#HonestyDay నిజాయితీ దినోత్సవం👃
నిజమైన ఆయనంలో లేక అసలైన మార్గంలో నడుచుకోవడాన్ని నిజాయితీ అంటారు.నిజాయితీ అనేది నైతిక పాత్ర యొక్క ఒక విభాగాన్ని సూచిస్తుంది, చిత్తశుద్ధి, యదార్ధం వంటి అనుకూల, సద్గుణ గుణాలనే అర్థాన్ని ఇస్తుంది, అలాగే దురుసుతనం, అబద్ధం, మోసం, దొంగతనం వంటి #honesty Image
దుర్గుణాలు లేకపోవడాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా నిజాయితీ అంటే విశ్వసనీయత, విధేయత, నిష్పక్షపాతం, హృదయపూర్వకతనం కలిగి ఉండాలి. నిజాయితి అనేది అనేక జాతి, మతపరమైన సంస్కృతులలో విలువైనదిగా ఉంది. తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేసిన వ్యక్తి తన తప్పును తాను గ్రహించి సరిదిద్దుకొనే
ప్రయత్నాన్ని నిజాయితీగా తన తప్పును తాను సరిదిద్దుకొంటున్నాడంటారు. నిజాయితీగా వ్యవహరించే వ్యక్తిని "నిజాయితీపరుడు" అంటారు.
స్వాతంత్ర్య సమరయోధులనాటి కథ

భారతదేశపు వైద్య విధానం ఆయుర్వేదం. బ్రిటిషర్లు మనదేశాన్ని ఆక్రమించి వారి వైద్యవిధానమైన అల్లోపతిని ప్రవేశపెట్టకముందు ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యంలో ఉండేది. కాని బ్రిటిషర్ల పాలనవలనో మనలో అలవాటైన బానిస భావన వలనో మెల్లిమెల్లిగా
మెల్లిమెల్లిగా ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. చాలామంది ఆయుర్వేదం పనికిరాదని తోసివేశారు. అట్టి కాలంలో బెంగాలుకు చెందిన ఓ ప్రముఖ విద్యావేత్త ఆయుర్వేదాన్ని కాపాడుకోవటానికి నడుంకట్టాడు. ఆంగ్ల ఔషధాలకు దీటుగా దేశీయ ఔషధాలు తయారుచేసే ఒక సంస్థను స్థాపించాడు.
అలా ఎంతో కష్టపడి ప్రతికూలమైన పరిస్థితులలో సంస్థని నడుపుతుండగా ఒకనాడు ఆ విద్యావేత్తకు ఒక భీషణమైన సమస్య ఎదురయ్యింది. ఆ సంస్థ తయారు చేసిన ఎన్నో మందులు ఏదో కారణముగా పాడైపోయాయి. ఆ విద్యావేత్త ఎంతో దుఃఖించాడు. అతని విచారం చూసి అక్కడే ఉన్న ఓ ఉద్యోగి ఇలా పలికాడు “అయ్యా! మీరు విచారించకండి
ఇంకా ఈ మందులు పూర్తిగా పాడు అవ్వలేదు. ఇంకొన్నాళ్ళు సునాయాసంగా మనం వీటిని అమ్మవచ్చు. అట్లు చేయకున్న మనకు చాలా నష్టం వస్తుంది. ఆయుర్వేదాన్ని కాపాడుకోవాలన్న మీ ఆశయం కూడా అప్పుడు నెరవేరక పోవచ్చు”.
ఇటువంటి అవినీతి భరితమైన మాటలు విని ఆ విద్యావేత్త మండిపడుతూ ఇలా జవాబిచ్చాడు “నష్టమొస్తుందని పాడైపోతున్న మందుల్ని అమ్ముతామా? అట్టి నీచమైన కార్యాన్ని నేనెన్నడూ చేయలేను. ఆయుర్వేదం ధర్మం ఉన్నచోటే ఔషధాలు పనిచేస్తాయని చెప్పింది. కనుక నా ఆశయం ధర్మస్థాపనే”.
అలా హితబోధ చేసి ఆ మందులన్నిటిని బయటపడ వేయించి తన ఆదర్శాన్ని కాపాడుకొన్నాడు. తరువాత ఆ విద్యావేత్త లోని నిజాయితీని అందరూ కొనియాడారు.

ఆ ప్రసిద్ధ విద్యావేత్త ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్. భారతీయుల యొక్క విజ్ఞానము గూర్చి ప్రపంచానికి తెలుపుతూ ఈయన ఎన్నో వ్యాసాలు వ్రాసినారు.
“Chemical Knowledge of the Hindus of Old” (Isis, Vol.2, No.2, pg. 322-325, The University of Chicago press) అనే వ్యాసం మనమందరం చూడదగినది. ఈ వ్యాసంలో ప్రఫుల్ల చంద్ర గారు మన భారతదేశం ఆధ్యాత్మికత బోధించడంలోనే కాదు విజ్ఞాన పరంగా కూడా ఎంతో ముందున్నదని చెబుతారు.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

2 May
#WorldLaughterDay 😆
1995లో మార్చి 13 న భారతీయ వైద్యుడు ... డా. మదన్‌ కటారియా ప్రపంచ నవ్వుల దినాన్ని స్టృస్టించారు . నవ్వుల క్లుబ్ గా ప్ర్రరంభమయిన ఈ పండుగ రానురాను 65 దేశాలలో ఆరువేల కు పైగా నవ్వుల క్లబ్ లుగా విలసిల్లినాయి.

ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని మొదట్లో జనవరి రెండో ఆదివారం Image
నాడు జరుపుకునేవారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో జనవరిలో చలి వాతావరణముంటుంది కాబట్టి ఈ తేదీని మార్చాలని హాస్య ప్రియులు కోరారు.దాంతో లాఫ్టర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ వాళ్లు ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే మొదటి ఆదివారం నాడు జరపాలని నిర్ణయించారు.
మొట్టమొదటి నవ్వుల దినోత్సవాన్ని 1998 జనవరి 11వ తేదీన ముంబయిలో నిర్వహించారు. దీనికి 1200 మంది హాజరయ్యారు. భారతదేశం వెలుపల మొదటిసారిగా కోపెన్‌హాగెన్‌లో నిర్వహించారు. జనవరి 9వ తేదీన జరిగిన ఈ దినోత్సవానికి పదివేలమంది హాజరయ్యారు.
Read 33 tweets
2 May
#BabyDay 🍼👼🚼
అప్పుడే జన్మించిన లేదా నెలల వయస్సు గల పిల్లలను శిశువు గా వ్యవహరిస్తారు.వీరు ఆహారముకోసము ముఖ్యముగా తల్లిపాలపై ఆధారపడి ఉంటారు.తల్లిపాలలో శిశువుకి కావాల్సిన శక్తి, అన్ని పోషకాలు ఉంటాయి అందుకే ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు, Image
క్యాన్సర్ ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చేఅవకాశం తక్కువగా ఉంటుంది. ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు ఇతర ఆహార పదార్థాలతో పాటు తల్లీపాలు కూడా ఇవ్వాలి.
👶చంటిపిల్లలకు తల్లిపాలు ఆరు నెలల వరకు సరిపోతాయి. తల్లిపాలతో పాటు అదనపు ఆహారం 6 నెలల నుండి ప్రారంభించాలి, మొదటిగా పండ్లరసం వంటి ద్రవాలు తరువాత ఆకుకూరలు, కూరగయలు ,పప్పులు ,ధాన్యాలు కలగలిపినటువంటి గుజ్జు పదార్థాలు, క్రమేపి ఇడ్లి , అన్నం వంటి ఘనపదార్థాలు ఇవ్వాలి .
Read 13 tweets
1 May
#SchoolPrincipalsDay
#HeadMasterDay
ఈ మధ్య కాలం లో ఒక వ్యక్తికి రెండు చేతులూ జోడించి నమస్కరించాలని ఉంది.....ఎవరో కాదు....ప్రధానోపాధ్యాయుడు గా ఉంటూ... మానందరిలో ఉన్నా...కుటుంబసభ్యులతో ఉన్నా...ఏవో ఆలోచిస్తూ...ఎంతో కొంత ఆందోళనతో...కాస్తా అసహనంతో....
@telugumaster Image
బైటికి చెప్పుకోలేని ఒత్తిడి లో ఉంటున్న ప్రధానోపాధ్యాయుడా నీకు వేల దండాలు.....🙏🙏🙏🙏 నీ ఒత్తిడి ఎవరు అర్థం చేసుకోగలరు.... *చిక్కుముడుల అమ్మ ఒడి...తరగని సముద్రంలా...నాడు..నేడు...తరుముకొస్తున్న...డ్రై రేషన్...నిను వీడని నీడను నేనే అనేట్టు... Image
దీక్షా ట్రైనింగ్...MDM, STMS, పోర్ట్ ఫోలియో ల అప్డేట్స్....* ఏమని చెప్పను...ఎన్నెన్ని చెప్పాను...HM ల తిప్పలు....ఒకప్పుడు సమర్థుడైన HM పాఠశాలని... ని స్టూడెంట్స్ ని నిరంతరం పరిశీలిస్తూ...పాఠశాలను ఒక క్రమపద్ధతిలో ఉంచేవారు.
Read 7 tweets
1 May
#WildfireCommunityPreparednessDay వేసవి వచ్చిదంటే చాలు.. అడవులను కార్చిచ్చు కాటేస్తుంటుంది. విలువైన అటవీ సంపదను దహిస్తుంది. ఫలితంగా ప్రభుత్వానికి ఆస్తి నష్టం, వన్యప్రాణులకు ప్రాణ నష్టం, మనుషులకు అటవీ సంపద నష్టం వాటిల్లుతుంటుంది.
#Wildfire #Seshachalam #Nalamalla @RayaIaseema Image
భూగోళంపై అడవుల క్షీణత మానవాళి మనుగడను ప్రమాదంలోకి నెట్టేస్తోంది. వృక్ష సంపద తరిగేకొద్దీ కరవు కాటకాలు, తుపాన్లు, వరదలు, ఇతర వాతావరణ మార్పులు మానవాళికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. భవిష్యత్తు తరాలు ఎదుర్కొనబోయే ఘోర పరిస్థితులు కళ్లముందే సాక్షాత్కరిస్తున్నాయి.
కొన్నేళ్లుగా భారత్‌లోనే కాకుండా, ప్రపంచ దేశాల్లో కార్చిచ్చు పెద్దయెత్తున అడవులను భస్మీపటలం చేస్తున్న తీరు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వచ్చినా కార్చిచ్చును నియంత్రించడం అభివృద్ది చెందిన దేశాలకు సైతం కష్టతరంగా మారుతోంది. Image
Read 17 tweets
1 May
#MaharastraDay
1947లో స్వాతంత్ర్యం తరువాత బొంబాయి ప్రెసిడెన్సీలో మహారాష్ట్ర ప్రాంతం, విదర్భ, నాగపూర్, వాటితో మరికొన్ని రాజ సంస్థానాలు విలీనం చేసి 1950లో బొంబాయి రాష్ట్రం ఏర్పాటు చేశారు. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. Image
మహారాష్ట్ర, (మరాఠీ: #महाराष्ट्र ) భారతదేశంలో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం (ఉత్తరప్రదేశ్ తరువాతి స్థానం). మహారాష్ట్రకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్నాటక, గోవా రాష్ట్రాలతోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా-నగరుహవేలి తోనూ Image
సరిహద్దులున్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. ముంబయి నగరం మహారాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం.
మహారాష్ట్ర ప్రాంతము ఋగ్వేదంలో రాష్ట్రఅనీ, అశోకుని శాసనాలలో రాష్ట్రీకము అనీ, అతరువాత హువాన్‌త్సాంగ్ వంటి యాత్రికుల రచనలలో మహారాష్ట్ర అనీ ప్రస్తావింపబడింది. Image
Read 6 tweets
1 May
మే దినోత్సవం లేదా మే డే (#MayDay)
ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. చాలా దేశాలలో మే దినం, #అంతర్జాతీయ_కార్మిక_దినోత్సవం లేదా కార్మిక దినోత్సవం తో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. #InternationalLabourDay Image
భారతదేశంలో 1947లో మనకు స్వాతంత్ర్యం లబించేంత వరకు భూస్వామ్య వ్యవస్థవుండేది. ఈ వ్యవస్థలో రాజులు తమకు సైనికులను, ఉంపుడుక తెలను సరఫరా చేసినందుకుగాను, విలువైన కానుకలను సమర్పించుకున్నందుకు గాను కొంతమంది వ్యక్తులకు భూములను బహుమానంగా ఇచ్చేవారు. ఈ భూముల్లో వారు శిస్తులు వసూలు చేసి
కొంతభాగం రాజుకి చెల్లించగా మిగిలినది తమ సాంతానికి వాడుకొనేవారు. ఈ భూములను రైతులకు యిచ్చి వ్యవసాయం చేయించి ఫలసాయం తాము తీసుకొనేవారు. అన్ని వృత్తులవాళ్ళు ఎండనక, వాననక భూస్వాములకు పనులు చేసిపెట్టే వాళ్ళు. ఇందుకు వారికి ఎటువంటి ప్రతిఫలం లభించేదికాదు. దీనిని వెట్టి చాకిరీ అనేవాళ్ళు.
Read 19 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!