ప్రియమైన నా భారత ప్రజలారా..
మరి మీ అందరికోసం 8వేల మైళ్ళు ప్రయాణం చేసొచ్చేనని మీ అందరికీ తెల్సు..!!!
మధ్యలో డీజిల్ కొట్టించుకోడానికి దుబాయ్ బంకులో ఆగినప్పుడు మోడీ బావగారికి గిఫ్టిద్దాం కదాని 'సరుకు' కోసం వాకబు చెయ్యబోతే మా ఆవిడ మెలానియా అంది.. 'మా అన్నయ్యగారు
ఎనీవే బాగారూ.. వెల్డన్.. కీపీటప్.. 👏👏🙌
యే మాటకామాట చెప్పుకోద్దూ..
ఇండియాలో దిగాకా మటుకు మీరు వెల్కం చెప్పిన విధానం పద్ధతులూ చూసి నిజంగా చాలా సిగ్గేసిందండీ.. మీరు మా వైపొచ్చినప్పుడు మేము
అందుకే మా ఇవాంకా ఎప్పుడూ అంటాది.. "ఏదేవన్నా ఆళ్ల మర్యాదలే వేరు డాడీ" అని..
ఇవి చాలక మధ్య మధ్యలో ఆర్కెస్ట్రాలూ డ్యాన్సింగులూ కూడానూ.. యేమాటకామాట.. మా ఇవాంకా పెళ్ళికి పెట్టించిన ఫుల్ బ్యాండ్ పార్టీ కంటే ఇదే బాగుందబ్బా.. ముఖ్యంగా 'ఆకాశంలో ఒక తారా' రికార్డుకి డ్రమ్స్ ఎవరో కానీ బాగా కొట్టేడు కుర్రోడు.. కారు ఆపి కాసేపు విందామకున్నా.
ఇక భోజనాలు.. అబ్బబ్బబ్బా.. మా పెద్దన్నియ్యలు క్లింటనూ, బుష్షూ ఎప్పుడూ ఓ మాట చెప్తా ఉండీవోరు.. తమ్ముడూ నువ్ ఇండియా గనక
ఏం టేష్టూ.. ఏం టేష్టూ.. కాకినాడ కోటయ్య కాజాలో పాకం కోటు మీదకి ఒంపుకోకుండా తినడం ఎంత కష్టమో ముక్క కొరికాకాగానీ అర్ధం కాలేదు..
అన్నట్టు వెళ్లేప్పుడు ఓ రెండుజాడీల ఆవకాయ పెట్టిస్తాన్నారు నిర్మలా వదినగారు.. ఫ్లయిటులో నూనె కారకుండా జార్తగా సర్దించమని చెప్పాలి అమిత్ బావగార్ని..
మరేదయితేనేం..
ఇంకా రాస్తే లెంగ్తెక్కువవ్వుద్ది గనక..
మరింత బాగా చూస్కుంటున్న మీ మైత్రిబంధం మాతో చిరకాలం ఇలాగే డైలీ సీరియల్స్ లాగా నిలిచిపోవాలని కోరుకుంటూ.. ఇక దిగడతామండి మరి..