#WorldLungCancerDay 🎗 #lungcancerawareness
ఊపిరితిత్తుల క్యాన్సర్ (ఆంగ్లం: #lungcancer#cancer, లేదా lung carcinoma) ఊపిరితిత్తుల్లోని కణాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వచ్చే క్యాన్సర్.ఈ పెరుగుదల మెటాస్టాసిస్ అనే ప్రక్రియ ద్వారా కేవలం ఊపిరితిత్తులతోనే ఆగిపోకుండా చుట్టూ ఉన్న
అవయువాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. సాధారణంగా ఊపిరితిత్తుల్లో ప్రారంభమయ్యే ప్రాథమిక ఊపిరితిత్తుల క్యాన్సర్ (primary lung #cancers) లు కార్సినోమాలు (#carcinomas) ఈ క్యాన్సర్లలో అధిక భాగం (సుమారు 85 శాతం) దీర్ఘకాలం పాటు పొగాకు సేవించే వారిలో కనిపిస్తాయి.
10–15% కేసుల్లో బాధితులు ఎప్పుడూ ధూమపానం చేయలేదు.
2012 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా అందులో సుమారు 16 లక్షలమంది మరణించారు. మగవారిలో కాన్సర్ మరణాలలో ఈ వ్యాధి మొదటి స్థానంలో ఉండగా, ఆడవారిలో రొమ్ము కాన్సర్ తర్వాత ఎక్కువ మంది ఈ వ్యాధి వలననే
మరణిస్తున్నారు.ఎక్కువ శాతం వ్యాధి నిర్ధారణ 70 సంవత్సరాల వయసులో జరుగుతోంది.
అనేక సందర్భాలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించిన వివరాలను నిపుణులు, లేదా మీడియా ద్వారా వినే ఉంటారు. మీకు ధూమపానం అలవాటు లేని కారణంగా కానీ, లేదా కలుషిత ప్రదేశాల నుండి దూరంగా ఉండడం మూలంగా కానీ,
మీకు ఈ సమస్య రాదని భావించి, సూచనలను విస్మరించి ఉండవచ్చు. కానీ, ఊపిరితిత్తుల కాన్సర్ సోకడానికి అనేక కారకాలు ఉన్నాయన్న విషయం మర్చిపోకూడదు. క్రమంగా ఈ ప్రమాదకర వ్యాధి యొక్క లక్షణాల గురించిన అవగాహన కలిగి ఉండడం ద్వారా ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, ఊపిరితిత్తుల క్యాన్సర్ కలిగిన 20 శాతం మంది ప్రజలు ధూమపానం కానివారుగా గుర్తించబడ్డారు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ 20శాతం మంది రోగులు కాన్సర్ ప్రధాన కారకం అయిన ధూమపానాన్ని దూరం చేసినా కూడా,
ఇతర కాలుష్య పొగల కారణంగా, పర్యావరణ నాశన కారకాలు లేదా జన్యు ఉత్పరివర్తనలు, వాహనాల కాలుష్యం మొదలైన వాటి ద్వారా కూడా ఈ వ్యాధి బారిన పడినట్లు తేలింది.
అంతేకాకుండా, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణంగా ఉంది. అంతేకాక క్యాన్సర్ల యొక్క అత్యంత సాధారణ రకాల్లో కూడా ఒకటి. అమెరికాలో ప్రతి సంవత్సరం కాన్సర్ బారిన పడుతున్న రోగులలో 14 శాతం మంది, ఊపిరితిత్తుల కాన్సర్ బారిన పడిన వారే.
పూర్తిగా సమస్యలో కూరుకుపోయాక నివారణా చర్యలు చేపట్టడం మూలంగా ప్రయోజనాల శాతం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున, ఇప్పుడు చెప్పబోయే ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క ఈ 5 ఉమ్మడి సంకేతాలను గమనించినట్లయితే, వెంటనే మీ వైద్యుని సంప్రదించడం మంచిది.
దీర్ఘకాలిక దగ్గు:
ఒక సాధారణ జలుబు లేదా ఇతర శ్వాస సంబంధిత అనారోగ్యం దగ్గుకు కారణమవుతుంది. కానీ కేవలం ఒక వారం లేదా రెండు వారాలలో దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని సందర్భాలలో మందులని ఆశ్రయించినా, 2,3 వారాలలో దగ్గు పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. అలాకాకుండా మీ దగ్గు నెల లేదా అంతకన్నా,
ఎక్కువ కాలం కొనసాగితే, ఖచ్చితంగా దాన్ని తనిఖీ చేయవలసిన అవసరం ఉంటుంది. మీరు పదేపదే జబ్బు బారిన పడుతున్న ఎడల, వెంటనే వైద్యునికి మీ పరిస్థితిని గూర్చి తెలియజేయండి. వైద్యుడు ఎక్స్-రే, రక్త మరియు మూత్ర పరీక్షల ద్వారా మీ పరిస్థితిని అంచనావేసి నివారణా మార్గాలు, లేదా చికిత్సా విధానాలను
సూచించగలడు.
అసాధారణ శ్వాస లేదా గురక:
ఊపిరితిత్తుల క్యాన్సర్ కలిగిన రోగులు శ్వాసలో మార్పును గమనిస్తారు. శ్వాస సరిగ్గా ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం, నిద్రలో తీవ్రమైన గురక మొదలైన సమస్యలు కూడా ఊపిరితిత్తుల కాన్సర్ లక్షణాలుగా ఉన్నాయి.
మీ వైద్యుడు ద్రువీకరించనంతవరకు, మీరు తేలికగా తీసుకోడానికి లేదు. కొన్ని శ్వాసకోశ సంబంధిత అలర్జీల కారణంగా కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తవచ్చు. కావున వైద్యుని సూచనల ప్రకారం నడుచుకోవలసి ఉంటుంది. ఊపిరితిత్తుల పరంగా ఎటువంటి చిన్న సమస్య వచ్చినా,
నిర్లక్ష్యం వహించరాదు. ముఖ్యంగా జలుబు, ఆస్థ్మా వంటి తెలిసిన వ్యాధులు లేని పక్షాన కూడా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తితే, వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.
బొంగురు గొంతు :
ఊపిరితిత్తుల క్యాన్సర్ స్వరపేటిక మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. గొంతులోని నరాలు నొక్కుతున్న అనుభూతికి లోనవ్వడం, క్రమంగా అసౌకర్యానికి లోనవడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు, మీరు మీ గొంతులో లేదా మాటలలో మార్పును గమనించవచ్చు.
దీనిని బొంగురు గొంతు లేదా హోర్స్ వాయిస్ అని వ్యవహరిస్తారు. రెండు వారాల పాటు ఈ సమస్య కొనసాగినట్లయితే మీ వైద్యునికి ఈ లక్షణం గురించి తెలియజేయండి.
అసాధారణమైన బరువు నష్టం:
మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే బరువును కోల్పోతున్నారా? ఊబకాయం కలిగిన వారికి, అప్రయత్నంగా బరువు కోల్పోవడం అనేది సంతోషం కలిగిస్తున్నప్పటికీ, ఒక్కోసారి తీవ్రమైన సమస్యగా ఉండే అవకాశాలు లేకపోలేదు.
ఇక్కడ మీ వైద్యుని అంచనా అవసరం. ఇతర లక్షణాలతో పాటు, అసాధారణంగా బరువు కోల్పోవడం కూడా ఊపిరితిత్తుల కాన్సర్ లక్షణం కావొచ్చు.
వెన్నునొప్పి :
చివరగా, ఊపిరితిత్తుల క్యాన్సర్ సంకేతాలలో తక్కువగా తెలిసిన సంకేతం, మీ ఎముకలలో లేదా కీళ్ళలో తీవ్రమైన నొప్పి. వెన్నులో లేదా, నడుము భాగంలో నొప్పిని అనుభూతి చెందుతున్న ఎడల, రాత్రి నిద్రలో నొప్పి తీవ్రమవుతున్న పక్షంలో, ఇది ఖచ్చితంగా కాన్సర్ సంకేతం కావొచ్చు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#PsychicDay#Psychic
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే
చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. ఇలా చెప్పినవారు ప్రపంచమంతా లేకపోలేదు పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో అనేక పేర్లు వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు
అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం. అతను భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరచుకుంటారు.
#DollDay 🧚♀️🧸#Doll
ప్రాణం లేని బొమ్మలంటే పిల్లలకు భలే ఇష్టం. వాటిని చిన్నారులు అన్నీ తామై చూసుకుంటారు. స్నానం చేయిస్తారు, అన్నం తినిపిస్తారు, నిద్ర పుచ్చుతారు.బొమ్మలు పిల్లకి అపరిమితమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయి. అంతేకాక వారి మనస్సులలో చెరగని ముద్ర వేస్తాయి.
బొమ్మలతో పిల్లలు నిక్షిప్తం చేసుకునే జ్ఞా పకాలు వారికిజీవితమంతా ప్రేరణగా నిలుస్తాయి. భారత్ స్థానిక బొమ్మలకు ఎంతో ప్రసిద్ధిగాంచింది. కానీ భారతీయ మార్కెట్లోకి వచ్చిన విదేశీ బొమ్మలు ఈ పేరును చెదరగొట్టాయి. ప్రపంచంలో భారత్ అతిపెద్ద బొమ్మల వినియోగదారిగా ఉన్నప్పటికీ,
అంతర్జాతీయ బొమ్మల మార్కెట్లో మన దేశ వాటా మాత్రం కేవలం 0.5 శాతానికే పరిమితమైంది. ఇలాంటి ఈ సమయంలో, కేంద్ర ప్రభుత్వం బొమ్మల పరిశ్రమకు మళ్లీ
జీవం పోసేందుకు పలు రకాల చర్యలు చేపడుతోంది. #Vocal4Local#vocalforlocal
#RESPECTFORPARENTSDAY 🙏
తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి
సినిమాలు, ప్రేమ పేరుతో పిల్లలు పాడవుతున్నారు. పెద్దలంటే పూర్తిగా గౌరవం లేకుండాపోయింది. ఆ రోజుల్లో చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులంటే భయం, గౌరవం ఉండేవి. ప్రస్తుతం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. #RespectforParents
పిల్లల ఉన్నతికి తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలను భరిస్తుంటారు. అటువంటిది పెద్దయిన తర్వాత పిల్లలు వారి మాట వినరు. విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సి ఉంది.
శ్రవణ కుమారా... మమ్మల్ని మన్నించు!
శ్రవణ కుమారుడు.. ఇతని తల్లిదండ్రులిద్దరూ అంధులు.. శ్రవణుడికి వూహ తెలిశాక అమ్మానాన్న కష్టాలను చూసి చలించిపోయాడు. కళ్లు లేవని.. పుణ్యక్షేత్రాలను చూసే భాగ్యం లేదని బాధ పడే తల్లిదండ్రుల కోరిక తీర్చటం కోసం కావడిలో ఇద్దరినీ కూర్చోబెట్టుకుని
#sistersday#sisterlove#sisters 👧
ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలున్నప్పటికీ.. సోదర సోదరీల బంధం చాలా అందమైనది. ఒకే ఇంట్లో చిన్నప్పటి నుండి తిట్టుకుంటూ.. కొట్టుకుంటూ.. ఉండే సోదర సోదరీలు.. సోదరీమణులు పెద్దయ్యాక మాత్రం ఒక్కసారిగా మారిపోతారు. చాలా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచుకుంటారు.
అందుకే మదర్స్ డే, ఫాదర్స్ డే మాదిరిగా సిస్టర్స్ డే అనేది తోబుట్టువులకు అంకితం ఇవ్వబడింది.
మన దేశంలో ప్రతి ఏటా ఆగస్టు ఒకటో తేదీన సిస్టర్స్ డే జరుపుకుంటాం. అదే అమెరికాలో ప్రతి సంవత్సరం ఆగస్టు రెండో తేదీన సిస్టర్స్ డే జరుపుకుంటారు.
ఈరోజున సోదరీమణులందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతారు. ఈరోజున తమ జీవితంలో సోదరీమణులు ఎంత ముఖ్యమో వారికి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివన్నీ చెప్పడానికి ఒక్కరోజు సరిపోకపోయినా.. ఈరోజు వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడం ద్వారా వారిపై ఎంత ప్రేమ ఉందో వ్యక్తం చేస్తారు.
#WorldWideWebDay 🌐🕸️💻
విశ్వవ్యాప్త వలయం
వరల్డ్ వైడ్ వెబ్ ను 1991 సంవత్సరంలో CERN కి చెందిన ఇంజనీరైన టిమ్ బెర్నర్స్ లీ రూపొందించాడు. ఏప్రిల్ 30, 1993 వ తేదీన CERN వరల్డ్ వైడ్ వెబ్ ను అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లుగా ప్రకటించింది. #WorldWideWeb#www
HTML మరియు HTTP ని ప్రవేశపెట్టక మునుపు ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ మరియు గోఫర్ ప్రోటోకాల్ మొదలైన వాటిని సర్వర్ నుంచి ఫైళ్ళను రాబట్టేందుకు వాడేవారు.వెబ్ సైటుల అవసరాన్ని బట్టి వాటిని క్రింది విధంగా వర్గీకరించవచ్చు
వ్యక్తిగత వెబ్‌సైటు
వ్యాపార/ వాణిజ్య వెబ్ సైటు
ప్రభుత్వ వెబ్ సైటు
స్వచ్ఛంద సేవాసంస్థల లేదా లాభాపేక్ష రహిత సంస్థల వెబ్‌సైటులు
విద్యా సంస్థల వెబ్ సైటు
ప్రసార మాధ్యమాల వెబ్‌సైటు, మొదలగునవి ముఖ్యమైనవి.
స్నేహమేరా జీవితం.....స్నేహమేరా శాశ్వతం అన్నాడో కవి. కలకాలం నిలిచిపోయేది స్నేహమని, సృష్టిలో తీయనైంది స్నేహమేనని ఎందరో కవులు పేర్కొన్నారు. స్నేహితులంతా కలిసి ఒక పండగ సంవత్సరంలో ఒక రోజును జరుపుకోవాలని
నిర్ణయించుకొని జరుపుకుంటుంన్నాము.
రక్త సంబంధాలకూ, బీరకాయ పీచు బంధుత్వాలకూ, చత్వారపు చుట్టరికాలకూ అతీతంగా ఉండేది స్నేహం.
నిజానికి వాటన్నిటికన్నా అందమైనదీ, అపురూపమైనదీ, అద్భుతమైనదీ, అత్యున్నతమైనదీ స్నేహమే. ఇటువంటి ఎన్నో విశేషణాలు జోడించి స్నేహాన్ని వర్ణించడానికి చేసిన ప్రయత్నంలో ఎన్నెన్నో కథలు, కవితలు రూపొందాయి. కానీ స్నేహానికి వివరణలు, వర్ణనలు, తాఖీదులు, హామీలు అవసరం లేదు.