఎలా ఏర్పడ్డాయి?
వంటి అనేకాంశాలకు సంబంధించిన విలువైన సమాచారం అందించడంలో చారిత్రక కట్టడాలు, శాసనాలు, సాహిత్యం వంటి చారిత్రక రూపాలు ఎంతో కీలకం. అందుకనే.. చరిత్ర కల్పన కాదు, అనుభవాత్మకం కాబట్టి చరిత్ర ఆధారంగానే రేపటి రోజుల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు.
ఒక ప్రాంతంలో ఉన్న చారిత్రక వారసత్వ సంపద, ఆ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని నిర్ణయిస్తుందంటే అతిశయోక్తి కాదు. అందులో అగ్ర స్థానంలో ఉంటాయి... @RayaIaseema రాయలసీమ పరిసరాల్లో మిగిలిన చారిత్రక ఆనవాళ్లు. అమూల్యమైన వారసత్వ సంపద గురించి నేటితరంలో అందరికీ తెలిసింది చాలా తక్కువ...
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#GarlicDay
వెల్లుల్లి (#Garlic) మొక్క శాస్త్రీయ నామం 'ఏలియం సెతీవం' (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. దీనిలో గంధకపు ద్రవ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల దీనినుండి వచ్చే వాసన ఆహ్లాదకరంగా ఉండదు. లిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం;
నీరుల్లి కన్నా ఔషధ గుణాలు ఎక్కువ. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. వెల్లుల్లిని "తెల్లగడ్డ" " ఎల్లిగడ్డ" వెల్లుల్లి కి ఉన్న పలు ఔషధ గుణాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దాన్ని "పాకహర్షం" గా వర్ణించవచ్చు.
భారతదేశంలో అనాది నుండి నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువలని గుర్తించేరు. సంప్రదాయిక చైనా వైద్యంలో వెల్లుల్లికి ప్రాముఖ్యత ఉంది. హోమియోపతీలో ఏలియం సిపా, ఏలియం సెతీవం అనే మందులు ఉన్నాయి.
#BiCycleDay
🚲🚴🚴♀️🚵♀️🚵♂️🚴♂️🚵🚴🚳
సైకిలు (ఆంగ్లం #Cycle) ఒక సాధారణమైన రవాణా సాధనము. ఇది మానవ శక్తితో నడపబడే రెండు చక్రాల వాహనము. దీనిని 19వ శతాబ్దంలో ఐరోపాలో మొదటిసారిగా ఉపయోగించారు. ప్రపంచంలో ప్రస్తుతం చైనాలో సైకిలు ఉపయోగం ఎక్కువగా ఉంది. #Bicycle
విశ్వవ్యాప్తంగా ఇంచుమించు ఒక బిలియను సైకిళ్ళు ఉపయోగంలో ఉన్నట్లు అంచనా ఇవి మనుషులకు బొమ్మలు, వ్యాయామం లో, మిలటరీ, పోలీస్, సమాచార సరఫరా మొదలైన వివిధరకాలుగా ఉపయోగపడుతున్నాయి. సైక్లింగ్ ఒక రకమైన క్రీడ. రిక్షా ఒకరకమైన మూడు చక్రాల సైకిలు
1813 లో ఒకరోజు మాన్ హీమ్ అనే జర్మనీ వీధుల్లో వింత వాహనంపై ఓ యువకుడు వెడుతున్నాడు. ఈ వాహనంలో ఒక కొయ్య చట్రం ఉంది. దీని మధ్యలో కూర్చోవటానికి సీటు ఉంటుంది. ఒకదాని వెనుక మరొకటి ఉండేలా రెండు చక్రాలుంటాయి. యువకుడు సీటు పై కూర్చుని కాళ్ళను నేలపై నెట్టుకుంటూ ముందుకు వెడుతున్నాడు.
#WorldLiverDay 🎗️ #Liver
కాలేయం మానవుని శరీరంలో చర్మం తర్వాతి రెండవ అతి పెద్ద అవయవం(గ్రంథి) కాలేయమే! దాదాపు 1,500 గ్రాముల బరువుండే కాలేయం పని తీరు కూడా భారీగానే ఉంటుంది. ఇది ఉదరంలో ఉదరవితానానికి (డయాఫ్రమ) క్రిందగా కుడివైపున మధ్యలో ఉంటుంది. కాలేయము పైత్యరసాన్ని తయారుచేస్తుంది.
అది పిత్తాశయంలో నిలువచేయబడి జీర్ణక్రియలో చాలా తోడ్పడుతుంది. పైత్యరసవాహిక ద్వారా పైత్యరసము, ఆంత్రమూలానికి చేరుతుంది.
కాలేయము, ఆంత్రమూలానికి కుడి పక్కన ఉదరవితానానికి దిగువగా ఉంటుంది. ఇది బూడిద రంగులో ఉంటుంది.కాలేయానికి నాలుగు తమ్మెలుంటాయి. దీనిలోని కణాలను కాలేయకణాలంటారు.
కాలేయం వ్యాధికారక ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. విషాలను హరిస్తుంది, రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతుంది.శరీరం మొత్తంలో పెరిగే గుణం కలిగిన ఒకే ఒక అవయవం ‘కాలేయం’. విషాలను హరించటం మొదలుకుని దాదాపు 500 రకాల జీవక్రియలను నిర్వర్తించే శక్తి కాలేయానికి ఉంది.
కాలమిస్ట్, వ్యాసాలు రాసే పత్రికా రచయిత, పత్రికకు క్రమం తప్పక వ్యాసాలు రాచే రచయిత. #columnist
కాలమిస్టు అంటే ఎవరు? సమాధానాలు ఇలా కొన్నింటిని చెప్పుకోవచ్చు - తలపండిన వాడు, జీవన సారాన్ని పుక్కిటపట్టిన వాడు, శాస్త్రాలను అవపోశన పట్టినవాడు,
గురువుగా భావింపబడేవాడు, బతికినన్నాళ్లు రాసినా తరగని మేధోసంపత్తి గలవాడు, ప్రలోభాలకు లొంగనివాడు, వజ్రసంకల్పుడు. ఇప్పుడు రాస్తున్న వారిలో ఇందులో ఒక్క గుణమున్నా పాఠకులు ఆ ‘కాలమ్’ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. వారికోసం ప్రపంచాన్ని గాలించైనా వెదికి పట్టుకోవాలి.
రానున్న తరంలో మన భాష నిలువాలన్నా, మన సంస్కృతి పరిఢవిల్లాలన్నా, పత్రికలు తమ పాత్రను నిభాయించామని గర్వపడాలనుకున్నా ఇలాంటి శీర్షికలే ప్రాణాధారం.
#LinemanAppreciationDay 🔌💡
ప్రతిరోజూ మన జీవితాలను రక్షించడానికి, మరియు ఆధునిక జీవన సౌకర్యాలన్నింటినీ తీసుకురావడానికి అపాయంలోకి ప్రవేశించే పురుషులు మరియు మహిళలు ఉన్నారు. వారు ప్రమాదకరమైన పట్టీలపై భూమికి వందల అడుగుల ఎత్తులో వేలాడుతూ విద్యుత్ వైర్‌ల మధ్య నృత్యం చేస్తారు,
అవి సరిగ్గా నిర్వహించబడకపోతే, భారీ విద్యుత్ తీగలు వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.
ఆధునిక జీవనంలో విద్యుత్తు ఒక ప్రామాణిక భాగంగా ఉన్నంత కాలం లైన్‌మెన్‌లు ఉంటారు. వారు లేకుంటే మన ఇళ్లకు, వ్యాపారాలకు విద్యుత్తు తీసుకెళ్లే విద్యుత్ లైన్లు ఉండవు.
లైట్లు నిరంతరం వెలగడానికి కర్మాగారాల్లో (విద్యుత్)కొలిమి వెలిగడానికి మన అహ్లాదానికి దోహదం చేస్తున్న టివీలు అంతరాయం లేకుండా పని చేయడానికి లైన్‌మెన్‌లను తరచుగా తమ పనులను అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో, అసాధారణ వాతావరణ సవాళ్ళను ఎదుర్కొంటూ శ్రమిస్తారు.
ఎక్కడైనా దెబ్బ తగిలితే వెంటనే రక్తం కారుతుంది. కారుతున్న రక్తం కొద్దిసేపటికి గడ్డ కట్టి ఆగిపోతుంది.ఈ తరహా చాలా మందిలో కనిపిస్తోంది.కానీ కొందరిలో రక్తం నిరంతరం కారుతునేఉంటుంది.కొందరిలో రక్తనా ళాలు చిట్లి కూడా రక్త స్రావం అవుతునే ఉంటుంది. #WorldHemophiliaDay #WorldHaemophiliaDay
ఎక్కడైనా రక్తం గడ్డ కట్టకపోతే ఆ గాయం మానదు. ఇది ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టినా ! లేక గాయం వల్ల బయటకు వచ్చినప్పుడు దారాళంగా కారుతుంటే అది మనిషి మనుగడకే ముప్పు. ఇలాంటి వారిని హిమోఫీలియో వ్యాధిగ్రస్తులు గా వైద్యులు పరిగణిస్తారు.
తల్లిదండ్రులకు ఉంటే జబ్బు తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులుపేర్కొంటున్నారు.తండ్రికుంటే కచ్చితంగా కొడుకుకు, రక్తసంబంధీకులను పెళ్లి చేసుకుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.రక్త నాళాలు చిట్లితే...