#RESPECTFORPARENTSDAY 🙏
తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి
సినిమాలు, ప్రేమ పేరుతో పిల్లలు పాడవుతున్నారు. పెద్దలంటే పూర్తిగా గౌరవం లేకుండాపోయింది. ఆ రోజుల్లో చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులంటే భయం, గౌరవం ఉండేవి. ప్రస్తుతం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. #RespectforParents
పిల్లల ఉన్నతికి తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలను భరిస్తుంటారు. అటువంటిది పెద్దయిన తర్వాత పిల్లలు వారి మాట వినరు. విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సి ఉంది.
శ్రవణ కుమారా... మమ్మల్ని మన్నించు!
శ్రవణ కుమారుడు.. ఇతని తల్లిదండ్రులిద్దరూ అంధులు.. శ్రవణుడికి వూహ తెలిశాక అమ్మానాన్న కష్టాలను చూసి చలించిపోయాడు. కళ్లు లేవని.. పుణ్యక్షేత్రాలను చూసే భాగ్యం లేదని బాధ పడే తల్లిదండ్రుల కోరిక తీర్చటం కోసం కావడిలో ఇద్దరినీ కూర్చోబెట్టుకుని
తీర్థయాత్రలకు బయల్దేరాడు. దురదృష్టవశాత్తు అడవిలో దశరథమహారాజు బాణం దెబ్బకు గురయ్యాడు. ప్రాణం పోతున్న సమయంలో కూడా ఆ మహారాజుతో తన తల్లిదండ్రుల గురించే చెబుతాడు. వారిని బాగా చూసుకోమని చెబుతూ ప్రాణాలు విడుస్తాడు....
ఇది పురాణగాథే కావచ్చు.. మన తల్లిదండ్రులపట్ల మనం ఎలా ప్రవర్తించాలో చెప్పిన కథ. మన బాధ్యతను గుర్తు చేసే కథ. మరి మనం ఏం చేస్తున్నాం? మనకు జన్మనిచ్చి.. నిలబడడానికి ఆసరా ఇచ్చి.. తలెత్తుకు తిరగడానికి మంచి జీవితాన్నిచ్చి.. ఓ స్థాయికి చేర్చిన అమ్మానాన్నలను మనం ఎలా చూస్తున్నాం..?
ఆసరాగా ఉండాల్సిన సమయంలో అన్నం పెడుతున్నామా..? కాస్తంత ఆప్యాయతానురాగాలను చూపుతున్నామా..?
సృష్టిలో ప్రతి జీవికీ అమ్మే ఆది గురువు! విద్యాబుద్ధులు నేర్చేటప్పుడు, జీవిత పాఠశాలలో అడుగిడినప్పుడు అనుభవ సారాన్ని పాఠంగా బోధించే తొలి ఉపాధ్యాయుడు నాన్నే! తొలి నమస్సుల్ని అమ్మా నాన్నలకే సమర్పించాలని నేర్పే సంస్కృతి మనది.
పురాణ పురుషులైన పరశురాముడు, శ్రీరాముడు మొదలు శ్రవణుడి వంటి ముని బాలకులు, ప్రవరుడు, పుండరీకుడు వంటి కావ్య నాయకులు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను దైవంగా భావించి సేవించినవారే.
తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచర్య దీక్ష పాటిస్తానని 'భీష్మ' ప్రతిజ్ఞ చేసిన దేవవ్రతుడు, స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందాడు. సంస్కృతాంధ్రల్లో మహాకవి భారవి... తండ్రి తనను చిన్నచూపు చూస్తున్నాడన్న భావనతో విపరీతమైన ద్వేషం పెంచుకుని, ఒక దశలో తండ్రినే హతమార్చేందుకు సిద్ధమయ్యాడు.
చివరి నిమిషంలో తండ్రి ఎందుకు తన పట్ల అలా ప్రవర్తిస్తున్నాడో తెలిసి, పశ్చాతాపంతో దహించుకుపోయాడు. అది మొదలు తల్లిదండ్రులే పరమ దైవంగా పూజించి, వారి సేవలో తరించాడు.
'తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు - పుట్టనేమి వాడు గిట్టనేమి - పుట్టలోని చెదలు పుట్టవా.. గిట్టవా..' అంటూ అమ్మా నాన్నల్ని దయతో, ప్రేమతో ఆదరించలేని బిడ్డలు.. ఎవరికీ ప్రయోజనం లేకుండా పుట్టల్లో పుట్టి చనిపోయే చెద పురుగులతో సమానమని ఈసడించాడు మన వేమన.
బిడ్డల కోసం తపించి, పుణ్యక్షేత్రాలెన్నో తిరిగి, పూజలు, వ్రతాలు చేసే తల్లిదండ్రులు, ఆపై ఆ బిడ్డల ఆలనాపాలనా, అభివృద్ధి కోసం రెక్కలు ముక్కలు చేసుకొంటారు. పుస్తెలు తాకట్టుపెట్టి బిడ్డల ఫీజులు కట్టిన తల్లులు, రక్తాన్ని స్వేదంగా మార్చి వారిని పెద్దవారిగా చేసిన నాన్నలు ఎందరో!
మరి ఆ పిల్లలే పెద్దవాళ్త్లె.. పెళ్లాం మోజులోనో, ఇంకే కారణంతోనో.. 'ఛీ ఈ ముసలి పీడ ఎప్పుడొదులుతుందో..?నని విసుక్కొంటూ, చివరకు ఇళ్ల నుంచి గెంటేసినా, 'పోన్లే బాబూ.. వాళ్లనేమీ అనకండి'.. అంటూ విశ్వమంత ప్రేమను పంచుతూనే ఉన్నారు! పంచుతూనే ఉంటారు!!
'పున్నామ నరకం నుంచి తప్పిస్తారో లేదో కానీ, బతికుండగానే అమ్మానాన్నలకు నరకం చూపకుండా వుంటే అంతే చాలు' అనే స్థాయిలో నేటి తరం ఉంది. అందుకే.. ఇకపై ఏ అమ్మా నాన్నా నిరాశ్రయులుగా, అనాథలుగా బతికే దుస్థితి కలగనీయమని నేటి 'తల్లిదండ్రులను గౌరవించు దినోత్సవం' సందర్భంగా ప్రతిన బూనుదాం రండి.
రోజూ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టకపోయినా.. సకల సౌఖ్యాలు ఇవ్వలేకపోయినా.. ఫరవాలేదు. కొద్దిసేపు వాళ్ల దగ్గర కూర్చొని, అప్యాయంగా మాట్లాడేందుకైనా వీలవదా? 'నేటి తాత స్థితే.. రేపటి కొడుకు గతి' అన్న సత్యాన్ని గుర్తెరిగి, పెద్దల్ని ప్రేమగా గౌరవించేలా
యువతను చైతన్యపరుద్దాం.. కదలండి..!
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#PsychicDay#Psychic
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే
చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. ఇలా చెప్పినవారు ప్రపంచమంతా లేకపోలేదు పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో అనేక పేర్లు వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు
అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం. అతను భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరచుకుంటారు.
#DollDay 🧚♀️🧸#Doll
ప్రాణం లేని బొమ్మలంటే పిల్లలకు భలే ఇష్టం. వాటిని చిన్నారులు అన్నీ తామై చూసుకుంటారు. స్నానం చేయిస్తారు, అన్నం తినిపిస్తారు, నిద్ర పుచ్చుతారు.బొమ్మలు పిల్లకి అపరిమితమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయి. అంతేకాక వారి మనస్సులలో చెరగని ముద్ర వేస్తాయి.
బొమ్మలతో పిల్లలు నిక్షిప్తం చేసుకునే జ్ఞా పకాలు వారికిజీవితమంతా ప్రేరణగా నిలుస్తాయి. భారత్ స్థానిక బొమ్మలకు ఎంతో ప్రసిద్ధిగాంచింది. కానీ భారతీయ మార్కెట్లోకి వచ్చిన విదేశీ బొమ్మలు ఈ పేరును చెదరగొట్టాయి. ప్రపంచంలో భారత్ అతిపెద్ద బొమ్మల వినియోగదారిగా ఉన్నప్పటికీ,
అంతర్జాతీయ బొమ్మల మార్కెట్లో మన దేశ వాటా మాత్రం కేవలం 0.5 శాతానికే పరిమితమైంది. ఇలాంటి ఈ సమయంలో, కేంద్ర ప్రభుత్వం బొమ్మల పరిశ్రమకు మళ్లీ
జీవం పోసేందుకు పలు రకాల చర్యలు చేపడుతోంది. #Vocal4Local#vocalforlocal
#WorldLungCancerDay 🎗 #lungcancerawareness
ఊపిరితిత్తుల క్యాన్సర్ (ఆంగ్లం: #lungcancer#cancer, లేదా lung carcinoma) ఊపిరితిత్తుల్లోని కణాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వచ్చే క్యాన్సర్.ఈ పెరుగుదల మెటాస్టాసిస్ అనే ప్రక్రియ ద్వారా కేవలం ఊపిరితిత్తులతోనే ఆగిపోకుండా చుట్టూ ఉన్న
అవయువాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. సాధారణంగా ఊపిరితిత్తుల్లో ప్రారంభమయ్యే ప్రాథమిక ఊపిరితిత్తుల క్యాన్సర్ (primary lung #cancers) లు కార్సినోమాలు (#carcinomas) ఈ క్యాన్సర్లలో అధిక భాగం (సుమారు 85 శాతం) దీర్ఘకాలం పాటు పొగాకు సేవించే వారిలో కనిపిస్తాయి.
10–15% కేసుల్లో బాధితులు ఎప్పుడూ ధూమపానం చేయలేదు.
2012 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా అందులో సుమారు 16 లక్షలమంది మరణించారు. మగవారిలో కాన్సర్ మరణాలలో ఈ వ్యాధి మొదటి స్థానంలో ఉండగా, ఆడవారిలో రొమ్ము కాన్సర్ తర్వాత ఎక్కువ మంది ఈ వ్యాధి వలననే
#sistersday#sisterlove#sisters 👧
ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలున్నప్పటికీ.. సోదర సోదరీల బంధం చాలా అందమైనది. ఒకే ఇంట్లో చిన్నప్పటి నుండి తిట్టుకుంటూ.. కొట్టుకుంటూ.. ఉండే సోదర సోదరీలు.. సోదరీమణులు పెద్దయ్యాక మాత్రం ఒక్కసారిగా మారిపోతారు. చాలా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచుకుంటారు.
అందుకే మదర్స్ డే, ఫాదర్స్ డే మాదిరిగా సిస్టర్స్ డే అనేది తోబుట్టువులకు అంకితం ఇవ్వబడింది.
మన దేశంలో ప్రతి ఏటా ఆగస్టు ఒకటో తేదీన సిస్టర్స్ డే జరుపుకుంటాం. అదే అమెరికాలో ప్రతి సంవత్సరం ఆగస్టు రెండో తేదీన సిస్టర్స్ డే జరుపుకుంటారు.
ఈరోజున సోదరీమణులందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతారు. ఈరోజున తమ జీవితంలో సోదరీమణులు ఎంత ముఖ్యమో వారికి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివన్నీ చెప్పడానికి ఒక్కరోజు సరిపోకపోయినా.. ఈరోజు వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడం ద్వారా వారిపై ఎంత ప్రేమ ఉందో వ్యక్తం చేస్తారు.
#WorldWideWebDay 🌐🕸️💻
విశ్వవ్యాప్త వలయం
వరల్డ్ వైడ్ వెబ్ ను 1991 సంవత్సరంలో CERN కి చెందిన ఇంజనీరైన టిమ్ బెర్నర్స్ లీ రూపొందించాడు. ఏప్రిల్ 30, 1993 వ తేదీన CERN వరల్డ్ వైడ్ వెబ్ ను అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లుగా ప్రకటించింది. #WorldWideWeb#www
HTML మరియు HTTP ని ప్రవేశపెట్టక మునుపు ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ మరియు గోఫర్ ప్రోటోకాల్ మొదలైన వాటిని సర్వర్ నుంచి ఫైళ్ళను రాబట్టేందుకు వాడేవారు.వెబ్ సైటుల అవసరాన్ని బట్టి వాటిని క్రింది విధంగా వర్గీకరించవచ్చు
వ్యక్తిగత వెబ్‌సైటు
వ్యాపార/ వాణిజ్య వెబ్ సైటు
ప్రభుత్వ వెబ్ సైటు
స్వచ్ఛంద సేవాసంస్థల లేదా లాభాపేక్ష రహిత సంస్థల వెబ్‌సైటులు
విద్యా సంస్థల వెబ్ సైటు
ప్రసార మాధ్యమాల వెబ్‌సైటు, మొదలగునవి ముఖ్యమైనవి.
స్నేహమేరా జీవితం.....స్నేహమేరా శాశ్వతం అన్నాడో కవి. కలకాలం నిలిచిపోయేది స్నేహమని, సృష్టిలో తీయనైంది స్నేహమేనని ఎందరో కవులు పేర్కొన్నారు. స్నేహితులంతా కలిసి ఒక పండగ సంవత్సరంలో ఒక రోజును జరుపుకోవాలని
నిర్ణయించుకొని జరుపుకుంటుంన్నాము.
రక్త సంబంధాలకూ, బీరకాయ పీచు బంధుత్వాలకూ, చత్వారపు చుట్టరికాలకూ అతీతంగా ఉండేది స్నేహం.
నిజానికి వాటన్నిటికన్నా అందమైనదీ, అపురూపమైనదీ, అద్భుతమైనదీ, అత్యున్నతమైనదీ స్నేహమే. ఇటువంటి ఎన్నో విశేషణాలు జోడించి స్నేహాన్ని వర్ణించడానికి చేసిన ప్రయత్నంలో ఎన్నెన్నో కథలు, కవితలు రూపొందాయి. కానీ స్నేహానికి వివరణలు, వర్ణనలు, తాఖీదులు, హామీలు అవసరం లేదు.