బాదం (ఆంగ్లం #Almond) చెట్టులను విత్తనాలలోని పిక్కలకోసం పెంచుతారు.ఇది మిడిల్ ఈస్ట్ లో పుట్టి ప్రపంచమతా వ్యాపించింది.బాదం గింజలు బలవర్థకమైన ఆహారం.జలుబు,జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి.బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
#బాదం 🌱🌰
#WorldAlmondDay 🌰
బాదంపాలును బాదంపప్పులను ఉపయోగించి తయారు చేస్తారు. ఆవు పాలు లేక ఇతర జంతువుల పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది.
మామూలుగా ఇది తెలుపు రంగులో ఉంటుంది. రుచి కొరకు, ఆకర్షణ కొరకు ఇతర పదార్థములను కలుపుట వలన రంగు మారుతుంది.
బాదం.. పోషకాహారం.
తక్షణశక్తికి : అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకొంటే తక్షణ శక్తి సొంతమవుతుంది.
మధుమేహానికి : మధుమేహంతో బాధపడేవారు భోజనం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది.
మెదడుకు మేత : నీళ్లలో రెండు మూడు బాదం పప్పులు నానబెట్టి మర్నాడు చిన్నారులకు తినిపిస్తే జ్ఞాపకశక్తి వృద్ధవుతుంది