#PsychicDay#Psychic
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే
చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. ఇలా చెప్పినవారు ప్రపంచమంతా లేకపోలేదు పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో అనేక పేర్లు వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు
అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం. అతను భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరచుకుంటారు.
బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నదీ తీరప్రాంతంలో జన్మించారనిన చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు. గాంధి మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచింపబడింది.
ఆంగ్లేయ, మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక, రాజకీయ పరిణామాలు సూచింప బడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు వింతలూ చోద్యాలు బాబాల రాక అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురికావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదేపదే పునరుద్ఘాటించాడు.
ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచింప బడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే.
వీర బ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానాన్ని వివిధ శైలులను ఉపయోగించి కూర్చారు, అందులో శ్లోకాలు, పద్యాలు, వచనం మొదలైనవి.
1.చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురునుచేరి మ్రొక్కితె బ్రతక నేర్చేరు............... \\చె\\
చెప్పలేదంటనకపొయ్యేరు తప్పదిదిగో గురుని వాఖ్యము, తప్పు దోవను పోరు వారల చప్పరించె శక్తులు......\\చె\\
మొప్పె తనమున మోసపొయ్యేరు, అదియుగాక కొందరు గొప్పతనమున గోసు మీరేరు............\\చె\\
2'. ఏమి జన్మము ఏమి జీవనము, ఈ మాయ కాయము ఎణ్ణాళ్ళు బ్రతుకీది, మూన్నాళ్ళు ముచ్చట||
మూన్నాళ్ళముచ్చటగురుసేవ జేయని దేమి జన్మము ఏమి జీవనము, ఏమి జన్మంబేమిజీవనమేమిశాశ్వత మేమి సౌఖ్యము, ఏమి నాప్రారబ్దము స్వామి నన్నిటు జేసి మరచెను..............||ఏమి జన్మ||
ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్నవి
*నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు (విద్యుత్ శక్తి) (నీటీతొ జనరేటరు)
*ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. (యంత్ర వాహనాలు)
*కాశీ పట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది.
ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంథి)
*తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (ఎన్.టి.ఆర్, జయలలిత, తదితరులు. చలన చిత్రాలు)
*రాచరికాలు, రాజుల పాలనా నశిస్తాయి. (ప్రజా ప్రభుత్వాలు)
*ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. (విమాన ప్రమాదాలు)
*జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
*బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి.
*హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు. (మత కలహాలు)
*దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. (దొంగతనం)
*చిత్రవిచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావుపుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు.
సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.
*రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి. (శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు)
*గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. (లాల్ బహుద్దూర్ శాస్త్రి)
*కపట యోగులు విపరీతంగా పెరిగి పోతారు. వీరివలన ప్రజలంతా మోసపోతారు.
*అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి
*నది గండకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి (నేపాల్ భూకంపము)
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#DollDay 🧚♀️🧸#Doll
ప్రాణం లేని బొమ్మలంటే పిల్లలకు భలే ఇష్టం. వాటిని చిన్నారులు అన్నీ తామై చూసుకుంటారు. స్నానం చేయిస్తారు, అన్నం తినిపిస్తారు, నిద్ర పుచ్చుతారు.బొమ్మలు పిల్లకి అపరిమితమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయి. అంతేకాక వారి మనస్సులలో చెరగని ముద్ర వేస్తాయి.
బొమ్మలతో పిల్లలు నిక్షిప్తం చేసుకునే జ్ఞా పకాలు వారికిజీవితమంతా ప్రేరణగా నిలుస్తాయి. భారత్ స్థానిక బొమ్మలకు ఎంతో ప్రసిద్ధిగాంచింది. కానీ భారతీయ మార్కెట్లోకి వచ్చిన విదేశీ బొమ్మలు ఈ పేరును చెదరగొట్టాయి. ప్రపంచంలో భారత్ అతిపెద్ద బొమ్మల వినియోగదారిగా ఉన్నప్పటికీ,
అంతర్జాతీయ బొమ్మల మార్కెట్లో మన దేశ వాటా మాత్రం కేవలం 0.5 శాతానికే పరిమితమైంది. ఇలాంటి ఈ సమయంలో, కేంద్ర ప్రభుత్వం బొమ్మల పరిశ్రమకు మళ్లీ
జీవం పోసేందుకు పలు రకాల చర్యలు చేపడుతోంది. #Vocal4Local#vocalforlocal
#RESPECTFORPARENTSDAY 🙏
తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి
సినిమాలు, ప్రేమ పేరుతో పిల్లలు పాడవుతున్నారు. పెద్దలంటే పూర్తిగా గౌరవం లేకుండాపోయింది. ఆ రోజుల్లో చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులంటే భయం, గౌరవం ఉండేవి. ప్రస్తుతం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. #RespectforParents
పిల్లల ఉన్నతికి తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలను భరిస్తుంటారు. అటువంటిది పెద్దయిన తర్వాత పిల్లలు వారి మాట వినరు. విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సి ఉంది.
శ్రవణ కుమారా... మమ్మల్ని మన్నించు!
శ్రవణ కుమారుడు.. ఇతని తల్లిదండ్రులిద్దరూ అంధులు.. శ్రవణుడికి వూహ తెలిశాక అమ్మానాన్న కష్టాలను చూసి చలించిపోయాడు. కళ్లు లేవని.. పుణ్యక్షేత్రాలను చూసే భాగ్యం లేదని బాధ పడే తల్లిదండ్రుల కోరిక తీర్చటం కోసం కావడిలో ఇద్దరినీ కూర్చోబెట్టుకుని
#WorldLungCancerDay 🎗 #lungcancerawareness
ఊపిరితిత్తుల క్యాన్సర్ (ఆంగ్లం: #lungcancer#cancer, లేదా lung carcinoma) ఊపిరితిత్తుల్లోని కణాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వచ్చే క్యాన్సర్.ఈ పెరుగుదల మెటాస్టాసిస్ అనే ప్రక్రియ ద్వారా కేవలం ఊపిరితిత్తులతోనే ఆగిపోకుండా చుట్టూ ఉన్న
అవయువాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. సాధారణంగా ఊపిరితిత్తుల్లో ప్రారంభమయ్యే ప్రాథమిక ఊపిరితిత్తుల క్యాన్సర్ (primary lung #cancers) లు కార్సినోమాలు (#carcinomas) ఈ క్యాన్సర్లలో అధిక భాగం (సుమారు 85 శాతం) దీర్ఘకాలం పాటు పొగాకు సేవించే వారిలో కనిపిస్తాయి.
10–15% కేసుల్లో బాధితులు ఎప్పుడూ ధూమపానం చేయలేదు.
2012 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా అందులో సుమారు 16 లక్షలమంది మరణించారు. మగవారిలో కాన్సర్ మరణాలలో ఈ వ్యాధి మొదటి స్థానంలో ఉండగా, ఆడవారిలో రొమ్ము కాన్సర్ తర్వాత ఎక్కువ మంది ఈ వ్యాధి వలననే
#sistersday#sisterlove#sisters 👧
ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలున్నప్పటికీ.. సోదర సోదరీల బంధం చాలా అందమైనది. ఒకే ఇంట్లో చిన్నప్పటి నుండి తిట్టుకుంటూ.. కొట్టుకుంటూ.. ఉండే సోదర సోదరీలు.. సోదరీమణులు పెద్దయ్యాక మాత్రం ఒక్కసారిగా మారిపోతారు. చాలా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచుకుంటారు.
అందుకే మదర్స్ డే, ఫాదర్స్ డే మాదిరిగా సిస్టర్స్ డే అనేది తోబుట్టువులకు అంకితం ఇవ్వబడింది.
మన దేశంలో ప్రతి ఏటా ఆగస్టు ఒకటో తేదీన సిస్టర్స్ డే జరుపుకుంటాం. అదే అమెరికాలో ప్రతి సంవత్సరం ఆగస్టు రెండో తేదీన సిస్టర్స్ డే జరుపుకుంటారు.
ఈరోజున సోదరీమణులందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతారు. ఈరోజున తమ జీవితంలో సోదరీమణులు ఎంత ముఖ్యమో వారికి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివన్నీ చెప్పడానికి ఒక్కరోజు సరిపోకపోయినా.. ఈరోజు వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడం ద్వారా వారిపై ఎంత ప్రేమ ఉందో వ్యక్తం చేస్తారు.
#WorldWideWebDay 🌐🕸️💻
విశ్వవ్యాప్త వలయం
వరల్డ్ వైడ్ వెబ్ ను 1991 సంవత్సరంలో CERN కి చెందిన ఇంజనీరైన టిమ్ బెర్నర్స్ లీ రూపొందించాడు. ఏప్రిల్ 30, 1993 వ తేదీన CERN వరల్డ్ వైడ్ వెబ్ ను అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లుగా ప్రకటించింది. #WorldWideWeb#www
HTML మరియు HTTP ని ప్రవేశపెట్టక మునుపు ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ మరియు గోఫర్ ప్రోటోకాల్ మొదలైన వాటిని సర్వర్ నుంచి ఫైళ్ళను రాబట్టేందుకు వాడేవారు.వెబ్ సైటుల అవసరాన్ని బట్టి వాటిని క్రింది విధంగా వర్గీకరించవచ్చు
వ్యక్తిగత వెబ్‌సైటు
వ్యాపార/ వాణిజ్య వెబ్ సైటు
ప్రభుత్వ వెబ్ సైటు
స్వచ్ఛంద సేవాసంస్థల లేదా లాభాపేక్ష రహిత సంస్థల వెబ్‌సైటులు
విద్యా సంస్థల వెబ్ సైటు
ప్రసార మాధ్యమాల వెబ్‌సైటు, మొదలగునవి ముఖ్యమైనవి.
స్నేహమేరా జీవితం.....స్నేహమేరా శాశ్వతం అన్నాడో కవి. కలకాలం నిలిచిపోయేది స్నేహమని, సృష్టిలో తీయనైంది స్నేహమేనని ఎందరో కవులు పేర్కొన్నారు. స్నేహితులంతా కలిసి ఒక పండగ సంవత్సరంలో ఒక రోజును జరుపుకోవాలని
నిర్ణయించుకొని జరుపుకుంటుంన్నాము.
రక్త సంబంధాలకూ, బీరకాయ పీచు బంధుత్వాలకూ, చత్వారపు చుట్టరికాలకూ అతీతంగా ఉండేది స్నేహం.
నిజానికి వాటన్నిటికన్నా అందమైనదీ, అపురూపమైనదీ, అద్భుతమైనదీ, అత్యున్నతమైనదీ స్నేహమే. ఇటువంటి ఎన్నో విశేషణాలు జోడించి స్నేహాన్ని వర్ణించడానికి చేసిన ప్రయత్నంలో ఎన్నెన్నో కథలు, కవితలు రూపొందాయి. కానీ స్నేహానికి వివరణలు, వర్ణనలు, తాఖీదులు, హామీలు అవసరం లేదు.