#DollDay 🧚♀️🧸#Doll
ప్రాణం లేని బొమ్మలంటే పిల్లలకు భలే ఇష్టం. వాటిని చిన్నారులు అన్నీ తామై చూసుకుంటారు. స్నానం చేయిస్తారు, అన్నం తినిపిస్తారు, నిద్ర పుచ్చుతారు.బొమ్మలు పిల్లకి అపరిమితమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయి. అంతేకాక వారి మనస్సులలో చెరగని ముద్ర వేస్తాయి.
బొమ్మలతో పిల్లలు నిక్షిప్తం చేసుకునే జ్ఞా పకాలు వారికిజీవితమంతా ప్రేరణగా నిలుస్తాయి. భారత్ స్థానిక బొమ్మలకు ఎంతో ప్రసిద్ధిగాంచింది. కానీ భారతీయ మార్కెట్లోకి వచ్చిన విదేశీ బొమ్మలు ఈ పేరును చెదరగొట్టాయి. ప్రపంచంలో భారత్ అతిపెద్ద బొమ్మల వినియోగదారిగా ఉన్నప్పటికీ,
అంతర్జాతీయ బొమ్మల మార్కెట్లో మన దేశ వాటా మాత్రం కేవలం 0.5 శాతానికే పరిమితమైంది. ఇలాంటి ఈ సమయంలో, కేంద్ర ప్రభుత్వం బొమ్మల పరిశ్రమకు మళ్లీ
జీవం పోసేందుకు పలు రకాల చర్యలు చేపడుతోంది. #Vocal4Local#vocalforlocal
బొమ్మల సాయంతో, భారతీయ సంస్కృతిని, నాగరికతను పిల్లకు పరిచయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదేవిధంగా బొమ్మల పరిశ్రమలో విశ్వాసాన్ని నెలకొల్పి, రసాయన రహిత బొమ్మలను పిల్లకు అందించాలని కృషి చేస్తోంది. ఈ నిరయాలు కేవలం భారతీయ ఆర్థిక
వ్యవస్థకు ఆరోగ్యకరమైన
వాతావరణాన్ని అందించడమే కాకుండా, హానికరమైన బొమ్మల నుంచి
పిల్లల్ని కాపాడనున్నాయి. బొమ్మలు కొన్ని మార్కెట్లో ప్రమాదకరంగా మారాయి. వాటి తయారీలో ఉపయోగించే భయంకరమైన రసాయనాల వల్ల పేలుడు స్వభావంతో పాటు.. క్యాన్సర్ వంటి గుణాల్ని కలిగి ఉంటున్నాయి.
భారత్ దిగుమతి చేసుకుంటున్న బొమ్మలు దాదాపు 67 శాతం ప్రమాదకరమని.. భారతీయ నాణ్యత మండలి(క్యూసీఐ) తెలిపింది. దిల్లీ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బొమ్మలను పరీక్షించగా.. అందులో 66.9శాతం నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి లేవు. కేవలం 33.1శాతం మాత్రమే అన్ని పరీక్షల్లో నెగ్గాయి.
క్యూసీఐ ఏమంటోందంటే..?
భద్రత పేరుతో అధిక స్థాయిలో ఫ్తాలెట్, భారీ మెటల్‌ను ఉపయోగిస్తున్నందునే 30 శాతం ప్లాస్టిక్ బొమ్మలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని క్యూసీఐ నివేదిక తెలిపింది. 80 శాతం వరకు ప్లాస్టిక్ బొమ్మలు యాంత్రిక, భౌతిక లక్షణాల కారణంగా విరిగిపోతున్నాయని క్యూసీఐ పేర్కొంది
సరకు పరీక్ష తప్పనిసరి...85 శాతం చైనా ఉత్పత్తులను శ్రీలంక, మలేషియా, జర్మనీ, హాంగ్‌కాంగ్, అమెరికా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. విదేశీ వాణిజ్య సంచాలక ప్రధాన కార్యాలయం(డీజీఎఫ్టీ) వీటి టెస్టింగ్ నివేదికలను పరీక్షిస్తూ... సరకు ఆధారిత పరీక్షను తప్పనిసరి చేసింది.
దీనికి సంబంధించిన ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ప్రకటన కోసం ముసాయిదాను క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్(క్యూసీఓ)కు పంపించారు.
'యాంత్రికంగా విఫలమైన బొమ్మలు పిల్లలకు చర్మవ్యాధులను కలుగజేస్తాయి. అందులో వాడిన హానికరమైన రసాయనాలు క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి.
ఒక బాలుడు బొమ్మతో ఆడుకొంటుండగా... అందులో మంటలు ఏర్పడ్డాయి. భారత నౌకల్లో వచ్చే ప్రతి సరకు నుంచి నమూనాలను తీసుకొని పరీక్షిస్తారు. అవి విఫలమైతే నాశనమవుతాయి లేదా తయారీదారులకు తిరిగిపంపుతారు.
బొమ్మల ద్వారా దేశంలో పిల్లల ఆరోగ్యం, భద్రతకు హాని కలగకుండా ఉండటానికే నౌకాశ్రయాలు నిబంధనల్ని తప్పనిసరి చేశాయి' - ఆర్పీ సింగ్, క్యూసీఐ ప్రధాన కార్యదర్శి
కొండపల్లి బొమ్మలు లేదా కొండపల్లి కొయ్యబొమ్మలు విజయవాడ సమీపంలోని కొండపల్లి గ్రామంలో తయారైన బొమ్మలు. మకర సంక్రాంతి, దసరా పండుగల సమయంలో సంప్రదాయికంగా వీటితో స్త్రీలు బొమ్మల కొలువు ఏర్పాటుచేస్తూంటారు.
ఏటికొప్పాక బొమ్మలకు 2017లో
జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ(జీఐఆర్) నుంచి జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) ట్యాగ్ కూడా వచ్చింది.
రాజస్థాన్ నుంచి తరతరాల క్రితం వలసవచ్చిన నిపుణులు ఈ బొమ్మలు రూపొందిస్తూంటారు. ఈ బొమ్మలు రూపొందించే నిపుణుల్ని ‘ఆర్యక్షత్రియులు’గా పిలుస్తూంటారు. వలస వస్తూ ఈ కళాకారులు 16వ శతాబ్దంలో తమతో పాటుగా బొమ్మలు తయారుచేసే కళను తీసుకువచ్చినట్టు చెప్తూంటారు.
ఈ నాలుగు వందల ఏళ్ళ సంప్రదాయం తరం నుంచి తరానికి అందుతూ వచ్చింది. ఆ క్రమమంలో కొండపల్లిలోని బొమ్మల కాలనీలో కుటుంబంలోని ప్రతివారూ బొమ్మల రూపొందించడంలో పాలుపంచుకుంటున్నారు.
ఈ సముదాయం గురించి బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావన ఉంది. ఈ సముదాయం శివుడి నుంచి కళలు, నైపుణ్యం పొందిన ముక్తాఋషి తమకు ఆద్యుడని పేర్కొంటూంటారు. ఈ నిపుణులు ఆంధ్రప్రదేశ్ లోని అనేక ఆలయాల్లో గరుడుడు, నంది, సింహం, వాహనాలు వంటివాటి విగ్రహాలను తమ పూర్వీకులు చెక్కినట్టుగా చెప్తారు.
కాలక్రమేణా కొండపల్లి కొయ్యబొమ్మలు ఆటబొమ్మల నుంచి సేకరణ వస్తువులయ్యాయి.
విపణిలో మార్పుకు ఇది కారణమైంది, ఎందుకంటే పిల్లల బొమ్మలు పాడవగలిగేవి మళ్ళీ మళ్ళీ కొనేవి కాగా సేకరణ వస్తువులు ఒకసారి కొన్నాకా భర్తీ చేయాల్సిన అవసరం తక్కువ ఉంటుంది.
దసరా, సంక్రాంతి వేడుకల్లో బొమ్మల కొలువు, దానిలో ఈ కొయ్యబొమ్మలు అంతర్భాగం. వేడుకగా స్త్రీలు తాము సేకరించిన వివిధ కొయ్యబొమ్మల్ని ప్రదర్శిస్తారు. వేడుకలో స్త్రీలు, పిల్లలు ఆసక్తిగా పాల్గొంటూంటారు. ఈ పండుగల సమయంలో కొండపల్లి బొమ్మల నిపుణులు ప్రధానంగా తమ వ్యాపారం చేస్తున్నారు.
తెల్ల పొణికి అని పిలిచే స్థానిక చెక్క రకం వాడి చెక్కి, ఆపై కూరగాయల నుంచి లభించే రంగులను, సహజ రంగులను, ప్రస్తుతం కొంతవరకూ ఎనామిల్ రంగులను వాడి తయారుచేసే ఈ బొమ్మలు కళాత్మకమైన పనితనానికి ప్రాచుర్యం పొందాయి.
సంప్రదాయకమైన కొండపల్లి శైలిలోని తాడిచెట్టు బొమ్మలు, ఎడ్లబండి బొమ్మలు, అంబారీ ఏనుగు బొమ్మలు, గ్రామ నేపథ్యంలోని బొమ్మలు, బృందావన బొమ్మలు వంటివి చేస్తూంటారు.
అత్యంత ప్రాచుర్యం పొందిన బొమ్మల్లో దశావతారాలు, ఏనుగు అంబారీ, ఒంటెద్దు బండి, గీతోపదేశం, పెళ్ళికూతురు-పెళ్ళికొడుకులను మోస్తూ వెళ్తున్న పల్లకీ-బోయీలు, గ్రామాల్లోని చేతివృత్తుల వాళ్ళ సెట్, జంతువులు వంటివి ఉన్నాయి. తల ఊపుతూండే అమ్మాయి, అబ్బాయి, బ్రాహ్మణుడు వంటివి చాలామందికి ఇష్టమైన
బొమ్మలు.
ఐతే ఈ సంప్రదాయాలు క్రమంగా కళ తప్పుతూండడంతో నిపుణులు గిట్టుబాటు కోసం సహజమైన రంగులను వదిలి ఎనామెల్ రంగులు వంటివాటిని వినియోగిస్తున్నారు. బొమ్మల వ్యాపారంలో యంత్రాల వినియోగం వంటివి వచ్చి చేరి కొండపల్లి నిపుణుల వ్యాపారం దెబ్బతీస్తున్నా ప్రస్తుతం ప్రభుత్వ సహకారం,
ప్రభుత్వ సంస్థలు దృష్టిపెడుతున్న కారణంగా వీరికి సహకారంగా ఉంది. చారిత్రక ప్రాంతమైన కొండపల్లిలో ఎంతో విలువైన అటవీ సంపద ఉంది. 1891లో కొండపల్లి, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని అడవిని నోటిఫై చేశారు.
1933లో అప్పటి వరకూ సర్వే జరగని ప్రాంతాలను కూడా రిజర్వుఫారెస్ట్ పరిధిలోకి తీసుకొచ్చారు.అక్కడి అడవుల నుంచి లభించే కలప ప్రసిద్ధి చెందిన కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగపడుతోంది.కానీ,కొండపల్లి బొమ్మల తయారీకి ప్రధాన ముడిసరకైన పునికి చెట్లు ప్రస్తుతం కనుమరుగవుతుండడంతో ఆందోళన కనిపిస్తోంది
కలప కొరత వల్ల బొమ్మల తయారీకి ఆటంకం ఏర్పడుతోందని, ఇప్పటికే కొండపల్లి పరిసరాల్లో పునికి చెట్లు దాదాపు కనిపించకుండా పోయాయని, దూర ప్రాంతాల నుంచి కలప తీసుకురావాల్సి వస్తుండంతో పెట్టుబడి వ్యయం పెరిగిందని బొమ్మల తయారీదారులు చెబుతున్నారు.
ఒకప్పుడు కొండపల్లి బొమ్మల తయారీ చాలా జోరుగా సాగేది. ఎక్కువ మంది తయారీదారులు కూడా ఉండేవారు. అయినా, అందరికీ అవసరమైన మేరకు కలప అందుబాటులో ఉండేది.
ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది. కొండపల్లి బొమ్మలకు మార్కెట్లో ఆదరణ ఉన్నా, వాటి తయారీకి పునికి కలప అవసరం. కానీ అది లభించడం గగనం అవుతోంది.
"చుట్టుపక్కల రిజర్వు ఫారెస్టు ప్రాంతాల్లో కూడా మైనింగ్ జరుగుతోంది. క్వారీల్లో బ్లాస్టింగ్ పుణ్యమా అని పునికి చెట్లు కోల్పోతున్నాం. పైగా అవి సహజంగా పెరిగే చెట్లు. వాటిని పెంచాలని, కొన్ని మొక్కలు కూడా నాటాం. అయితే, ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
ఇప్పటికే కలప కొరత పెరుగుతుండడంతో భవిష్యత్తులో ఇంకా ఎన్ని సమస్యలొస్తాయో అని అంతా ఆందోళనతో ఉన్నారు" అని బాలబ్రహ్మ బొమ్మల తయారీ కంపెనీ యజమాని కె. శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#PsychicDay#Psychic
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే
చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. ఇలా చెప్పినవారు ప్రపంచమంతా లేకపోలేదు పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో అనేక పేర్లు వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు
అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం. అతను భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరచుకుంటారు.
#RESPECTFORPARENTSDAY 🙏
తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి
సినిమాలు, ప్రేమ పేరుతో పిల్లలు పాడవుతున్నారు. పెద్దలంటే పూర్తిగా గౌరవం లేకుండాపోయింది. ఆ రోజుల్లో చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులంటే భయం, గౌరవం ఉండేవి. ప్రస్తుతం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. #RespectforParents
పిల్లల ఉన్నతికి తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలను భరిస్తుంటారు. అటువంటిది పెద్దయిన తర్వాత పిల్లలు వారి మాట వినరు. విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సి ఉంది.
శ్రవణ కుమారా... మమ్మల్ని మన్నించు!
శ్రవణ కుమారుడు.. ఇతని తల్లిదండ్రులిద్దరూ అంధులు.. శ్రవణుడికి వూహ తెలిశాక అమ్మానాన్న కష్టాలను చూసి చలించిపోయాడు. కళ్లు లేవని.. పుణ్యక్షేత్రాలను చూసే భాగ్యం లేదని బాధ పడే తల్లిదండ్రుల కోరిక తీర్చటం కోసం కావడిలో ఇద్దరినీ కూర్చోబెట్టుకుని
#WorldLungCancerDay 🎗 #lungcancerawareness
ఊపిరితిత్తుల క్యాన్సర్ (ఆంగ్లం: #lungcancer#cancer, లేదా lung carcinoma) ఊపిరితిత్తుల్లోని కణాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వచ్చే క్యాన్సర్.ఈ పెరుగుదల మెటాస్టాసిస్ అనే ప్రక్రియ ద్వారా కేవలం ఊపిరితిత్తులతోనే ఆగిపోకుండా చుట్టూ ఉన్న
అవయువాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. సాధారణంగా ఊపిరితిత్తుల్లో ప్రారంభమయ్యే ప్రాథమిక ఊపిరితిత్తుల క్యాన్సర్ (primary lung #cancers) లు కార్సినోమాలు (#carcinomas) ఈ క్యాన్సర్లలో అధిక భాగం (సుమారు 85 శాతం) దీర్ఘకాలం పాటు పొగాకు సేవించే వారిలో కనిపిస్తాయి.
10–15% కేసుల్లో బాధితులు ఎప్పుడూ ధూమపానం చేయలేదు.
2012 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా అందులో సుమారు 16 లక్షలమంది మరణించారు. మగవారిలో కాన్సర్ మరణాలలో ఈ వ్యాధి మొదటి స్థానంలో ఉండగా, ఆడవారిలో రొమ్ము కాన్సర్ తర్వాత ఎక్కువ మంది ఈ వ్యాధి వలననే
#sistersday#sisterlove#sisters 👧
ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలున్నప్పటికీ.. సోదర సోదరీల బంధం చాలా అందమైనది. ఒకే ఇంట్లో చిన్నప్పటి నుండి తిట్టుకుంటూ.. కొట్టుకుంటూ.. ఉండే సోదర సోదరీలు.. సోదరీమణులు పెద్దయ్యాక మాత్రం ఒక్కసారిగా మారిపోతారు. చాలా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచుకుంటారు.
అందుకే మదర్స్ డే, ఫాదర్స్ డే మాదిరిగా సిస్టర్స్ డే అనేది తోబుట్టువులకు అంకితం ఇవ్వబడింది.
మన దేశంలో ప్రతి ఏటా ఆగస్టు ఒకటో తేదీన సిస్టర్స్ డే జరుపుకుంటాం. అదే అమెరికాలో ప్రతి సంవత్సరం ఆగస్టు రెండో తేదీన సిస్టర్స్ డే జరుపుకుంటారు.
ఈరోజున సోదరీమణులందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతారు. ఈరోజున తమ జీవితంలో సోదరీమణులు ఎంత ముఖ్యమో వారికి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివన్నీ చెప్పడానికి ఒక్కరోజు సరిపోకపోయినా.. ఈరోజు వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడం ద్వారా వారిపై ఎంత ప్రేమ ఉందో వ్యక్తం చేస్తారు.
#WorldWideWebDay 🌐🕸️💻
విశ్వవ్యాప్త వలయం
వరల్డ్ వైడ్ వెబ్ ను 1991 సంవత్సరంలో CERN కి చెందిన ఇంజనీరైన టిమ్ బెర్నర్స్ లీ రూపొందించాడు. ఏప్రిల్ 30, 1993 వ తేదీన CERN వరల్డ్ వైడ్ వెబ్ ను అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లుగా ప్రకటించింది. #WorldWideWeb#www
HTML మరియు HTTP ని ప్రవేశపెట్టక మునుపు ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ మరియు గోఫర్ ప్రోటోకాల్ మొదలైన వాటిని సర్వర్ నుంచి ఫైళ్ళను రాబట్టేందుకు వాడేవారు.వెబ్ సైటుల అవసరాన్ని బట్టి వాటిని క్రింది విధంగా వర్గీకరించవచ్చు
వ్యక్తిగత వెబ్‌సైటు
వ్యాపార/ వాణిజ్య వెబ్ సైటు
ప్రభుత్వ వెబ్ సైటు
స్వచ్ఛంద సేవాసంస్థల లేదా లాభాపేక్ష రహిత సంస్థల వెబ్‌సైటులు
విద్యా సంస్థల వెబ్ సైటు
ప్రసార మాధ్యమాల వెబ్‌సైటు, మొదలగునవి ముఖ్యమైనవి.
స్నేహమేరా జీవితం.....స్నేహమేరా శాశ్వతం అన్నాడో కవి. కలకాలం నిలిచిపోయేది స్నేహమని, సృష్టిలో తీయనైంది స్నేహమేనని ఎందరో కవులు పేర్కొన్నారు. స్నేహితులంతా కలిసి ఒక పండగ సంవత్సరంలో ఒక రోజును జరుపుకోవాలని
నిర్ణయించుకొని జరుపుకుంటుంన్నాము.
రక్త సంబంధాలకూ, బీరకాయ పీచు బంధుత్వాలకూ, చత్వారపు చుట్టరికాలకూ అతీతంగా ఉండేది స్నేహం.
నిజానికి వాటన్నిటికన్నా అందమైనదీ, అపురూపమైనదీ, అద్భుతమైనదీ, అత్యున్నతమైనదీ స్నేహమే. ఇటువంటి ఎన్నో విశేషణాలు జోడించి స్నేహాన్ని వర్ణించడానికి చేసిన ప్రయత్నంలో ఎన్నెన్నో కథలు, కవితలు రూపొందాయి. కానీ స్నేహానికి వివరణలు, వర్ణనలు, తాఖీదులు, హామీలు అవసరం లేదు.