కరోనా వచ్చిందని ఇంట్లో అందరూ ఉన్నారని హైరానా పడిపోవద్దు. కూరగాయలు లేవనీ, దొరకటం లేదని టెన్షన్ పడొద్దు .
ఒక్కసారి మీ చిన్నప్పటి విషయాలు గుర్తుకు తెచ్చుకోండి .
బంగాళాదుంపలు వేపుడు చేస్తే పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. లేకపోతే రెండు ఒడియాలు వేయించండి చాలు.
రెండో రోజు మెంతి మజ్జిగ,లేదా మజ్జిగ చారు చేసుకుని కంది పచ్చడి గాని పెసర పచ్చడి గాని చేస్తే అద్భుతః !
కంది పొడి ,కరివేపాకు పొడి, నువ్వుల పొడి ఇవన్నీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుంది
తరవాత ఎలాగో కొంచెం ఉధృతం తగ్గుతుంది కాబట్టి బయటకు వెళ్లి మనకి కావలసనవి ఒక వారం పది రోజులకు సరిపడా తెచ్చుకోవచ్చు.
!ఒక వారం రోజులు కూరగాయలు పళ్ళు తినక పోయినంత మాత్రాన ఏమీ జరగదు. కాబట్టి ఇవి ఆలోచించి ఆచరించి చూడండి.