స్నేహమేరా జీవితం.....స్నేహమేరా శాశ్వతం అన్నాడో కవి. కలకాలం నిలిచిపోయేది స్నేహమని, సృష్టిలో తీయనైంది స్నేహమేనని ఎందరో కవులు పేర్కొన్నారు. స్నేహితులంతా కలిసి ఒక పండగ సంవత్సరంలో ఒక రోజును జరుపుకోవాలని
నిర్ణయించుకొని జరుపుకుంటుంన్నాము.
రక్త సంబంధాలకూ, బీరకాయ పీచు బంధుత్వాలకూ, చత్వారపు చుట్టరికాలకూ అతీతంగా ఉండేది స్నేహం.
నిజానికి వాటన్నిటికన్నా అందమైనదీ, అపురూపమైనదీ, అద్భుతమైనదీ, అత్యున్నతమైనదీ స్నేహమే. ఇటువంటి ఎన్నో విశేషణాలు జోడించి స్నేహాన్ని వర్ణించడానికి చేసిన ప్రయత్నంలో ఎన్నెన్నో కథలు, కవితలు రూపొందాయి. కానీ స్నేహానికి వివరణలు, వర్ణనలు, తాఖీదులు, హామీలు అవసరం లేదు.
ఎందుకంటే స్నేహం మనసుకు సంబంధించిన విషయం. అనుభూతులకు నెలవు. అనుభవాలకు కొలువు.ఈ సృష్టి ఉన్నంతకాలం నిలిచేది ఒక్క స్నేహమే... ఆదిదేవుళ్లు సృష్టి, స్థితి, లయకారకాలను కచ్చితంగా అమలుపరిచేది తమ స్నేహబంధంతోటే... జగన్మాతలు ముగ్గురూ స్నేహంగా ఉండబట్టే రాక్షస సంహారం గావించబడి లోకాలన్నీ
శాంతించినాయి. ద్వాపరయుగంలో లేమికి నిర్వచనంగా చెప్పబడే కుచేలుడు ఇచ్చిన పిడికెడు అటుకులతో అతని స్నేహితుడైన శ్రీకృష్ణుడు అతనికి బంగారు పట్టణాన్నే బహూకరించి స్నేహం విలువను ఈ లోకానికి తెలియజేశాడు.
మహాభారతంలో రారాజు ధుర్యోధనుడు, మానసపుత్రుడు కర్ణుడు మధ్యనున్న స్నేహం వెలకట్టలేనిది. స్నేహితుని కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి కర్ణుడు చరిత్ర లో నిలిచిపోయాడు. రామాయణంలో కూడా శ్రీరామునికి, ఆంజనేయునికి మధ్య ఉన్న స్నేహబంధం లతలా పెనవేసుకుపోయి భక్తిబంధంగా రూపుదాల్చింది. ఇలా యుగయుగాలలో
భగవంతుడు స్నేహబంధం విలువను ఏదో ఒక రూపంలో మనుషులకు సూచిస్తునే ఉన్నాడు. స్నేహబంధంతో ఇరుదేశాల మధ్య రక్తపాతాన్ని ఆపవచ్చు... కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడ వచ్చు... దేశ ఉన్నతిని కాంక్షించవచ్చు... ఇలా చెప్పు కుంటూ పోతే స్నేహబంధం ఒక నిరంతర గంగా ప్రవాహం...
దానిని అదుపు చేయడం గంగ వెల్లువను కమండలంలో పట్టివుంచి నట్లవుతుంది...
1935 లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారంను జాతీయ స్నేహితుల రోజు గా ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి. 1997 లో యునైటెడ్ నేషన్స్ "స్నేహం" యొక్క ప్రపంచ అంబాసిడర్ "విన్నీ ది పూః". నేడు స్నేహితుల దినోత్సవాన్ని అనేక దేశాలు ఉత్సాహవంతంగా జరుపుకుంటున్నాయి.
అమెరికా ప్రభుత్వము 1935 ఆగస్టు మొదటి శనివారము ఓ వ్యక్తిని చంపింది . అతని మరణ వార్త విని ఆమరుచటి రోజు అతని స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటనకు స్పందించిన అమెరికా ప్రభుత్వము వీరి స్నేహానికి గుర్తుగా అప్పటి నుంచీ ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవము గా
ప్రకటించినట్లు చరిత్ర చెబుతోంది .
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు.
ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇది ఒక ప్రముఖ సాంప్రదాయం.ప్రండ్షిప్ బాండ్లు కడతారు ... ఎస్.ఎమ్.ఎస్ లతో గ్రీటింగ్స్ చెబుతారు... కుదిరితే కవ్పు కాఫీ, కాకుంటే కబుర్లు చెవ్పుకుని సరదాగా గడువుతారు...
ప్రండ్షిప్ డే' ఎంజాయ్ చేయాలంటే ఎన్నెన్నో మార్గాలు!
కానీ మన చుట్టూ ఉన్న స్నేహితులతో మనపెలా ఉంటున్నామో ఒక్కసారైనా మననం చేసుకుంటున్నామా?
నిజమైన స్నేహం నిలవాలంటే ఏమేం పాటించాలో తెలుసుకుంటున్నామా?
'ఒరే... వీడు సెల్ఫిష్రా... వదిలెయ్...' అంటే, 'పోనీలేరా... ప్రెండ్ కదరా...' అంటాడు 'హ్యాపిడేస్'లో టైసన్. స్నేహితుడిలో లోపాలున్నా పాటికి అతీతంగా స్నేహం ఉండాలని అంతర్లీనంగా చెబుతుందీ సన్నిపేశం.
స్నేహితులు లేని మనిషి జీవితం ఒయాసిస్ లేని ఎడారిలాంటిది. ఓ వేదాంతి స్నేహాన్ని కొండగుహతో పోలుస్తాడు. దాని ముందు నిల్చొని అరిస్తే వ్రతిధ్వని వినివిస్తుంది. మంచి మిత్రుడి స్పందన కూడా అంత సహజంగా వేగంగా ఉంటుంది. 'నీ వెంట నేనున్నా' అనే భరోసా ఇచ్చేవాడే స్నేహితుడు.
స్నేహం నిరంతరం పెరిగేలా వ్రవర్తించాలి. తెంచే వ్రవర్తనలు ఉంటే గమనించుకుని మనల్ని మనం మార్చుకోపాలి.
చిన్న చిన్న విషయాలను వట్టించుకోకూడదు. స్నేహితుడు నీకు చెవ్పకుండా సినిమాకు పెళితే 'వీడు సెల్ఫిష్' అనుకోకూడదు.
విమర్శించి తవ్పులు సరిదద్దడం స్నేహంలో భాగమే కానీ అదపనిగా విమర్శలు చేయకూడదు.
విమర్శ మనసులో ముల్లులా గుచ్చుకోకుండా, చెవ్పే మాటలు సున్నితంగా ఉండేలా జాగ్రత్త వడాలి.
ఒక స్నేహితుడిలోని లోపాలను మరో స్నేహితుడి వద్ద వ్రస్తావించకుండా ఉంటేనే మంచిది.
మిత్రునిలోని మంచి గుణాలను కూడా వ్రకటిస్తూ ఉండడం ముఖ్యం. అలాగని నింరతరం పొగడ్తల్లో ముంచెత్తకూడదు.
స్నేహితుని మాటల్లో, వ్రవర్తనలో నిగూఢ అర్థాలున్నాయోమోననే అనుమానాన్ని దరిచేరనీయకూడదు. ఉదాహరణకు నీకు బహూకరించిన వుస్తకం విలువను బట్టి 'నేనంత ముఖ్యుడిని కాననే ఈ వుస్తకం ఇచ్చాడు' లాంటి అన్వయాలను విడనాడాలి.
స్నేహంలో నిజాయితీ, పారదర్శకత చాలా ముఖ్యం. #FriendshipDay#FriendshipDay2021
మీ
H. పరమేశ్వర రావు, ప్రొద్దుటూరు, కడప జిల్లా...
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#PsychicDay#Psychic
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే
చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. ఇలా చెప్పినవారు ప్రపంచమంతా లేకపోలేదు పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో అనేక పేర్లు వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు
అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం. అతను భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరచుకుంటారు.
#DollDay 🧚♀️🧸#Doll
ప్రాణం లేని బొమ్మలంటే పిల్లలకు భలే ఇష్టం. వాటిని చిన్నారులు అన్నీ తామై చూసుకుంటారు. స్నానం చేయిస్తారు, అన్నం తినిపిస్తారు, నిద్ర పుచ్చుతారు.బొమ్మలు పిల్లకి అపరిమితమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయి. అంతేకాక వారి మనస్సులలో చెరగని ముద్ర వేస్తాయి.
బొమ్మలతో పిల్లలు నిక్షిప్తం చేసుకునే జ్ఞా పకాలు వారికిజీవితమంతా ప్రేరణగా నిలుస్తాయి. భారత్ స్థానిక బొమ్మలకు ఎంతో ప్రసిద్ధిగాంచింది. కానీ భారతీయ మార్కెట్లోకి వచ్చిన విదేశీ బొమ్మలు ఈ పేరును చెదరగొట్టాయి. ప్రపంచంలో భారత్ అతిపెద్ద బొమ్మల వినియోగదారిగా ఉన్నప్పటికీ,
అంతర్జాతీయ బొమ్మల మార్కెట్లో మన దేశ వాటా మాత్రం కేవలం 0.5 శాతానికే పరిమితమైంది. ఇలాంటి ఈ సమయంలో, కేంద్ర ప్రభుత్వం బొమ్మల పరిశ్రమకు మళ్లీ
జీవం పోసేందుకు పలు రకాల చర్యలు చేపడుతోంది. #Vocal4Local#vocalforlocal
#RESPECTFORPARENTSDAY 🙏
తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి
సినిమాలు, ప్రేమ పేరుతో పిల్లలు పాడవుతున్నారు. పెద్దలంటే పూర్తిగా గౌరవం లేకుండాపోయింది. ఆ రోజుల్లో చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులంటే భయం, గౌరవం ఉండేవి. ప్రస్తుతం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. #RespectforParents
పిల్లల ఉన్నతికి తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలను భరిస్తుంటారు. అటువంటిది పెద్దయిన తర్వాత పిల్లలు వారి మాట వినరు. విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సి ఉంది.
శ్రవణ కుమారా... మమ్మల్ని మన్నించు!
శ్రవణ కుమారుడు.. ఇతని తల్లిదండ్రులిద్దరూ అంధులు.. శ్రవణుడికి వూహ తెలిశాక అమ్మానాన్న కష్టాలను చూసి చలించిపోయాడు. కళ్లు లేవని.. పుణ్యక్షేత్రాలను చూసే భాగ్యం లేదని బాధ పడే తల్లిదండ్రుల కోరిక తీర్చటం కోసం కావడిలో ఇద్దరినీ కూర్చోబెట్టుకుని
#WorldLungCancerDay 🎗 #lungcancerawareness
ఊపిరితిత్తుల క్యాన్సర్ (ఆంగ్లం: #lungcancer#cancer, లేదా lung carcinoma) ఊపిరితిత్తుల్లోని కణాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వచ్చే క్యాన్సర్.ఈ పెరుగుదల మెటాస్టాసిస్ అనే ప్రక్రియ ద్వారా కేవలం ఊపిరితిత్తులతోనే ఆగిపోకుండా చుట్టూ ఉన్న
అవయువాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. సాధారణంగా ఊపిరితిత్తుల్లో ప్రారంభమయ్యే ప్రాథమిక ఊపిరితిత్తుల క్యాన్సర్ (primary lung #cancers) లు కార్సినోమాలు (#carcinomas) ఈ క్యాన్సర్లలో అధిక భాగం (సుమారు 85 శాతం) దీర్ఘకాలం పాటు పొగాకు సేవించే వారిలో కనిపిస్తాయి.
10–15% కేసుల్లో బాధితులు ఎప్పుడూ ధూమపానం చేయలేదు.
2012 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా అందులో సుమారు 16 లక్షలమంది మరణించారు. మగవారిలో కాన్సర్ మరణాలలో ఈ వ్యాధి మొదటి స్థానంలో ఉండగా, ఆడవారిలో రొమ్ము కాన్సర్ తర్వాత ఎక్కువ మంది ఈ వ్యాధి వలననే
#sistersday#sisterlove#sisters 👧
ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలున్నప్పటికీ.. సోదర సోదరీల బంధం చాలా అందమైనది. ఒకే ఇంట్లో చిన్నప్పటి నుండి తిట్టుకుంటూ.. కొట్టుకుంటూ.. ఉండే సోదర సోదరీలు.. సోదరీమణులు పెద్దయ్యాక మాత్రం ఒక్కసారిగా మారిపోతారు. చాలా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచుకుంటారు.
అందుకే మదర్స్ డే, ఫాదర్స్ డే మాదిరిగా సిస్టర్స్ డే అనేది తోబుట్టువులకు అంకితం ఇవ్వబడింది.
మన దేశంలో ప్రతి ఏటా ఆగస్టు ఒకటో తేదీన సిస్టర్స్ డే జరుపుకుంటాం. అదే అమెరికాలో ప్రతి సంవత్సరం ఆగస్టు రెండో తేదీన సిస్టర్స్ డే జరుపుకుంటారు.
ఈరోజున సోదరీమణులందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతారు. ఈరోజున తమ జీవితంలో సోదరీమణులు ఎంత ముఖ్యమో వారికి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివన్నీ చెప్పడానికి ఒక్కరోజు సరిపోకపోయినా.. ఈరోజు వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడం ద్వారా వారిపై ఎంత ప్రేమ ఉందో వ్యక్తం చేస్తారు.
#WorldWideWebDay 🌐🕸️💻
విశ్వవ్యాప్త వలయం
వరల్డ్ వైడ్ వెబ్ ను 1991 సంవత్సరంలో CERN కి చెందిన ఇంజనీరైన టిమ్ బెర్నర్స్ లీ రూపొందించాడు. ఏప్రిల్ 30, 1993 వ తేదీన CERN వరల్డ్ వైడ్ వెబ్ ను అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లుగా ప్రకటించింది. #WorldWideWeb#www
HTML మరియు HTTP ని ప్రవేశపెట్టక మునుపు ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మరియు గోఫర్ ప్రోటోకాల్ మొదలైన వాటిని సర్వర్ నుంచి ఫైళ్ళను రాబట్టేందుకు వాడేవారు.వెబ్ సైటుల అవసరాన్ని బట్టి వాటిని క్రింది విధంగా వర్గీకరించవచ్చు
వ్యక్తిగత వెబ్సైటు
వ్యాపార/ వాణిజ్య వెబ్ సైటు
ప్రభుత్వ వెబ్ సైటు
స్వచ్ఛంద సేవాసంస్థల లేదా లాభాపేక్ష రహిత సంస్థల వెబ్సైటులు
విద్యా సంస్థల వెబ్ సైటు
ప్రసార మాధ్యమాల వెబ్సైటు, మొదలగునవి ముఖ్యమైనవి.